టాక్ ఓకే.. అక్షయ్ సినిమాకు ఈసారైనా కలెక్షన్స్ వస్తాయా?
జలియన్ వాలాబాగ్ హత్యాకాండ నేపథ్యంలో రూపొందిన కోర్టు డ్రామా కేసరి ఛాప్టర్ 2 ఇప్పుడు చర్చనీయాంశమైంది.;
జలియన్ వాలాబాగ్ హత్యాకాండ నేపథ్యంలో రూపొందిన కోర్టు డ్రామా కేసరి ఛాప్టర్ 2 ఇప్పుడు చర్చనీయాంశమైంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రంలో మాధవన్, అనన్య పాండే వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. ఫ్రీడమ్ ఫైటర్ చెట్టూర్ శంకరన్ నాయర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తీవ్ర భావోద్వేగాలతో సాగుతుంది.
తెలుగు వర్గాలు సహా బాలీవుడ్ క్రిటిక్స్ కూడా ఈ సినిమాకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అక్షయ్ నటన, మాధవన్ ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్, అనన్య ఎమోషనల్ సీన్స్.. అన్నీ కలసి ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ట్రైలర్ చూసినప్పటి నుంచే ఆసక్తిని పెంచిన ఈ చిత్రం, విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ప్రత్యేకించి కోర్ట్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ఇలా అన్ని టెక్నికల్ అంశాలు ప్రశంసలందుకుంటున్నాయి.
అయితే ఈ విధంగా చక్కటి టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రాబడి కూడా అదే స్థాయిలో ఉండాలని భావించారు. కానీ మొదటి రోజు ఇండియాలో 7.5 కోట్ల నుండి 8.5 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే రాగా, అక్షయ్ స్థాయిలో ఇది తక్కువే అనిపిస్తోంది. అది కూడా సెలవు రోజు విడుదల కావడంతో భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేశారు. కానీ ప్రేక్షకులు పెద్దగా థియేటర్లకు రావడంలో వెనకడుగు వేశారనే చెప్పాలి.
ఇక్కడ అసలు సమస్య ‘కంట్రోల్డ్ రిలీజ్’. సాధారణంగా బాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల విడుదల భారీగా ఉంటుంది. కానీ కేసరి 2 మాత్రం లిమిటెడ్ స్క్రీన్ కౌంట్‌తో విడుదలైంది. దీంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. ముఖ్యంగా సిటీస్‌లో థియేటర్ దొరకకపోవడం వల్ల కూడా ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్లలేకపోయారు. దీనిపై డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ పై విమర్శలు వస్తున్నాయి.
అలాగే, అక్షయ్ కుమార్ ఇటీవల వరుస ఫ్లాప్స్ లో ఉండడం కూడా ఓ డిస్కరేజ్‌మెంట్ అయ్యింది. కొన్ని సినిమాలు అద్భుతమైన కథలతో ఉన్నా, గత రికార్డులు ప్రేక్షకులను వెనక్కి తిప్పేలా చేస్తాయి. ఇదే విషయాన్ని ఈ సినిమా బలంగా అనుభవించినట్టు అనిపిస్తోంది. కానీ ఒకవేళ వీకెండ్‌లో వర్డ్ ఆఫ్ మౌత్ బాగా పని చేస్తే, మంచి గ్రోత్ రాబట్టే అవకాశముంది.
మొత్తానికి, కేసరి ఛాప్టర్ 2 కి టాక్ బాగా వచ్చిందనడంలో సందేహం లేదు. కానీ టాక్ బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి. క్లాస్ సినిమాలకు మాస్ కలెక్షన్లు రావాలంటే ఆడియన్స్ సపోర్ట్ కావాలి. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఇస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గేమ్ చేంజర్ కావచ్చు. ఏదేమైనా అక్షయ్ గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ చూసింది లేదు. మరి ఈసారైనా అతను కలెక్షన్స్ ను పెంచుతాడో లేదో చూడాలి.