సామ్- కీర్తి.. ఏడేళ్ల క్రితం మొదలైంది!
ఇక సమంత, కీర్తి స్నేహం ఏడేళ్లుగా కొనసాగుతోంది. ఆ ఇద్దరూ ఒకరి సినిమాల్ని ఒకరు ప్రమోట్ చేస్తారు.;
పరిశ్రమలో స్నేహాలు టెంపరరీ అని అంటారు కానీ, అందుకు భిన్నంగా గొప్ప స్నేహాన్ని కొనసాగించే నటీనటులు కూడా ఉన్నారు. `మహానటి` చిత్రంలో కలిసి నటించిన కీర్తి సురేష్- సమంత మధ్య స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే. సావిత్రి పాత్రలో తన అత్యుత్తమ నట ప్రదర్శనతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డ్ అందుకున్న కీర్తి, అదే సినిమాలో జర్నలిస్టు పాత్రలో నటించిన సమంత ప్రదర్శనపైనా ప్రశంసలు కురిపించింది.
ఇక సమంత, కీర్తి స్నేహం ఏడేళ్లుగా కొనసాగుతోంది. ఆ ఇద్దరూ ఒకరి సినిమాల్ని ఒకరు ప్రమోట్ చేస్తారు. బర్త్ డేలు, వెడ్డింగ్ డేలు, ఇతర ఈవెంట్లను కలిసి సెలబ్రేట్ చేసుకున్న సందర్భాలున్నాయి. కొత్త సంవత్సర వేడుకల కోసం విదేశాలలో మీట్ అండ్ గ్రీట్ లను ఆస్వాధించారు. అదంతా సరే కానీ, ఇప్పుడు కీర్తి సురేష్ తన బెస్ట్ ఫ్రెండ్ సమంతకు విషెస్ చెప్పిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది.
కీర్తి ఎర్రచీరలో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ, ఫేస్ బుక్ లో ఒక వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోతో పాటు సమంత నిర్మాణ సంస్థ `ట్రలాలా మూవింగ్ పిక్చర్స్`కి శుభాకాంక్షలు తెలింది. ఈ బ్యానర్ లో శుభం సినిమా గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షించింది. ఏడేళ్ల క్రితం `మహానటి` స్పెషల్ మూవీ రిలీజైన సమయంలోనే సమంత సొంత బ్యానర్ ప్రారంభించి తొలి అడుగు వేసిందని కూడా కీర్తి గుర్తు చేసింది. నాటి సెలబ్రేషన్ ఇంకా తన మనసులో అలాగే గుర్తుండిపోయిందని కూడా అద్భుతమైన స్టెప్పులు వేస్తూ స్పెషల్ వీడియో ద్వారా గుర్తు చేసింది. కీర్తి విషెస్ కి బెస్ట్ ఫ్రెండ్ సమంత స్పందించాల్సి ఉంది. కీర్తి సురేష్ ఇటీవలే తన స్నేహితుడిని పెళ్లాడి లైఫ్ లో సెటిలైన సంగతి తెలిసిందే. పెళ్లి తరవాతా నటనలో కొనసాగుతోంది. సమంత, నాగచైతన్యతో బ్రేకప్ తర్వాత తన కెరీర్ జర్నీని కొనసాగిస్తోంది. నటిగా, నిర్మాతగా తన ప్రయత్నాల్లో తాను ఉంది. నిర్మాతగా ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. నిర్మాతగా తొలి మూవీ శుభం ఈనెల 9న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.