కీర్తికి మరో మహానటి పడాల్సిందే..?
సినిమాలు సక్సెస్ అవ్వకపోవడం అందుకు ఒక రీజన్ అయితే పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకోవడం అనేది కూడా మరో రీజన్ అవుతుంది.;
సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కీర్తి సురేష్ ఆఫ్టర్ మ్యారేజ్ కెరీర్ లో కాస్త వెనకపడింది. సినిమాలు సక్సెస్ అవ్వకపోవడం అందుకు ఒక రీజన్ అయితే పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకోవడం అనేది కూడా మరో రీజన్ అవుతుంది. పెళ్లి తర్వాత అమ్మడి నుంచి వచ్చిన బేబీ జాన్, అమెజాన్ ప్రైం లో వచ్చిన ఉప్పు కప్పురంబు సినిమాలు నిరాశపరిచాయి. కీర్తి రేంజ్ కి తగిన సినిమాలు కాదనే టాక్ వచ్చింది.
విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన్..
కీర్తి సురేష్ ప్రస్తుతం రివాల్వర్ రీటా సినిమా ఆగష్టు 27 రిలీజ్ అన్నారు కానీ అది రిలీజైంది లేదన్నది తెలియదు. అసలేమాత్రం బజ్ లేకుండా సినిమా రిలీజ్ చేసి ఉండకపోవచ్చు. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన్ సినిమా చేస్తుంది. అదే కాకుండా వేణు యెల్దండి చేసే ఎల్లమ్మ లో కూడా కీర్తి సురేష్ లీడ్ రోల్ అని టాక్.
ఎల్లమ్మ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుందని తెలిస్తే మాత్రం కచ్చితంగా ఆమెకు మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చే ఛాన్స్ దొరికినట్టే. ఆ సినిమాలో సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇద్దరిలో ఒకరికి నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఐతే ఆ అవకాశాన్ని కీర్తి సురేష్ అందుకుందని టాక్. కీర్తి సురేష్ కెరీర్ లో మహానటి ఒక గొప్ప సినిమా. ఆ సినిమాలో ఆమె అభినయం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.
బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్..
ఆ సినిమాతో కీర్తి సురేష్ కెరీర్ లో ఫస్ట్ టైం బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ సైతం తెచ్చుకుంది. సో మళ్లీ ఆమె కెరీర్ లో మరో మహానటి సినిమా పడాలి. అప్పుడే కీర్తి సురేష్ తిరిగి బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కీర్తి సురేష్ కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. కీర్తి సురేష్ లో ఒక కంప్లీట్ యాక్ట్రెస్ ఉంటుంది. అటు ట్రెండీగా కనిపిస్తూనే ఇటు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఏదైనా రోల్ చేయమన్నా చేస్తుంది. ముఖ్యంగా తన అభినయంతో క్యారెక్టర్ కు 100 శాతం న్యాయం చేస్తుంది.
అందుకే కొన్ని కథలకు కొంతమంది ఆర్టిస్టులు మాత్రమే న్యాయం చేస్తారనేలా ఎంపిక జరుగుతుంది. సౌత్ లోనే కాదు బాలీవుడ్ నుంచి కూడా కీర్తి సురేష్ కి మరో ఛాన్స్ వచ్చిందని టాక్. ఆ సినిమాకు సంబందించిన డీటైల్స్ కూడా త్వరలో తెలుస్తాయి.