ఆ సక్సెస్ పుల్ కాంబినేషన్ కోసం కళావతి!
`బేబిజాన్` తో కీర్తి సురేష్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ తొలి సినిమా అమ్మడికి డిజాస్టర్ నే మిగిల్చింది.;
'బేబిజాన్' తో కీర్తి సురేష్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ తొలి సినిమా అమ్మడికి డిజాస్టర్ నే మిగిల్చింది. విజయంతో బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందుకుంటుందనుకుంటే? అందుకు ఆస్కారం లేకుండా పోయింది. ఇటు తెలుగులో కూడా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం తమిళ్ లో రెండు సినిమాలు చేస్తోంది. 'రివాల్వర్ రీటా', 'కన్నై వేడి' చిత్రాల్లో నటిస్తోంది. మరి బాలీవుడ్ సంగతేంటి? అక్కడ లైట్ తీసుకున్నట్లేనా? అంటే నో ఛాన్స్ అంటూ మరో కొత్త ఛాన్స్ తో మురిపించేలా ఉంది.
కీర్తి కి మరో బాలీవుడ్ ఛాన్స్:
యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కి జంటగా ఓ సినిమాలో ఛాన్స్ అందుకుందని బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఏంటా సినిమా? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. కార్తీక్ ఆర్యన్-లవ్ రంజన్ మరోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఇద్దరు కలిసి ఐదవ సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసిందే. ఇటీవలే లవ్ రంజన్ కీర్తికి టచ్ లో కి వెళ్లి స్టోరీ నేరేట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కార్తీ కూడా పాత్ర నచ్చడంతో సానుకూలంగా స్పందించిందిట. అయితే ఆ పాత్రకు సంబంధించి టెస్ట్ షూట్ నిర్వహించిన తర్వాతే హీరోయిన్ ఎంపిక ఫైనల్ అవుతుందని లవ్ రంజన్ చెప్పాడుట.
ఫైనల్ డెసిషన్ ఎప్పుడో:
కీర్తితో పాటు మరో నలుగురు బాలీవుడ్ హీరోయిన్లకు స్టోరీ నేరేట్ చేసారుట. అందులో ఇద్దరు భామల్ని టెస్ట్ షూట్ అనంతరం ఎంపిక చేస్తారని వార్తలొస్తున్నాయి. మరి టెస్ట్ షూట్ లో కీర్తి ఫెయిల్ అవుతుందా? పాస్ అవుతుందా? అన్నది ఇప్పుడే తేలదు. అందుకు సమయం పడుతుంది. వాస్తవానికి ఏ నటినైనా బాలీవుడ్ మేకర్స్ టెస్ట్ షూట్ నిర్వహిచంచిన తర్వాత స్టోరీ నేరేట్ చేస్తుంటారు. పాత్రకు సెట్ అవుతుందా? లేదా? అన్నది అక్కడే తేల్చేస్తారు.
కొత్త ఏడాదిలో షురూ:
కానీ లవ్ రంజన్ తాను ఎంపిక చేసిన నలుగురు భామలు పాత్రలకు పోటా పోటీగా ఉన్నారు? అన్న ధీమాతో టెస్ట్ షూట్ కి వెళ్లకుండానే స్టోరీ నేరేట్ చేసినట్లు తెలుస్తోంది. కానీ హీరోయిన్ ఛాన్స్ అన్నది ఇద్దరికే ఉంటుంది. మరి మిగతా ఇద్దరు భామల్ని ఇతర పాత్రలకేమైనా పరిశీలిస్తున్నాడా? మరేదైనా సినిమాకు పరిశీలిస్తున్నాడా? అన్నది తేలాలి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గత చిత్రాల్లాగే బలమైన వినోందం, సంగీతం కామెడీ ఎంటర్ టైగనర్ గా సాగే చిత్రమిది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.