కళావతి అక్క ఇండస్ట్రీలో ఓ డాన్సర్!
కీర్తి సురేష్ అలియాయస్ కళావతి కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. మాలీవుడ్ టూ టాలీవుడ్ , కోలీవుడ్ మీదుగా బాలీవుడ్ కి ఇటీవలే అడుగు పెట్టింది.;
కీర్తి సురేష్ అలియాయస్ కళావతి కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. మాలీవుడ్ టూ టాలీవుడ్ , కోలీవుడ్ మీదుగా బాలీవుడ్ కి ఇటీవలే అడుగు పెట్టింది. సౌత్ లో ఓ వెలుగు వెలిగిన కళావతి ఇప్పడిప్పుడే బాలీవుడ్ లోనూ బిజీ అవుతోంది. వస్తోన్న అవకాశాలను తెలివిగా సద్వినియోగం చేసుకుంటుంది. డెబ్యూ `బేబీజాన్` ఆశించిన ఫలితాన్నివ్వనప్పటికీ కొత్త ఛాన్సులు తగ్గలేదు. మనసుకు నచ్చిన పాత్రల్ని ఎంచు కురంటూ కెరీర్ ని ముందుకు తీసుకెళ్తుంది. అలాగని సౌత్ ఇండస్ట్రీకి దూరం కాలేదు. ఇక్కడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది.
తెలుగింట మహానటి:
హీరోయిన్ పాత్రలకే కమిట్ అవ్వకుండా? మంచి పాత్రలు వేటికైనా ఎస్ చెబుతూ ముందుకెళ్తుంది. అలనాటి మాలీవుడ్ నటి మేనక కుమార్తె అయినా? ఆప్రభావం ఎక్కడా పడకుండా కెరీర్ లో ముందుకు సాగుతుంది. అంత పెద్ద నటి కుమార్తె అయినా? చిత్ర పరిశ్రమలో ప్రతిభను నమ్ముకున్న నటి కీర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే మహానటిగా తెలుగింట నీరాజనాలు అందుకుంది. తెలుగు అభిమానుల గుండెల్లో చిరస్థాయి స్థానాన్ని సంపాదించుకుంది. ఒకానొక సందర్భంలో తాను మేనక కుమా ర్తె అని తెలిగాయనే చిరంజీవి సైతం ఎంతో సంతోషించారు.
డాన్సర్ మాత్రమే:
సహచర నటి కుమార్తె కావడంతో? చిరు తో కీర్తి సాన్నిహిత్యానికి ఎంతో దోహదపడింది. చిరు కుటుంబంలో కీర్తి సైతం భాగం అన్నట్లుగా ఆమె ప్రాధాన్యత పెరిగింది. ఇదంతా కీర్తి సురేష్ గురించి. మరి ఈ అందమైన హీరోయిన్ కు ఓ అక్క కూడా ఉందని? ఎంత మందికి తెలుసు? అవును . కీర్తి సురేష్ కి ఓ సోదరి కూడా ఉంది. ఆమె పేరు రేవతి. తాను కూడా ఇండస్ట్రీలో ఉంటుంది. కానీ తాను ఓ డాన్సర్ మాత్రమే. నటనా రంగం వైపు రానట్లు కీర్తి మాటల్లో బయట పడింది. రేవతి బాగా లావుగా ఉండేవారుట.
అక్క సలహాతో అధిగమించి:
దీంతో ఇద్దరు కీర్తి ససురేష్ సలహాతోనే ఇద్దరు యోగా క్లాస్ ల్లో జాయిన్ అయినట్లు తెలిపింది. చెల్లెలు ప్రోత్సాహంతోనే అక్క బరువు తగ్గినా? అక్క లేకపోతే సినిమాల్లో చెల్లి లేదని గర్వంగా ఎక్కడైనా చెబుతా నని తెలిపింది కీర్తి. కెరీర్ తొలి నాళ్లలలో వైఫల్యాలు ఎదురైన సమయంలో రేవతి ధైర్యం చెప్ప డంతోనే సినిమాల్లో కొనసాగినట్లు గుర్తు చేసుకుంది. `నేను లోకల్` సినిమాలో నానితో కలిసి నటించే టప్పుడు సవాళ్లు ఎదురవుతాయని రేవత ముందే గెస్ చేసి చెప్పారుట. అన్నట్లు గానే అలాంటి పరిస్థితి ఎదు రైందని....కానీ రేవతి ఇచ్చిన సూచనలు, సలహాలతో వాటిని అధిగమించినట్లు గుర్తు చేసుకుంది కీర్తి. అలాగే `మరక్కర్` సినిమాకు రేవతి టెక్నిషీయన్ గా, కీర్తి సురేష్ నటిగా పని చేసినట్లు చెల్లెలు సంతో షంగా వ్యక్తం చేసింది.