• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గ్లామర్ గేట్లు ఎత్తేసిన...

గ్లామర్ గేట్లు ఎత్తేసిన మహానటి!

| నిజానికి 'బేబీ జాన్' సినిమా సైన్ చేసినప్పటి నుంచే కీర్తి సురేష్ కాస్ట్యూమ్స్ లో చేంజ్ కనిపించిందనే టాక్ ఉంది. ఫోటో షూట్స్ లోనూ తనలోని గ్లామర్ కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసిందనే మాటలు వినిపించాయి.

By - Tupaki Desk
Update: 2024-11-25 16:32 GMT

టాలీవుడ్ లో పద్ధతిగా కనిపించే హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. 'నేను శైలజ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ ప్రారంభం నుంచీ బోల్డ్ రోల్స్ కు దూరంగానే ఉంటూ వచ్చింది. కమర్షియల్ చిత్రాల్లో మోడరన్ గర్ల్ రోల్స్ చేసినా సరే.. ఎన్నడూ హద్దులు దాటలేదు. ఇప్పటి వరకూ స్క్రీన్ మీద ఎక్కడా గ్లామర్ షో చెయ్యలేదు. తన అభినయంతోనే 'మహానటి'గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. అయితే ఇప్పుడు కీర్తి గ్లామర్ గేట్లు ఎత్తేసినట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ డెబ్యూ కోసం తనలోని కొత్త యాంగిల్ ను చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగు తమిళ మలయాళ చిత్రాలతో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్.. ''బేబీ జాన్'' మూవీతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. 'తేరి' హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో, హీరో వరుణ్ ధావన్ కు జోడీగా నటిస్తోంది. మాతృకలో సమంత రూత్ ప్రభు పోషించిన పాత్రలో కీర్తి కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ లో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి 'నెయిన్ మటక్కా' అనే వీడియో సాంగ్ రిలీజయింది. ఇందులో వరుణ్ ధావన్ తో కలిసి డ్యాన్స్ లతో అదరగొట్టింది కీర్తి. అంతేకాదు గ్లామర్ అవతార్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇన్నాళ్లూ ఎక్కువ శాతం సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించి ఆడియన్స్ ను ఆకట్టుకున్న కీర్తి సురేష్.. 'నెయిన్ మటక్కా' పాటలో థైస్ కనిపించేలా చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించింది. కీర్తి ఇంతకుముందెన్నడూ ఇలాంటి కాస్ట్యూమ్స్ లో ఇంత గ్లామరస్ గా కనిపించలేదని చెప్పాలి. అందుకే బాలీవుడ్ దృష్టిని ఆకర్షించడానికే మహానటి రూటు మార్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే కేవలం ఈ సాంగ్ లో మాత్రమే ఆమె ఇలా కనిపిస్తుందా? లేదా సినిమాలో క్యారక్టర్ ఇలానే ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే 'తేరి'లో సమంత పాత్రకు ఇలాంటి గ్లామర్ టచ్ ఇవ్వలేదు. హిందీ ఆడియన్స్ కోసం మార్పులు చేశారేమో అనిపిస్తుంది.

నిజానికి 'బేబీ జాన్' సినిమా సైన్ చేసినప్పటి నుంచే కీర్తి సురేష్ కాస్ట్యూమ్స్ లో చేంజ్ కనిపించిందనే టాక్ ఉంది. ఫోటో షూట్స్ లోనూ తనలోని గ్లామర్ కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసిందనే మాటలు వినిపించాయి. సినిమా ఫంక్షన్స్ కు కిడా అలాంటి దుస్తులే వేసుకొని రావడంతో, డ్రెస్సింగ్ విషయంలో కండిషన్లు లేవని చెప్పకనే చెప్పిందని అందరూ భావించారు. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు 'నెయిన్ మటక్కా' సాంగ్ లో చాలా గ్లామరస్ గా కనిపించింది. ఆమెను 'మహానటి' లాంటి నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లో, సంప్రదాయ దుస్తుల్లో చూసిన జనాలు.. గ్లామర్ లుక్ లో చూసి షాక్ అవుతున్నారు. మరి ఈ ప్రయత్నం హిందీ చిత్ర పరిశ్రమలో కీర్తికి ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తుందో చూడాలి.

ఇటీవల కాలంలో కీర్తి నటించిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. 'భోళా శంకర్' 'సైరన్' 'రఘు తాత' చిత్రాలు నిరాశ పరిచాయి. దీంతో ఇప్పుడు ''బేబీ జాన్'' మూవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. కాలీస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఒరిజినల్ డైరెక్టర్ అట్లీ నిర్మిస్తున్నారు. వామికా గబ్బి మరో హీరోయిన్ గా నటిస్తుండగా.. జాకీ ష్రాఫ్ విలన్ గా కనిపించనున్నారు. ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Full View
Tags:    
  • Keerthysuresh 
  • Babyjhon 
  • Varundhawan 
  • Nainmatakka 
  • Diljitdosanjh 
  • Dhee 
  • ThamanS 
  • IrshadK 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS