ఎల్లమ్మ.. ఇబ్బందులు దాటేదెలా..?
బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వేణు యెల్దండి తన రెండో సినిమాను ఎల్లమ్మ అంటూ ప్రకటించాడు.;
బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వేణు యెల్దండి తన రెండో సినిమాను ఎల్లమ్మ అంటూ ప్రకటించాడు. దాదాపు రెండేళ్ల నుంచి ఆ సినిమా స్క్రిప్ట్ మీద కూర్చున్న వేణు అదిరిపోయేలా కథ రాసుకున్నాడు. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తైంది. బలగం లాంటి హిట్ ఇచ్చాడు కాబట్టి ఈసారి వేణు కోరినంత బడ్జెట్ ఇచ్చేందుకు దిల్ రాజు డిసైడ్ అయ్యారు. ఇక సినిమా మొదలు పెట్టడమే తరువాయి అనుకుంటున్న టైం లో ఎల్లమ్మ కాస్టింగ్ పై జరుగుతున్న చర్చలు షాక్ ఇస్తున్నాయి.
తమ్ముడు డిజాస్టర్ అవ్వడంతో..
ముందు ఈ సినిమాలో హీరో ఎవరన్నది ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎల్లమ్మ సినిమాను ముందు నానితో చేయాలనుకున్నాడు వేణు కానీ హీరోయిన్ పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటం వల్ల అతను కాదన్నాడట. ఇక రేసులో నితిన్ వచ్చాడు. ఐతే దిల్ రాజు, నితిన్ చేసిన తమ్ముడు డిజాస్టర్ అవ్వడంతో నితిన్ తో ఎల్లమ్మ కూడా రిస్క్ అని భావించాడు దిల్ రాజు. అందుకే ఎల్లమ్మలో నితిన్ దాదాపు కన్ ఫర్మ్ అని చెప్పి మరీ అతన్ని బయటకు వెళ్లేలా చేశారు.
ఇక శర్వానంద్ తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఈ సినిమాలో నటిస్తాడన్న వార్తలు వచ్చాయి. వీరవరు కాదు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాలో నటిస్తున్నారని అంటున్నారు. ఐతే ఎల్లమ్మ హీరో గురించి ఇంతగా డిస్కషన్ జరుగుతుండగా హీరోయిన్ గా కీర్తి సురేష్ ఫైనల్ అని అనుకున్నారు. వేణు ఈ సినిమాలో ముందు సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకోగా ఆమె ఈ సినిమా చేయడానికి డేట్స్ అడ్జెస్ట్ కావని చెప్పడంతో ఆ ఆఫర్ కీర్తి సురేష్ కి వచ్చింది.
ఇప్పుడు హీరోయిన్ కూడా లేదన్న మ్యాటర్..
ఐతే లేటెస్ట్ గా కీర్తి సురేష్ తన కొత్త సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో ఎల్లమ్మలో తాను నటించట్లేదని చెప్పి షాక్ ఇచ్చింది. ఎల్లమ్మ సినిమాలో ఇన్నాళ్లు హీరో మాత్రమే కన్ ఫర్మ్ అవ్వలేదని అనుకుంటుండగా ఇప్పుడు హీరోయిన్ కూడా లేదన్న మ్యాటర్ అర్థమైంది. కీర్తి సురేష్ ముందు చేయాలని అనుకుని తర్వాత కాదన్నదా లేదా ఆమె ముందు నుంచి రిజెక్ట్ చేసిందా అన్నది తెలియాల్సి ఉంది. కీర్తి సురేష్ ఎల్లమ్మ కామెంట్స్ పై ఆడియన్స్ అంతా షాక్ అవుతున్నారు.
కీర్తి కాకపోతే ఎల్లమ్మ లో ఫిమేల్ లీడ్ గా ఎవరికి ఛాన్స్ ఇస్తారు.. సినిమాలో హీరోయిన్ పాత్ర వెయిట్ ఎక్కువ ఉంటుందని తెలిసినా కూడా ఎవరు ఈ ప్రాజెక్ట్ పై ఎందుకు ఆసక్తి చూపించట్లేదు అన్నది తెలియాల్సి ఉంది. మరి దిల్ రాజు ప్రొడక్షన్ లో ప్రెస్టీజియస్ గా రాబోతున్న ఎల్లమ్మ మీద ఇన్ని రకాలుగా డిస్కషన్ జరగడం కొత్తగా ఉంది. మరి వీటన్నిటికీ ఆన్సర్ ఇస్తూ ఎస్.వి.సీ బ్యానర్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే బెటర్ లేదంటే సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ కాస్త పడిపోయే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.