ముంబై ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా కీర్తిసురేష్.. హైలెట్ అదే!
సౌత్ బ్యూటీ కీర్తి సురేష్ తాజాగా తన ట్రెండీ లుక్స్ తో మెయిన్ మీడియాలో హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా కీర్తి సురేష్ పాల్గొన ఒక ఈవెంట్లో అందరికంటే ఈమె సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.;
సౌత్ బ్యూటీ కీర్తి సురేష్ తాజాగా తన ట్రెండీ లుక్స్ తో మెయిన్ మీడియాలో హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా కీర్తి సురేష్ పాల్గొన ఒక ఈవెంట్లో అందరికంటే ఈమె సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. మరి ఇంతకీ కీర్తి సురేష్ ఏ ఈవెంట్ కి వెళ్ళింది అంటే.. తాజాగా నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన Bvlgari ఈవెంట్లో కీర్తి సురేష్ బ్లాక్ అండ్ వైట్ అవుట్ ఫిట్ తో అద్భుతమైన జువెలరీ మోడల్స్ ధరించి మెరిసింది. ఈ ఈవెంట్లో కీర్తి సురేష్ తో పాటు ప్రియాంక చోప్రా, సమంతా రుత్ ప్రభు, త్రిప్తి డిమ్రీ, తమన్నా భాటియా వంటి నటీమణులు సందడి చేశారు. అయితే ఈ ఈవెంట్లో అందరికంటే స్పెషల్ అట్రాక్షన్ గా హీరోయిన్ కీర్తి సురేష్ నిలిచింది. దానికి కారణం ఆమె తన మెడలో వేసుకున్న పాము లాంటి నెక్ చైన్..
రోమన్ హస్తకళను భారతీయ కళాత్మకతతో అందంగా కలగలిపి చేసే లగ్జరీ బ్రాండ్ సెర్పెంటి కలెక్షన్ ని ధరించి కీర్తి సురేష్ ఆ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు,వీడియోలు నెట్టింట వైరల్ గా మారడంతో పాటు కీర్తి సురేష్ తన సోషల్ మీడియా ఖాతాలో కూడా ఆ బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలో అన్నింటికంటే కీర్తి సురేష్ ధరించిన సెర్పెంటి నెక్ చైన్ హైలెట్గా నిలుస్తోంది. అంతేకాదు ఈ ఫోటోలకు క్యాప్షన్ గా .." ఇది నిన్నటి రాత్రి అంతా స్నేక్ ఇయర్ అంటూ క్యాప్షన్ ఇచ్చి Bvlgari స్పూర్తి, వారసత్వం భారతీయ వారసత్వంతో కలిసి పోవడాన్ని చూడడం నిజంగా అద్భుతంగా ఉంది" అంటూ రెడ్ హాట్ సింబల్ ని షేర్ చేసింది. ప్రస్తుతం కీర్తి సురేష్ పెట్టిన ఈ పోస్ట్ కి కొద్ది గంటల్లోనే వేలాది లైక్స్ వచ్చాయి.
అయితే కీర్తి సురేష్ షేర్ చేసిన ఈ ఫోటోలపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణం కీర్తి సురేష్ పెళ్లి తర్వాత తన లుక్ మొత్తం మారిపోయింది అనే రూమర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె స్టైలిష్ డ్రెస్సులు వేసుకున్నప్పటికీ మొహంలో కొన్ని మార్పులు కొట్టచ్చినట్టు కనిపిస్తున్నాయని వాటిని ఎత్తిచూపుతున్నారు నెటిజన్స్. ఆమె ముఖం లో ముసలి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కొంతమంది నెగటివ్ కామెంట్లు కూడా పెడుతున్నారు. కానీ కీర్తి సురేష్ అభిమానులు మాత్రం ఈ నెగటివ్ కామెంట్లను ఖండిస్తున్నారు..
కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే..ఈ ఏడాది కీర్తి సురేష్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అలా ప్రస్తుతం ఈ హీరోయిన్ బాలీవుడ్ లో అక్క అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే తమిళంలో కన్నివేది, రివాల్వర్ రీటా అనే సినిమాలలో నటిస్తోంది. టాలీవుడ్ విషయానికి వస్తే..రెండు జళ్ళ సీత సినిమాలో కూడా నటిస్తోంది.అలా తెలుగు ,తమిళ, హిందీ భాషల్లో రాణిస్తూ పెళ్లి తర్వాత కూడా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటోంది.