మల్లెపూల అందంతో కీర్తి కిర్రాక్ గ్లామర్ టచ్

రెగ్యులర్ గా సాంప్రదాయత్మక పాత్రల్లో కనిపించే కీర్తి సురేష్, ఇటీవల తన స్టైల్‌ ట్రెండ్ ను ఒక్కసారిగా మార్చేసింది.;

Update: 2025-07-17 13:05 GMT

రెగ్యులర్ గా సాంప్రదాయత్మక పాత్రల్లో కనిపించే కీర్తి సురేష్, ఇటీవల తన స్టైల్‌ ట్రెండ్ ను ఒక్కసారిగా మార్చేసింది. ఆమె యాక్టింగ్‌, పాత్ర ఎంపికలు విశేషంగా ఉంటే.. ఇప్పుడు ఫ్యాషన్ స్టేట్మెంట్‌ కూడా ఓ లెవల్‌కి వెళ్లిపోయింది. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘ఉప్పు కప్పురంబా’ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న కీర్తి లుక్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సంప్రదాయ దుస్తులతో ట్రెండీ లుక్‌ని మిక్స్ చేస్తూ ఇచ్చిన షాక్ హైలైట్ అయ్యింది.

సాధారణంగా చీరకట్టులో కనిపించే కీర్తి ఈసారి సరికొత్త లుక్‌తో ఫ్యాషన్ లవర్స్‌కి టాక్ పాయింట్‌ అందించింది. డెనిమ్ కార్సెట్ టాప్‌తో కలిపిన కాటన్ బ్లూ చీర, తలనిండా మల్లె పూలతో జడ, గోల్డ్ బ్యాంగిల్స్‌, నెక్లెస్ వంటి ఆభరణాలు ఆమె లుక్‌ను మరింత హైలైట్ చేశాయి. ఈ మిక్స్ ట్రెడిషనల్ లుక్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

సింపుల్‌గా ఉండే కీర్తి ఇంతగానూ గ్లామరస్‌గా మారిపోవడం ఓ మెజిక్‌లా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాజాగా విడుదలైన ‘ఉప్పు కప్పురంబా’ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లలో పాల్గొన్న కీర్తి, ఈ స్పెషల్ లుక్‌తో అభిమానులను అలరించింది. చీరకట్టులో మోడర్న్ టచ్ ఇచ్చినప్పటికీ, మల్లె పూల జడతో సంప్రదాయ శైలికి న్యాయం చేసింది. ఈ లుక్‌లో ఆమె స్పష్టంగా చెప్పకుండానే ఓ సందేశాన్ని ఇచ్చిందన్నట్టుగా ఉంది.

స్టైల్‌లో కూడా తన మార్క్ ఉంటుంది అని. కీర్తికి ఇది ఒక ఫ్యాషన్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. చీరలో గ్లామర్ టచ్ ఎలా ఇస్తారో చూపించడమే కాకుండా, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కూడా పెంచింది. కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. రివాల్వర్ రీటా వంటి తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లో కూడా దూసుకుపోతోంది. తెలుగులో ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులపై చర్చలు జరుపుతోందన్న టాక్ ఉంది.

Tags:    

Similar News