తెలుగు సినిమాల‌పై క‌యాదు లోహార్ సెటైర్!

ప్రస్తుతం తాను ఇతర భాషా చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నానంది. చేతినిండా ప్రాజెక్టులు ఉన్నప్పుడు పాత సినిమాల గురించి ఆలోచించడం స‌మ‌యం వృధా అన్న‌ట్లు అభిప్రాయపడింది.;

Update: 2026-04-02 08:14 GMT

త‌మిళ చిత్రం `డ్రాగ‌న్` తో పాపుల‌ర్ అయిన క‌యాదు లోహార్ తెలుగులోనూ అవ‌కాశాలు అందుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే రిలీజ్ అయిన `ఫంకీ`లోనూ విశ్వ‌క్ సేన్ కు జోడీగా న‌టించింది. అయితే ఈ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని సాధించ‌లేదు. ప్ర‌స్తుతం నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తోన్న `ది ప్యార‌డైజ్` లో న‌టిస్తోంది. ఇవిగాక త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాలోనూ బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ న‌టించిన ఓ మ‌ల‌యాళ చిత్రం తెలుగులో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా అమ్మ‌డు తెలుగు సినిమాల‌పై సెటైర్ వేసింది.

తెలుగులో ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోకపోవడంతో అమ్మ‌డు తనదైన శైలిలో స్పందించింది. ఒక రకంగా సెటైరికల్‌గా అనిపించేలా ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు తీస్తున్నాయి. తాను నటించిన సినిమాలు పరాజయం పాలవ్వడం గురించి తనకు ఎటువంటి విచారం లేద‌న్న‌ట్లు వ్యాఖ‌న్యా నించింది. `సినిమా రిజల్ట్ అనేది మన చేతుల్లో ఉండదు. నేను నా వంతు ప్రయత్నం చేశాను. కానీ అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి` అని పేర్కొంది. అంతటితో ఆగకుండా ఆ సినిమాల వైఫల్యాల గురించి కూర్చుని బాధపడేంత తీరిక కూడా తనకు లేదని అనడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ప్రస్తుతం తాను తెలుగు తో పాటు ఇతర భాషా చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నానంది. చేతినిండా ప్రాజెక్టులు ఉన్నప్పుడు పాత సినిమాల గురించి ఆలోచించడం స‌మ‌యం వృధా అన్న‌ట్లు అభిప్రాయపడింది. మలయాళం , ఇతర పరిశ్రమల్లో తనకు మంచి గుర్తింపు లభిస్తోందని అక్కడ వరుస అవకాశాలు వస్తున్నాయని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో టాలీవుడ్ వైఫల్యాలను ఆమె చాలా తేలికగా తీసుకోవడం గమనార్హం. సాధారణంగా నటీమణులు తమ సినిమాలు ఫ్లాప్ అయితే కాస్త నిరాశ చెందుతారు లేదా తదుపరి సినిమాతో నిరూపించుకుంటామని చెబుతారు.

కానీ కయాదు మాత్రం తన బిజీ షెడ్యూల్‌ను సాకుగా చూపుతూ తెలుగు సినిమాల ఫలితాలను పట్టించుకో నక్కర్లేదన్నట్లుగా మాట్లాడిందని నెటి జ‌నులు అభిప్రా య‌ప‌డుతున్నారు. కయాదు లోహార్ కెరీర్ పట్ల చాలా ప్రాక్టికల్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక చోట తలుపు మూసుకున్నా? మరోచోట అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నప్పుడు పాత వాటిని తలుచుకుని సమయం వృధా చేయకూడదన్నదే ఆమె సిద్ధాంతంగా క‌నిపిస్తుంద‌ని ఓనెటి జ‌నుడు పోస్ట్ పెట్టాడు. అలాగే అమ్మ‌డు స‌క్సెస్ ల్లో ఉంటే? ఇంకెలా స్పందిస్తుందో? అంటూ సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

Tags:    

Similar News