పిక్‌టాక్‌ : చీర కట్టులో డ్రాగన్‌ బ్యూటీ మెరుపులు

సాధారణంగానే హీరోయిన్స్ చీర కట్టులో కనిపిస్తే ఖచ్చితంగా ప్రేక్షకుల గుండె జారి గల్లంతు అవుతుంది. అలాంటిది కయాదు చీర కట్టు ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా మతి పోయినంత పని అయింది.;

Update: 2025-08-14 06:14 GMT

అస్సాంకు చెందిన ముద్దుగుమ్మ కయాదు లోహర్‌. ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన కయాదు ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. అందుకు కారణం కయాదు అందం అనడంలో సందేహం లేదు. అంతే కాకుండా తనకు నటనకు ఆస్కారం ఉన్న పాత్రను ఇస్తే కచ్చితంగా న్యాయం చేస్తుందని పలు సార్లు నిరూపించుకుంది. లక్ కలిసి రాకపోవడం వల్ల ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చాలా కాలం పాటు ఎక్కువ ఆఫర్లు దక్కించుకోలేక పోయింది. 2021లో కన్నడ మూవీ ముగిల్పేట సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కయాదు లోహర్‌ కి ఈ ఏడాది వచ్చిన డ్రాగన్‌ సినిమాతో మంచి గుర్తింపు లభించింది. తమిళ్‌ మూవీ అయినప్పటికీ అది తెలుగులోనూ కయాదుకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఆ సినిమా వల్ల ప్రస్తుతం ఆమె చేతిలో పది సినిమాలు ఉన్నాయి.

 

టాలీవుడ్‌ హీరోలకు కయాదు లోహర్‌ మోస్ట్‌ వాంటెడ్‌

తెలుగులో 2022లోనే అల్లూరి అనే సినిమాను చేసిన కయాదు లోహర్‌ ఆ సమయంలో పెద్దగా నోటెడ్‌ కాలేదు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మడు డ్రాగన్‌ సినిమాతో వచ్చిందో అప్పటి నుంచి తెలుగు హీరోలు సైతం ఈమె వైపు చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు టైర్‌ 2 హీరోలు ఈమెతో రొమాన్స్‌కి ఆసక్తి చూపిస్తున్నారు. అందమైన రూపం తో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. సినిమాలో ఎలాంటి పాత్ర అయినా ఈమె చేస్తే బాగుంటుంది అనే విధంగా ఈమె హావ భావాలు ఉంటాయి, నటన కూడా ప్రతి సినిమాలోనూ మెరుగు పరుచుకుంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటూ వెళ్తుంది. అందుకే కయాదు లోహర్‌ కి సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ విపరీతంగా పెరుగుతుంది. దాదాపుగా మూడు మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్న కయాదు తాజాగా చీర కట్టు ఫోటోలు షేర్‌ చేసి కన్నుల విందు చేసింది.

 

చీర కట్టు అందాలతో గుండె జారి గల్లంతు

సాధారణంగానే హీరోయిన్స్ చీర కట్టులో కనిపిస్తే ఖచ్చితంగా ప్రేక్షకుల గుండె జారి గల్లంతు అవుతుంది. అలాంటిది కయాదు చీర కట్టు ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా మతి పోయినంత పని అయింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌తో చీర కడితే ఏ స్థాయిలో అందంగా ఉంటారో కయాదును చూస్తే అర్థం అవుతుందని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. కయాదు లోహర్‌ యొక్క అందం ముందు ఎంతటి వారు అయినా దిగదుడుపే అంటూ ఈ బ్లూ చీర కట్టులో ఆమెను చూస్తూ ఉంటే అనిపిస్తుందని ఫాలోవర్స్‌, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చీర కట్టులో సింపుల్‌ మేకోవర్‌తో, డీసెంట్‌ హెయిర్‌ స్టైల్‌తో సిగ్గు పడుతున్నట్లుగా ఫోటోలకు ఫోజ్‌లు ఇవ్వడం ద్వారా కయాదు చూపు తిప్పనివ్వడం లేదు. ఈ స్థాయి అందం ఉన్న కయాదు ఇండస్ట్రీలో ఇన్నాళ్లు గుర్తింపు దక్కించుకోలేక పోవడం విడ్డూరంగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.

 

కయాదు చీర కట్టు ఫోటోలు వైరల్‌

కయాదు లోహర్‌ ఆకట్టుకునే విధంగా రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఆమె అందం ముందు ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే. అందుకే కయాదు లోహర్‌ యొక్క ఫోటోలు ఎప్పుడు షేర్‌ చేసినా వైరల్‌ అవుతాయి. ఇప్పటి వరకు స్కిన్‌ షో చేయకుండానే తన అందంతో మెప్పిస్తూ వస్తున్న కయాదు ముందు ముందు స్కిన్‌ షో కి రెడీ అయితే ఇతర హీరోయిన్స్ కనిపించకుండా పోతారేమో అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. కయాదు యొక్క అందాల ఆరబోత ఫోటోలు గతంలోనూ పలు సార్లు వైరల్‌ అయ్యాయి. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా అందంగా కనిపించడం మాత్రమే కాకుండా తన చూపులతో గుండెల్లో గుచ్చుతోంది. కయాదు త్వరలోనే రెండు మూడు తెలుగు సినిమాలకు సైన్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.

Tags:    

Similar News