ఆ రూమర్ తట్టుకోలేక కాయదు కన్నీళ్లు..!

ఇటీవల కొన్ని కాంట్రవర్సీలు బాగా వైరల్ అయ్యాయి. అందులో కొంతమంది హీరోయిన్స్ ప్రయివేట్ పార్టీలకు వెళ్లాడానికో భారీగా డబ్బులు అందుకుంటున్నట్లు కూడా నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.;

Update: 2025-11-18 14:00 GMT

ఇటీవల కొన్ని కాంట్రవర్సీలు బాగా వైరల్ అయ్యాయి. అందులో కొంతమంది హీరోయిన్స్ ప్రయివేట్ పార్టీలకు వెళ్లాడానికో భారీగా డబ్బులు అందుకుంటున్నట్లు కూడా నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇక అందులో హీరోయిన్ కాయదు లోహర్ పేరు కూడా రావడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారం గురించి మాట్లాడుతూ ఆమె ఎమోషనల్ అయ్యారు.

తెలుగులో 'అల్లూరి' సినిమాతో పాపులర్ అయిన కాయదు లోహర్ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. త్వరలోనే 'ఫంకీ' అనే సినిమాతో ఆమె మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆమెపై ఒక రూమర్ గట్టిగా వినిపిస్తోంది. ఆమె సినిమాల్లో నటించడానికి కాకుండా, కేవలం బయట ప్రైవేట్ పార్టీలకు అటెండ్ అవ్వడానికే భారీగా ఛార్జ్ చేస్తున్నారని టాక్ నడిచింది. ఆ పార్టీ గురించి కూడా రకరకాల రూమర్స్ వచ్చాయి.

అయితే ఒక్కో పార్టీకి హాజరయ్యేందుకు ఆమె ఏకంగా రూ. 35 లక్షలు డిమాండ్ చేస్తున్నారని కూడా ఆ వార్తల్లో హైలెట్ అయ్యింది. అయితే దీనిపై ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న ఆమె, ఫైనల్‌గా స్పందించారు. లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఈ రూమర్ గురించి ప్రస్తావించారు. పార్టీల గురించి వస్తున్న వార్తల్లో నిజమెంత అని అడగగానే, కాయదు లోహర్ ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అయ్యారు. తన గురించి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని ఊహించలేదని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"నిజం చెప్పాలంటే నాకు ఎలాంటి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఇలాంటి సిచువేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నాకు తెలియదు. నా గురించి ఇలాంటి ఫేక్ న్యూస్ రాసినప్పుడు, అవి నన్ను మెంటల్‌గా చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు. ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసేవాళ్లు.. అది ఎదుటి వ్యక్తి లైఫ్‌ని ఎంత డ్యామేజ్ చేస్తుందో కనీసం ఆలోచించడం లేదు" అంటూ ఆమె తన ఆవేదనను బయటపెట్టారు.

తాను అందరితోనూ చాలా కైండ్‌గా ఉంటానని, అయినా తనపై ఎందుకు ఇంత నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. అయితే ఇండస్ట్రీ అన్నాక ఇవన్నీ కామన్ అని, ఇది కూడా తన ప్రొఫెషన్‌లో ఒక పార్ట్ అని తనకు తాను సర్దిచెప్పుకుంటున్నట్లు తెలిపారు. కెరీర్ పరంగా ఎదుగుతున్న టైమ్‌లో ఇలాంటి పర్సనల్ ఎటాక్స్ రావడం ఆమెను బాగా హర్ట్ చేసినట్లు క్లియర్‌గా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఎమోషనల్ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.

Tags:    

Similar News