ఆఫిసిఅల్ : పాప్ స్టార్ కేటీ పెర్రీతో కెనడా ప్రధాని డేటింగ్
కేటీ పెర్రీ జస్టిన్ ట్రూడోతో టోక్యో విహార యాత్రకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయగానే అవి జెట్ స్పీడ్ తో అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.;
పాప్ స్టార్ కేటీ పెర్రీతో కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో డేటింగ్ లో ఉన్నారు. తొలిసారి తమ మధ్య రిలేషన్ గురించి ఈ జంట అధికారికంగా ఇన్ స్టాలో ధృవీకరించారు. 41 ఏళ్ల గాయని కేటీ పెర్రీ ఇటీవలి టోక్యో పర్యటన నుండి కొన్ని ఫోటోలను షేర్ చేసారు. ట్రూడోతో సన్నిహితంగా కనిపించిన ఫోటోని షేర్ చేసారు.
కేటీ పెర్రీ శనివారం నాడు వరుస ఫోటోలను షేర్ చేసారు. టోక్యో పర్యటనలో సమయం గడిపాం.. మరిన్ని విషయాలున్నాయి! అని కేటీ దీనికి క్యాప్షన్ రాశారు. `లైఫ్‌టైమ్స్` టూర్ కోసం జపాన్‌లో ఉన్న సమయంలో హాయిగా ఉన్న సెల్ఫీలు వైరల్ అయ్యా ఇ. ఇది ఆమె తాజా ఆల్బమ్‌ను హైలైట్ చేస్తుంది. ఈ జంట సోషల్ మీడియా ఖాతాలలో కలిసి కనిపించడం ఇదే మొదటిసారి. జూలై నుండి పుకార్లు వైరల్ అవుతూనే ఉన్నా ఇప్పటికి అధికారికం అయింది.
కేటీ పెర్రీ జస్టిన్ ట్రూడోతో టోక్యో విహార యాత్రకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయగానే అవి జెట్ స్పీడ్ తో అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. లక్షల్లో క్లిక్ లు లైక్ లతో ఇంటర్నెట్ హోరెత్తింది. ఈ పోస్ట్ లో ఒక చిన్న వీడియోలో ట్రూడో- పెర్రీ జంట స్థానిక వంటకాలను రుచి చూస్తూ.. అతడి చేయి ఆమె చుట్టూ ఉంచిన సన్నిహిత దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ప్రముఖ డిజిటల్ టీమ్ ల్యాబ్స్ ఎగ్జిబిట్‌లో ఈ జంట విహారానికి సంబంధిచిన ఫోటోగ్రాఫ్ ఆకట్టుకుంది.
టోక్యోలో ఇలా ప్రయివేట్ టైమ్ గురించిన వివరం అధికారిక కార్యక్రమంలో భాగంగా ఉంది. ఈ వారం ప్రారంభంలో జపాన్ మాజీ ప్రధాన మంత్రి ఫ్యూమియో కిషిడా అతడి భార్య యుకో కోసం నిర్వహించిన దౌత్య విందులో పెర్రీ ట్రూడోతో జాయినయ్యారు.
జూలైలో మాంట్రియల్‌లో కేటీ-ట్రూడో జంట కలిసి భోజనం చేస్తున్నప్పుడు వారి నడుమ ప్రేమ భావనల గురించి చర్చ మొదటగా బయటపడింది. ట్రూడో ఆ తరువాత పెర్రీ షో `లైఫ్‌టైమ్స్ టూర్- కెనడా ఈవెంట్ కి హాజరయ్యాడు. ఇది ఈ జంట సాన్నిహిత్యం, వ్యక్తిగత సంబంధంపై ఆసక్తిని మరింత పెంచింది.
ఇటీవలే తన భర్త, నటుడు ఓర్లాండో బ్లూమ్ కి కేటీ పెర్రీ విడాకులు ఇచ్చారు. ఏడు సంవత్సరాలు కలిసి ఉన్న ఈ జంట జూన్ 2025లో తమ సంబంధాన్ని ముగించింది. ఆగస్టు 2020లో జన్మించిన వారి కుమార్తె డైసీ డోవ్‌కు సహ-తల్లిదండ్రులుగా కొనసాగుతున్నట్లు వారి ప్రతినిధులు ధృవీకరించారు.