హిట్‌ మూవీ సీక్వెల్‌... పెద్ద పొలిటికల్‌ వివాదం

సూర్య హీరోగా త్రిష ప్రధాన పాత్రలో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ మూవీ 'కరుప్పు' బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

Update: 2026-07-01 09:30 GMT

సూర్య హీరోగా త్రిష ప్రధాన పాత్రలో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ మూవీ 'కరుప్పు' బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. న్యాయ వ్యవస్థపై పోరాటం అన్నట్లుగా సాగే కరుప్పు మూవీ కథ విషయంలో వివాదం రాజుకున్నప్పటికీ సినిమాకు వచ్చిన స్పందన నేపథ్యంలో అంతా సైలెంట్‌ అయ్యారు. భారత న్యాయ వ్యవస్థను అవమానించినట్లుగా కరుప్పు ఉందనే విమర్శలు వచ్చాయి. వాటిని జనాలు పట్టించుకోకుండా సినిమాను చూసి హిట్‌ చేశారు. తెలుగులో వీరభద్రుడు అనే టైటిల్‌తో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సౌత్‌ ఇండియాలోని అన్ని భాషల ప్రేక్షకులు కరుప్పు మూవీని తెగ ఆధరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సీక్వెల్‌ గురించిన చర్చ ప్రారంభం అయ్యింది.

బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కరుప్పు...

దర్శకుడు ఆర్జే బాలాజీ 'కరుప్పు' కు సీక్వెల్‌ ఉంటుందని ముందే క్లారిటీ ఇచ్చాడు. సినిమా చివర్లో సీక్వెల్‌ కోసం కథ లీడ్‌ ఇచ్చి వదిలి పెట్టాడు. మొదటి పార్ట్‌లో న్యాయవ్యవస్థపై వీరభద్రుడు పోరాటం చేస్తే, సీక్వెల్‌లో పొలిటికల్‌ వ్యవస్థపై పోరాటం చేసే విధంగా కథను డిజైన్‌ చేయబోతున్నట్లుగా క్లారిటీ వచ్చింది. తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో కరుప్పు 2 ను పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తే కచ్చితంగా ఏదో ఒక వర్గం నుంచి వ్యతిరేకత రావడం ఖాయం. అధికార పార్టీని లేదా విపక్ష పార్టీలను ఏమాత్రం సినిమాలో తక్కువ చేసినా కచ్చితంగా పెద్ద గొడవలు అవుతాయి. అందుకే దర్శకుడు ఆర్జే బాలాజీ ఇప్పటికిప్పుడు కరుప్పు సినిమా సీక్వెల్‌ ను మొదలు పెట్టాలి అనుకోవడం లేదట. ఈ విషయాన్ని స్వయంగా ఆర్జే బాలాజీ ఒక చిట్‌చాట్‌లో చెప్పడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

సూర్య కరుప్పు సినిమాకు సీక్వెల్‌....

ఇటీవల ఒక చిట్‌ చాట్‌లో దర్శకుడు ఆర్జే బాలాజీ మాట్లాడుతూ... సీక్వెల్‌కు కథను ఎలా డిజైన్‌ చేయాలి అనే ఆలోచన ఇంకా రాలేదు. అయితే పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో కథ ఉంటుందని మాత్రం చెప్పుకొచ్చాడు. ఇప్పుడే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది, సీఎంగా విజయ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సమయంలో పొలిటికల్‌ బ్యాక్‌డ్రామ్‌ మూవీ అంటే కాస్త ఆలోచించాల్సిన విషయం అన్నట్లుగా దర్శకుడు ఆర్జే బాలాజీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా స్పైసీ పొలిటికల్‌ లైన్‌ దొరికితే తప్పకుండా కరుప్పు మూవీ సీక్వెల్‌ను ప్లాన్‌ చేస్తాను అంటూ దర్శకుడు బాలాజీ హామీ ఇచ్చాడు. సూర్య అభిమానులు మాత్రమే కాకుండా అన్ని భాషల సినీ ప్రేక్షకులు సీక్వెల్‌ కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ఆచితూచి వ్యవహరించాలని దర్శకుడు భావిస్తున్నాడట. అందుకే ఇప్పట్లో సినిమా సీక్వెల్‌ ను చేయక పోవచ్చని ఆయన సన్నిహితులు అంటున్నారు.

హీరోయిన్‌ త్రిషతో సీఎం విజయ్‌ ప్రేమ వ్యవహారం...!

రాజకీయాలపై దేవుడు పోరాటం చేస్తే ఎలా ఉంటుందా అనే ఆసక్తికర పాయింట్‌ను ఇప్పటికే తీసుకున్న దర్శకుడు బాలాజీ కథను ముందుకు తీసుకు వెళ్లడం లో మాత్రం మీనమేశాలు లెక్కిస్తున్నాడు. ఇప్పుడు కాదు ముందు ముందు సీక్వెల్‌ చేద్దామని అనుకుంటున్న నేపథ్యంలో అసలేం జరగబోతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరుప్పు మూవీలో త్రిష నటించిన విషయం తెల్సిందే. సీక్వెల్‌లో ఆమె కొనసాగే అవకాశాలు ఎక్కువ. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కి త్రిషకు ఉన్న సంబంధం గురించి కుప్పలు తెప్పలుగా కథనాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆమె నటించే కరుప్పు సీక్వెల్‌లో విజయ్‌కి వ్యతిరేకంగా సీన్స్‌ ఊహించలేం. అలా కాకుండా విపక్షాలకు వ్యతిరేకంగా అయినా కొన్ని సీన్స్ ఉండే అవకాశం ఉంది. అలా ఉన్న స్ట్రాంగ్‌గా ఉన్న ప్రతిపక్షం నుంచి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే దర్శకుడు ఆర్జే బాలాజీ సీక్వెల్‌ విషయంలో సమయం కావాలి అంటున్నాడని తెలుస్తోంది.

Tags:    

Similar News