స్టార్ డైరెక్టర్లు ఇద్దరు పార్టనర్లు అయ్యారా?
అప్పటికే `లియో` పై నెగిటివ్ టాక్ ఉన్నా? లోకేష్ గత విజయాల పరంపరలో `లియో` ప్లాప్ పెద్దగా ప్రభావం చూపించలేదు. రజనీకాంత్ తో తెరకెక్కిస్తోన్న `కూలీ`తో అంతా సెట్ అవుతుందనుకున్నారు. కానీ `కూలీ` కూడా ప్లాప్ అవ్వడంతో సన్నివేశం ఒక్కసారిగా మారింది.;
`ఖైదీ`, `విక్రమ్` విజయాలతో లోకేష్ కనగరాజ్ పాన్ ఇండియాలో ఎంత సంచలనమయ్యాడో తెలిసిందే. మార్కెట్ లో అతడో బ్రాండ్ అయ్యాడు. స్టార్ హీరోలే అతడి కోసం క్యూ కట్టారు. లోకేష్ తో సినిమా చేయాలంటూ బహిరంగంగానే ప్రకటించారు. ఈ జాబితాలో టాలీవుడ్ స్టార్లు కూడా ఉన్నారు. రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్లార్టు కూడా ఎల్ సీ యూలో భాగమవ్వాలని ఆసక్తి చూపించారు. సరిగ్గా ఇదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రేసులో ఉండటంతో? లోకేష్ ఇమేజ్ ఏకంగా తారా స్థాయికి చేరింది.
నెగిటివిటీ పక్కన బెట్టి హీరోగా:
అప్పటికే `లియో` పై నెగిటివ్ టాక్ ఉన్నా? లోకేష్ గత విజయాల పరంపరలో `లియో` ప్లాప్ పెద్దగా ప్రభావం చూపించలేదు. రజనీకాంత్ తో తెరకెక్కిస్తోన్న `కూలీ`తో అంతా సెట్ అవుతుందనుకున్నారు. కానీ `కూలీ` కూడా ప్లాప్ అవ్వడంతో సన్నివేశం ఒక్కసారిగా మారింది. రజనీ అభిమానుల అంచనాలను `కూలీ` అందుకోకపోవడంతో తీవ్ర విమర్శల పాలయ్యాడు. అదే సమయంలో రజనీకాంత్-కమల్ హాసన్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కూడా లోకేష్ నుంచి చేజారింది. అక్కడా `కూలీ` ప్లాప్ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం లోకేష్ ఆ నెగిటివిటీ అంతా పక్కనబెట్టి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే.
`రెట్రో` ప్లాప్ తో ఖాళీగా:
`డీసీ` అనే చిత్రంతో వచ్చే ఏడాది ప్రేక్షకుల్ని నటుడిగా పలకరించనున్నాడు. అలాగే నిర్మాతగా కూడా లోకేష్ కొనసాగుతున్నాడు. `మైఖెల్`, `ప్లైట్ క్లబ్` లాంటి చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం `బెంజ్`, `మిస్టర్ భారత్` చిత్రాలకు సమర్పకుడిగా కొనసాగుతున్నాడు. అలాగే మరో తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కూడా ఒక్కసారిగా స్లో అయ్యాడు. సూర్య హీరోగా తెరకెక్కించిన `రెట్రో` ప్లాప్ అయిన తర్వాత కార్తీక్ ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. రెండేళ్ల తర్వాత సూర్యతో తెరకెక్కించిన చిత్రమిది. కమర్శియల్ గా భారీ విజయం సాధిస్తుంది? అనుకున్న తన అంచనా తప్పైంది.
నిర్మాతలగా దర్శక ద్వయం:
రామ్ చరణ్ హీరోగా నటించిన `గేమ్ ఛేంజర్` విషయంలో కూడా ఇదే పునరావృతం అయింది. `గేమ్ ఛేంజర్` ను శంకర్ డైరెక్ట్ చేసినా? ఆ సినిమాకు కథ అందించింది కార్తీక్ సుబ్బరాజ్. రొటీన్ కథ కావడంతో ప్రేక్షకులకు రుచించలేదు. అప్పటి నుంచి సుబ్బరాజ్ రైటర్ గానూ, డైరెక్టర్ గానూ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ లేదు. ఈ నేపథ్యంలో కార్తీక్ సుబ్బ రాజ్-లోకేష్ సంయుక్తంగా ఓ సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.` 29` అనే టైటిల్ ఈ సినిమా నిర్మాణం జరుగుతు న్నట్లు వినిపిస్తోంది. మరి ఆరంభంలో డైరెక్టర్లగా చూపించిన దూకుడు ఈ ద్వయం నిర్మాతలగానూ చూపిస్తారా? అన్నది చూడాలి.