'మిరాయ్' సంచలనం భవిష్యత్ ఎలా?
అటుపై `మిరాయ్` నుంచి రిలీజ్ అయిన ఒక్కో ప్రచార చిత్రం సినిమాకు అంతకంతకు హైప్ పెంచింది. రిలీజ్ ఆలస్యమైనా? బజ్ ఎక్కడా తగ్గలేదు.;
ఎట్టకేలకు కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా `మిరాయ్` తో భారీ హిట్ అందుకున్నాడు. 50 కోట్ల బడ్జెట్ లోనే భారీ వసూళ్ల చిత్రాన్ని అందిచడంతో కార్తీక్ పేరు మార్మోమ్రోగుతోంది. ఇలాంటి సక్సెస్ కోసం కార్తీక్ ఇప్పటి నుంచి కాదు కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడు. కెమెరా మెన్ గా కెరీర్ ప్రారంభించిన కార్తీక్ రెండు సినిమాల అనంతరమే `సూర్య వర్సెస్ సూర్య`తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాకు దర్శకత్వంతో పాటు కెమెరా బాధ్యతలు చేపట్టాడు. ఆ సినిమా కంటెంట్ కొత్తగానే ఉంటుంది. కానీ ఎందుకనో కనెక్ట్ అవ్వలేదు.
బేసిక్ గా కెమెరా మెన్ కావడంతో? తెరపై ఆ కథను అంతే అందంగా మలిచాడు. కానీ వైఫల్యం ఎదురవ్వడంతో మల్లీ డైరెక్టర్ గా సెకెండ్ ఛాన్స్ రావడానికి దశాబ్దం సమయం పట్టింది. మాస్ రాజా రవితేజ `ఈగల్` తో అవకాశం ఇచ్చాడు. కానీ ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. దీంతో కార్తీక్ డైరెక్టర్ అవ్వడానికి మరో దశాబ్దం పడుతుందా? అన్న సందేహం వ్యక్తమైంది. కానీ కార్తీక్ ఈసారి డైరెక్షన్ ని మాత్రం వదల్లేదు. ఎలాగూ తేజ సజ్జాని పట్టుకుని కథతో ఒప్పించి `మిరాయ్` పట్టాలెక్కించాడు. అప్పటికే `హనుమాన్` తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న తేజ ఈ సినిమాకు కమిట్ అవ్వడంతో బజ్ ఏర్పడింది.
అటుపై `మిరాయ్` నుంచి రిలీజ్ అయిన ఒక్కో ప్రచార చిత్రం సినిమాకు అంతకంతకు హైప్ పెంచింది. రిలీజ్ ఆలస్యమైనా? బజ్ ఎక్కడా తగ్గలేదు. కంటెంట్ సహా తేజ అప్పిరియన్స్ తో గ్రాండ్ విక్టరీ అందుకున్నారు. ఈ సినిమాకు కూడా కార్తీక్ కెమెరా పనులు చక్కబెట్టిన సంగతి తెలిసిందే. మరి ఇంత పెద్ద సక్సెస్ తర్వాత కార్తీక్ కెరీర్ ని ఎలా ప్లాన్ చేస్తున్నాడు? ఎప్పటిలాగే దర్శకత్వంతో పాటు తన సినిమాలకు తానే కెమెరా మ్యాన్ అవుతాడా? లేక ఆ బాధ్యతల నుంచి తప్పుకుని దర్శకుడిగానే ఉంటాడా? అన్నది చూడాలి. `మిరాయ్` సక్సెస్ నేపథ్యంలో ఇంకా మంచి పెద్ద డైరెక్టర్ అవుతాడని పలువురు ప్రశంసించిన సంగతి తెలిసిందే.
రవితేజ కూడా రిలీజ్ కు ముందు మంచి బూస్ట్ ఇచ్చారు. ఆ వాక్కు ఫలించింది. హిట్ అందుకున్నాడు. మరి కార్తీక్ ఘట్టమనేని భవిష్యత్ ని ఎలా ప్లాన్ చేస్తున్నాడు? అన్నది తెలియాలి. యువ ప్రతిభావంతుకుల టాలీవుడ్ స్టార్స్ అవకాశాలివ్వడానికి ఎంత మాత్రం వెనుకడుగు వేయరు. ప్రశాంత్ వర్మ ఇండస్ట్రీలో అలా ఎదిగిన వారే. ఇప్పుడే ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తోనే సినిమా చేస్తున్నాడు. ఇంకా పెద్ద పెద్ద స్టార్లు అవకాశాలు కల్పిస్తున్నారు. భవిష్యత్ లో కార్తీక్ ఘట్టమనేని కూడా ఇలాంటి అవకాశాలతో బిజీ అవ్వాలని ఆశీద్దాం.