• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యంగ్‌ హీరో సినిమాకు...

యంగ్‌ హీరో సినిమాకు ఆసక్తికర నేపథ్యం

| తమిళ్‌ స్టార్‌ హీరో కార్తీ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-09-18 10:40 GMT

తమిళ్‌ స్టార్‌ హీరో కార్తీ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మీయజగన్ సినిమాతో ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కార్తీ తన తదుపరి సినిమాను తమిజ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే సర్దార్‌ 2, వా వాతియార్ సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ సమయంలోనే తమిజ్ దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రకటించడంతో పాటు కాన్సెప్ట్‌ పోస్టర్ నూ విడుదల చేయడం జరిగింది. కాన్సెప్ట్‌ పోస్టర్ తర్వాత సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇదో పీరియాడిక్‌ డ్రామాగా తెలుస్తోంది.

కార్తీ 29 టైటిల్‌ తో మేకర్స్‌ ప్రకటించిన ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ లో సముద్ర నీటిలో ప్రయాణిస్తున్న భారీ నౌకను చూపించడం జరిగింది. ఆ నౌక ను చూస్తూ ఉంటే ఇది ఒక పీరియాడిక్‌ డ్రామా అన్నట్లుగా అర్థం అవుతుంది. ముందు ముందు ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియజేయనున్నారు. కానీ ప్రస్తుతానికి మాత్రం కాన్సెప్ట్‌ పోస్టర్ తోనే అన్ని విషయాలను చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 1960 టైమ్‌ లో సాగే కథ తో ఈ సినిమాను రూపొందించే అవకాశాలు ఉన్నాయని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కొన్ని రోజుల క్రితం దర్శకుడు తమిజ్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తదుపరి సినిమా రామేశ్వరంలో జరిగే స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగుతుందని అన్నాడు. ఆ స్మగ్లింగ్ ముఠా నాయకుడు హీరో అనే టాక్‌ వినిపిస్తోంది. మొత్తానికి ఈ బ్యాక్ డ్రాప్ లో కార్తీ సినిమా అనగానే అభిమానుల అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటాయి అంటూ మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో పీరియాడిక్ సినిమాల ట్రెండ్‌ నడుస్తోంది.

కార్తీ తో తమిజ్ దర్శకత్వంలో రూపొందించబోతున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. డ్రీమ్‌ వారియర్స్ పిక్చర్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందబోతుంది. గతంలో కార్తీ నటించిన ఖాకీ, ఖైదీ సినిమాలను డ్రీమ్‌ వారియర్ బ్యానర్‌ నిర్మించిన విషయం తెల్సిందే. ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో సినిమా రాబోతుంది. కార్తీ 29 సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తమీజ్ ఈ సినిమాను రూపొందించబోతున్నాడని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

Tags:    
  • Kollywoodsuperstar 
  • Karthi 
  • Oopiri 
  • Kaithi 
  • Ponniyinselvan 
  • Karthi29 
  • Filmindustry 
  • Karthi29movie 
  • Tamizh 
  • Rameshwaramdistrict 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS