• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొత్త టికెట్ రేట్లు.. ఆ...

కొత్త టికెట్ రేట్లు.. ఆ రెండు సినిమాల సంగతేంటి?

| సినిమా టికెట్ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం. రాష్ట్రంలో సినిమా టిక్కెట్లు అత్యధికంగా రూ.200 (పన్నులు మినహాయించి)కి పరిమితం చేసింది.

By - M Prashanth
Update: 2025-09-13 05:59 GMT

సినిమా టికెట్ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం. రాష్ట్రంలో సినిమా టిక్కెట్లు అత్యధికంగా రూ.200 (పన్నులు మినహాయించి)కి పరిమితం చేసింది. తద్వారా సినీ ప్రేక్షకులకు మంచి వార్త చెప్పింది. సినిమా విడుదల కాగానే టికెట్ ధరలు తరచుగా భారీగా పెరుగుతూ ఉండగా, ఇకపై అది కష్టమే.

కొత్త నియమం అమల్లోకి రానుండడం వల్ల సాధారణ సౌకర్యం కలిగిన థియేటర్లలో టికెట్ ధరలు చౌకగా ఉండనున్నాయి. అయితే 75 సీట్లు లేదా అంతకంటే తక్కువగా ఉన్న ప్రీమియం స్క్రీన్ కలిగిన థియేటర్లకు ఆ పరిమితి వర్తించదు. చిన్న ప్రీమియం మల్టీ స్క్రీన్ థియేటర్లు సొంత విధానానుసారం టికెట్ ధరలు నిర్ణయించుకోవచ్చు.

కర్ణాటక సినిమాస్ (నియంత్రణ) (సవరణ) నియమాల చట్టంలో భాగంగా ఇప్పుడు పలు మార్పులు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. జూలై 15 2025న ముసాయిదా నోటిఫికేషన్ రూపంలో విడుదల చేసింది. కొత్త నియమానికి తమ అభ్యంతరాలు సమర్పించడానికి వీలు కల్పించింది. ఆ తర్వాత సవరించిన నిబంధనలు ధ్రువీకరించింది.

అయితే అధికారిక గెజిట్‌లో తుది ప్రచురణ తేదీ నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. 2017లో కూడా సినిమా టికెట్ ధరలు తగ్గించడానికి ఇలాంటి ప్రయత్నం జరగ్గా, అప్పుడు కర్ణాటక హైకోర్టు ఆ ప్రణాళిక నిలిపివేసింది. ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సినీ ప్రియులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.

అది ఓకే అయినా.. ఇప్పుడు త్వరలో రిలీజ్ కానున్న కన్నడ భారీ సినిమాలు కాంతారా చాప్టర్-1, టాక్సిక్ కోసం చర్చ జరుగుతోంది. భారీ బడ్జెట్లతో రూపొందిన మూవీల టికెట్ రేట్లు సాధారణంగా అయితే భారీగా పెంచేవారు. కానీ ఇప్పుడు కుదరదు. దీంతో బడ్జెట్ కు తగ్గట్టు రేట్లు ఉండవు. కాబట్టి ఏం జరుగుతుందోనని మాట్లాడుకుంటున్నారు.

అయితే ఆ రిషబ్ శెట్టి, యష్ వేర్వేరుగా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఆ సినిమాలు.. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానున్నాయి. ఇప్పటికే భారీ బజ్ ను క్రియేట్ చేసుకున్నాయి. కానీ కర్ణాటకలో రేట్లు తక్కువగా ఉండడం వల్ల మేకర్స్ కు కాస్త నష్టమే. కానీ పాన్ ఇండియా మూవీస్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని, కవర్ అయిపోతుందని సినీ ప్రియులు చెబుతున్నారు.

Tags:    
  • KarnatakaCinema 
  • MovieTicketCap 
  • CinegoersRelief 
  • KannadaCinema 
  • కర్ణాటక సినిమా టికెట్ 
  • పాన్ ఇండియా రిలీజ్ 
  • కన్నడ సినిమా 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS