తిండి మానేసి బ‌క్క చిక్కి అగ్ర‌నిర్మాత షాక్‌లు

బాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌, హోస్ట్ కరణ్ జోహార్ కొత్త సెల్ఫీ షాక్ కి గురి చేసింది. బాగా బ‌క్క చిక్కి.. బుగ్గ‌లు లాగేసి క‌ళ్లు గుంట‌లు ప‌డి.. అత‌డి రూపం మొత్తం మారిపోయింది.;

Update: 2025-04-07 22:30 GMT

బాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌, హోస్ట్ కరణ్ జోహార్ కొత్త సెల్ఫీ షాక్ కి గురి చేసింది. బాగా బ‌క్క చిక్కి.. బుగ్గ‌లు లాగేసి క‌ళ్లు గుంట‌లు ప‌డి.. అత‌డి రూపం మొత్తం మారిపోయింది. చాలా కాలంగా భోజ‌నం చేయ‌ని వ్యాధిగ్ర‌స్తుడిలా అతడు పూర్తిగా స‌న్న‌బ‌డిపోయి క‌నిపించ‌డంతో అంద‌రూ షాక్ కి గుర‌వుతున్నారు. ఈ ఫోటోగ్రాఫ్ చూసి అస‌లు క‌ర‌ణ్‌కి ఏమైంది? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి.

అస‌లింత‌కీ క‌ర‌ణ్ అనూహ్యంగా బ‌రువు త‌గ్గిపోవ‌డానికి కార‌ణ‌మేమిటి? అత‌డు తిండి మానేసాడా? ఏదైనా అనారోగ్యానికి చికిత్స పొందుతున్నాడా? అంటూ ప‌రి ప‌రి విధాలా ఎంక్వ‌యిరీలు మొద‌ల‌య్యాయి. అంత‌గా అత‌డి రూపం మారిపోయి క‌నిపిస్తోంది.

క‌ర‌ణ్ స‌హ‌జంగా ఏదైనా ప్ర‌చారం కోరుకుంటే ఇలాంటి ట్రిక్కులు ప్లే చేస్తుంటాడు! అంటూ కొంద‌రు నెటిజ‌నులు అనుమానిస్తున్నారు. మొద‌ట‌ మిర్రర్ సెల్ఫీ సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఆ త‌ర్వాత కార్ లో ప్ర‌యాణిస్తున్న‌ప్ప‌టి ఫోటోని నెటిజ‌నులు షేర్ చేసారు. ఇందులో అత‌డు బ‌క్క చిక్కిన ముఖం, బ‌ట్ట‌త‌ల‌తో స‌న్ గ్లాసెస్ ధ‌రించి క‌నిపించాడు. కానీ అత‌డి బుగ్గలు నొక్కుకుపోయి ఉన్నాయి. ఈ రెండు ఫోటోలు వైర‌ల్ గా షేర్ అయ్యాయి. దీంతో నెటిజ‌నులు చాలా విధాలుగా అత‌డిపై ఆరాలు తీస్తున్నారు.

నిజానికి కరణ్ జోహార్ ఒకప్పుడు తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాడు. ఒక‌ మిర్రర్ సెల్ఫీ రెడ్డిట్‌లో చర్చకు దారితీసింది. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటో ఇప్పుడు అందుబాటులో లేదు. అయితే క‌ర‌ణ్ ఫోటోల‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ ల‌ను షేర్ చేసిన వ్య‌క్తి ఇలా రాసారు. ``సోషల్ ఫోరమ్‌లో ఎవరో రాశారు.. నిజంగా ఆందోళన చెందుతున్నారు.. అతడు ఆరోగ్యంగా కనిపించడం లేదు!`` అని రాసారు. ఒక సెక్ష‌న్ అభిమానులు ఈ పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ.. చాలామంది కరణ్ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు.

అతడి సంరక్షణ కోసం 4 వేర్వేరు వైద్యులు, 10 మంది వేర్వేరు డైటీషియన్లు ఉండాలి! అని ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించ‌గా, అతడు సాధ్యమైనంత ఉత్తమమైన జీవనశైలి, సౌకర్యాలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ పూర్తిగా బాగున్నాడు! అని మ‌రొక‌రు రాసారు. కొంతమంది సెలబ్రిటీలలో బరువు తగ్గించుకునే ధోరణులను తిట్టారు. వీరంతా ఓజెంపిక్‌ను ఉప‌యోగిస్తార‌ని కొంద‌రు దూషించారు. అత‌డు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మ‌రో అభిమాని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News