పుష్ప‌రాజ్ క్రేజ్ ఇంట‌ర్నేష‌న‌ల్.. మ‌రో ప్రూఫ్ ఇదిగో!

పుష్ప‌రాజ్ ని అంత‌ర్జాతీయ ప్ర‌ముఖులు అనుక‌రించ‌డం కూడా స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది

Update: 2024-05-23 04:38 GMT

పుష్ప చిత్రం ఉత్త‌రాదితో పాటు విదేశాల్లోను అద్భుత వ‌సూళ్ల‌ను సాధించింది. ఇందులో పుష్ప‌రాజ్ పాత్ర‌లో అల్లు అర్జున్ అద్భుత న‌టన ప్ర‌పంచ‌వ్యాప్త వీక్ష‌కుల‌కు న‌చ్చింది. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ అరాచ‌కాల్ని అంద‌రూ మెచ్చుకున్నారు. అలాగే పాట‌ల్లో బ‌న్ని హుక్ స్టెప్స్ ని కూడా ఎవ‌రూ మ‌ర్చిపోలేదు. యూట్యూబ్ స‌హా యాప్ ల‌లో పుష్ప‌రాజ్ స్టెప్పుల్ని అనుక‌రిస్తూ యూత్ బోలెడంత సంద‌డి చేసింది.

పుష్ప‌రాజ్ ని అంత‌ర్జాతీయ ప్ర‌ముఖులు అనుక‌రించ‌డం కూడా స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇటీవ‌ల‌ ప్రముఖ బ్రిటీష్ గాయకుడు-గేయరచయిత ఎడ్ షీర‌న్ నెట్‌ఫ్లిక్స్‌లో కపిల్ శర్మ కామెడీ షోలో కనిపించారు. తగ్గేదేలే అంటూ పుష్ప‌రాజ్ డైలాగ్‌ను వినిపించారు. అత‌డికి తెలుగు రాక‌పోయినా కానీ కపిల్ శ‌ర్మ హిందీలో త‌ర్జూమా చేసుకుని అతడికి చెప్ప‌గా.. దానిని సాగ‌దీస్తూ అత‌డు త‌న‌దైన శైలిలో త‌గ్గేదేలే డైలాగ్ చెప్పాడు. ఇది వీక్ష‌కుల‌కు ప‌సందుగా క‌నిపించింది. ఎడ్ షీర‌న్ లాంటి ప్ర‌ముఖ సెల‌బ్రిటీ పుష్ప‌రాజ్ డైలాగ్ ని అనుక‌రించ‌డం అన్న‌ది ఎంతో గొప్ప విష‌యం.

ఎడ్ షీరన్ వంటి అంతర్జాతీయ స్టార్ నోట పుష్ప డైలాగ్స్ విన‌గానే బ‌న్ని అభిమానుల్లో బోలెడంత ఉత్సాహం వ‌చ్చేసింది. ఇది ఇప్పుడు `పుష్ప 2`కి కూడా ప్ల‌స్ కానుంద‌ని ఒక అంచ‌నా. షీరన్ డైలాగ్‌కి సంబంధించిన‌ వీడియో ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ అయింది. పుష్ప 2 ఈ సంవ‌త్స‌రంలోనే విడుద‌ల కానుంది. ఈ ఏడాది విడుద‌ల‌వుతున్న పాన్ ఇండియా చిత్రాల్లో అత్యంత క్రేజీ మూవీగా పుష్ప 2 పై అంచ‌నాలున్నాయి. ఇందులో ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పుష్ప 2 కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్న వేళ ఎడ్ షీర‌న్ లాంటి ప్ర‌ముఖుల ప్ర‌చారం పెద్ద‌గానే క‌లిసొస్తుంది.

Read more!
Tags:    

Similar News