• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రోడ్డుపై కెఏ పాల్...

రోడ్డుపై కెఏ పాల్ పొలిశెట్టి.. ఊహించని కాంబో..

| ఓపెన్ టాప్​లో నుంచి బయటకు కనపడి ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​ ఇచ్చారు. కేఏ పాల్​-పోలిశెట్టి కూడా పలకరించుకున్నారు.

By - Tupaki Desk
Update: 2023-08-28 08:27 GMT

ఇద్దరు సెలబ్రిటీ ఒక చోట కలిసినా, ఒకే స్టేజ్​ పంచుకున్నా అక్కడ ఎంతటి సందడి ఉంటుందో తెలిసిన విషయమే. అభిమానులు, అక్కడి జనాలు గూమిగుడిపోయి సందడి వాతావరణం క్రియేట్ అవుతోంది. ఇప్పుడు వైజాగ్​లోని ఓ పబ్లిక్ ప్లేస్​లో ఇదే జరిగింది. టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి- ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఒకేచోట కనిపించి అభిమానుల్లో జోష్ నింపారు. దీంతో అక్కడ ఉన్న వారంతా రచ్చ రచ్చ చేశారు.

నవీన్​ పోలిశెట్టి.. యూత్‌లో క్రేజ్‌ ఉన్న హీరోల్లో ఆయన ఒకరు. ఈ యంగ్ హీరో ఆన్​ స్క్రీన్​పై ఏ రేంజ్​లో సందడి చేస్తారో.. ఆఫ్​ స్క్రీన్​పైనా అదే రేంజ్​లో నవ్వులు పంచుతుంటారు. ఇప్పుడు తన కొత్త చిత్రం మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి ప్రమోషన్స్​లో భాగంగా కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాల్లో ఆయన పర్యటిస్తున్నారు. అలా అక్కడి మాల్స్‌, కాలేజ్‌లీకు వెళ్లి ఫ్యాన్స్​ను కలిసి ముచ్చటిస్తున్నారు. అక్కడ కూడా తనదైన శైలి కామెడీతో వారిని ఫుల్​గా నవ్విస్తున్నారు.

అలానే ఆంధ్రప్రదేశ్​ రాజకీయాల్లో బిజీగా ఉంటున్న కేఏ పాల్​.. ప్రస్తుతం అక్కడి పలు సమస్యల గురించి ప్రశ్నిస్తూ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే.. విశాఖ ఉక్కు కర్మాగారంపై ఆయన పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వైజాగ్​లో ఉండగా.. ఆ నగరానికే పోలిశెట్టి కూడా ప్రమోషన్స్​కు వెళ్లారు. అలా వారిద్దరు ఎవరి కారులో వారు రోడ్డుపై ప్రయాణిస్తుండగా అనుకోకుండా కలిశారు.

ఓపెన్ టాప్​ కారులో నుంచి నిలబడి అక్కడి ప్రజలకు అభివాదం చేస్తూ ఫ్యాన్స్​తో ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చి సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మొదట కేఏ పాల్​ తన కారు ఓపెన్​ టాప్​లో నుంచి బయటకు వచ్చి.. ప్రజలకు అభివాదం తెలుపుతుండగా.. అనుకోకుండా అదే రోడ్డుపై ప్రయాణించిన నవీన్ పోలిశెట్టి తన కారును ఆపి.. ఓపెన్ టాప్​లో నుంచి బయటకు కనపడి ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​ ఇచ్చారు. కేఏ పాల్​-పోలిశెట్టి కూడా పలకరించుకున్నారు.

దీంతో ఇద్దరిని ఒకే చోటు చూసిన అభిమానులు ఈలలు, గోలలతో రచ్చ రచ్చ చేశారు. సెల్​ఫోన్​ కెమెరాల్లో ఈ సన్నివేశాలన్ని చిత్రీకరించారు. కాసేపు ట్రాఫిక్ జామ్ కూడా అయింది. అక్కడంతా సందడి వాతావరణం క్రియేట్ అయింది. ఇక ఇది చూసిన నెటిజన్లు.. ఇద్దరు ఫన్నీ పర్సన్స్​ ఒకే చోట అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. వీడియోను షేర్ చేస్తున్నారు.

𝙆𝘼 𝙋𝘼𝙐𝙇 𝙭 𝙉𝘼𝙑𝙀𝙀𝙉 𝙋𝙊𝙇𝙄𝙎𝙃𝙀𝙏𝙏𝙔 #MissShettyMrPolishetty pic.twitter.com/LXILh5p0Yr

— T2BLive.COM (@T2BLive) August 28, 2023
Tags:    
  • Naveenpolishetty 
  • Kapaul 
  • Socialmedia 
  • Rkbeach 
  • Andhrapradesh 
  • Celbrities 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS