• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కన్నప్ప టీమ్.....

కన్నప్ప టీమ్.. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇలా..

| ఇక సినిమా కంటెంట్ కంటే ముందు ప్రమోషన్స్ హడావిడితోనే మేకర్స్ ఎక్కువగా ఈ సినిమాకు మంచి క్రేజ్ తీసుకువస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-05-20 17:06 GMT

మంచు విష్ణు హీరోగా భారీ స్థాయిలో రూపొందుతున్న కన్నప్ప సినిమా రోజురోజుకీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ సినిమా 100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే క్యాస్టింగ్ పవర్ తో మాత్రం ఈ సినిమా బిగ్గెస్ట్ పాన్ ఇండియా బడ్జెట్ సినిమా అన్నట్లుగా హైలెట్ అవుతోంది. ఇక సినిమా కంటెంట్ కంటే ముందు ప్రమోషన్స్ హడావిడితోనే మేకర్స్ ఎక్కువగా ఈ సినిమాకు మంచి క్రేజ్ తీసుకువస్తున్నారు.

ప్రముఖ సినీ తారలు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు. సినిమాలో మోహన్ బాబు మోహన్ లాల్ శివరాజ్ కుమార్ లాంటి అగ్ర నటీనటులు ప్రత్యేకమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో భాగం అయ్యారు. అతను శివుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

కేవలం వారం రోజుల్లోనే అతనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఇక ప్రభాస్ కూడా ఒక పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు. మొదట అతను శివుడి పాత్రలో నటిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ నందీశ్వరుడు పాత్ర నచ్చడంతో ప్రభాస్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ సినిమా కోసం అతను ఎలాంటి పారితోషికం కూడా తీసుకోలేదట. మంచు విష్ణు తో ఉన్న స్నేహం కోసమే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా టీజర్ ను ప్రముఖ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించటం విశేషం. రీసెంట్గా చిత్ర యూనిట్ సభ్యులు ఆ ఈవెంట్ కు హాజరయ్యారు. హీరో విష్ణు, దర్శకుడు ముఖేష్ తో పాటు ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా ఆ ఈవెంట్లో కన్నప్ప టీంతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఇక మంచి విష్ణు సతీమణి కూడా వారితో పాటు అక్కడ కనిపించారు. మొత్తంగా భక్తకన్నప్ప సినిమా కంటెంట్ తో కంటే కూడా ఇలా ప్రమోషన్స్ హడావిడితోనే ఎక్కువగా హైప్ క్రియేట్ చేసుకుంటుంది. తప్పకుండా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరి కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని మేకర్స్ ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ ఉన్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. అలాగే ప్రతి పాత్రకు సంబంధించిన ఒక స్పెషల్ టీజర్ కూడా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా గ్రాండ్ గా ప్రమోషన్స్ చేయాలని అనుకుంటున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


The highly anticipated premiere of “Horizon: An American Saga” was graced by @themohanbabu, @iVishnuManchu, his wife @vinimanchu, & @PDdancing#VishnuManchu is in #Cannes2024 to showcase the teaser of #Kannappa🏹, set to take place this evening at the Olympia theatre.… pic.twitter.com/KVj8MJyZOL

— Kannappa The Movie (@kannappamovie) May 20, 2024


Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • FilmIndustry 
  • Kannappa 
  • MohanBabu 
  • ManchuVishnu 
  • ViniManchu 
  • Cannes2024 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS