శివుడి పాత్రలకు ఆయన మాత్రమే సెట్ అవుతారా? నెట్టింట కొత్త చర్చ!
గతంలో మెగాస్టార్ చిరంజీవి సైతం 'శ్రీ మంజునాథ' సినిమాలో శివుడిగా అద్భుతంగా నటించి మెప్పించారు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాలో శివుడి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఏకంగా రూ. 6 కోట్లు తీసుకున్నట్లు టాలీవుడ్‌లో గట్టి ప్రచారం సాగుతోంది. అయితే ఈ పాత్రకు అంత పెద్ద స్టార్ కంటే, బుల్లితెరపై శివుడిగా జీవించిన మోహిత్ రైనా అయితేనే వంద శాతం పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేవాడంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు. ఎన్ని కోట్లు పెట్టి పెద్ద స్టార్లను తెచ్చినా, శివుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది మోహిత్ రైనా మాత్రమేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ వివరాలు చూద్దాం..
'మహాదేవ్'గా గుండెల్లో నిలిచిన నటుడు:
హిందీ సీరియల్ 'దేవోన్ కే దేవ్... మహాదేవ్' లో శివుడిగా నటించిన మోహిత్ రైనాను ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. ఆయన ఆహార్యం, ఆ గంభీరమైన కటౌట్, భక్తిభావం ఉట్టిపడే ముఖ కవళికలు ఆ పాత్రకు అక్షరాలా సరిపోయాయి. ఇక ఆ సీరియల్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో, శివుడిగా మోహిత్ రైనాకు అంతకంటే పెద్ద పేరు వచ్చింది.
చిరంజీవి కంటే కూడా అతనే బెస్ట్ అంటున్న ఫ్యాన్స్:
గతంలో మెగాస్టార్ చిరంజీవి సైతం 'శ్రీ మంజునాథ' సినిమాలో శివుడిగా అద్భుతంగా నటించి మెప్పించారు. ఆ పాత్ర కూడా జనాలకు బాగా నచ్చింది. అయితే, కొంతమంది ప్రేక్షకులకు మాత్రం శివుడు అనగానే అందరికంటే ముందే గుర్తొచ్చేది ఓన్లీ మోహిత్ రైనా మాత్రమే. ఇక అంతలా ఆయన తన నటనతో, రూపంతో ప్రజల మనసుల్లో గాఢమైన ముద్ర వేశారు.
స్టార్ల కంటే క్యారెక్టరే ముఖ్యం:
కేవలం క్రేజ్ కోసం, మార్కెట్ కోసం కోట్ల రూపాయలు గుమ్మరించి పెద్ద స్టార్లను పెట్టడం కంటే.. పాత్రకు న్యాయం చేసే నటులను ఎంచుకుంటే సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్ కంటే, శివుడి గెటప్‌లో పర్ఫెక్ట్‌గా ఒదిగిపోయే మోహిత్ రైనా లాంటి చిన్న నటుడు ‘కన్నప్ప’కు మరింత ప్లస్ అయ్యేవాడనేది ఫ్యాన్స్ అభిప్రాయం.
సోషల్ మీడియాలో నెటిజన్ల డిమాండ్:
ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా ఇదే అంశంపై పెద్ద చర్చ నడుస్తోంది. గ్రాఫిక్స్, భారీ రెమ్యునరేషన్ల కంటే ఆ క్యారెక్టర్‌లో ఉండే పవిత్రత, గాంభీర్యం ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. అందుకే అక్షయ్ కంటే మోహిత్ రైనా శివుడిగా వచ్చుంటే థియేటర్లలో పూనకాలు ఖాయమని ఫ్యాన్స్ గట్టిగా చెప్తున్నారు.
సినిమాలో ఏ పాత్రకైనా నటుడి స్టార్ డమ్ కంటే ఆ రూపం, హావభావాలు కుదరడం చాలా ముఖ్యం. మరి ప్రేక్షకులు కోరుకుంటున్నట్లుగా రాబోయే రోజుల్లో అయినా మన మేకర్స్ స్టార్ల వెనుక పరిగెత్తడం ఆపి, పాత్రలకు సరిపోయే అసలైన నటులకు ఇలాంటి ఐకానిక్ రోల్స్ ఇస్తారో లేదో చూడాలి.