• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నా రక్తం పతనం కోరుకుంటే.....

నా రక్తం పతనం కోరుకుంటే.. ప్రభాస్ మాత్రం..

| మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమా జూన్ 27 విడుదల కానున్న విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-05-17 08:26 GMT

మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమా జూన్ 27 విడుదల కానున్న విషయం తెలిసిందే. మహేశ్వరుడి భక్తుడు కన్నప్ప జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ. 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా క్రేజ్ కు తగ్గట్టుగా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక సినిమాకు పాజిటివ్ హైప్ వచ్చేలా ప్రస్తుతం విష్ణు అమెరికాలో ఉంటూ, అభిమానులతో సమావేశాలు, ఇంటర్వ్యూల ద్వారా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాలో ప్రధానంగా స్టార్ క్యాస్ట్ హైప్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నందీశ్వరుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రల్లో కనిపించనుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్‌లో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై ఈ సినిమా రూపొందుతోంది.

విష్ణు కోసం గతంలో ప్రభాస్‌తో ‘డేనికైనా రెడీ’ సినిమాలో సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఒక ఫోన్ కాల్ సీన్ కోసం డబ్బింగ్ చెప్పాడు. ఇక తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో విష్ణు, ప్రభాస్‌తో తన సన్నిహిత సంబంధం గురించి మరింత ఎమోషనల్ గా వివరణ ఇచ్చారు. విష్ణు మాట్లాడుతూ.. ప్రభాస్‌తో నాకు చాలా మంచి స్నేహ బంధం ఉంది, స్నేహపూర్వకంగా ఆయన్ని తిడతాను కూడా. ప్రభాస్ తను ఎంత పెద్ద స్టారో గుర్తించడు, ఎవరి గురించి పట్టించుకోడు, తన ప్రపంచంలో సంతోషంగా ఉంటాడు. కెరీర్ మొదటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు” అని విష్ణు అన్నాడు.

అలాగే ప్రభాస్ సింప్లిసిటీ గురించి విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ప్రభాస్‌కు నీవు ఎప్పటికీ మారకూడదని చెప్పాను, దానికి ఆయన నవ్వుతూ ‘మారడానికి ఏం ఉంది, నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాను కదా’ అని అన్నాడు. అతనిలా జీవించడం చాలా అరుదు” అని విష్ణు పేర్కొన్నాడు. ప్రభాస్ ఆసియాలోనే అతిపెద్ద స్టార్‌లలో ఒకడిగా ఎదిగినప్పటికీ, అతని సింప్లిసిటీ అభిమానులను ఆకర్షిస్తుందని విష్ణు చెప్పాడు.

తన కుటుంబంలో ఎదురవుతున్న సమస్యల గురించి కూడా విష్ణు భావోద్వేగంగా మాట్లాడాడు. “రక్తం పంచుకొని పుట్టిన వారే నా పతనం కోరుకుంటే.. ప్రభాస్ మాత్రం నేను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాడు. మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి కలిస్తే, మన స్నేహం ఎప్పటికీ ఉంటుందని, మనం భిన్నమైన జీవన శైలి నుంచి వచ్చామని ఆయన అన్నాడు” అని విష్ణు తన వివరణను వ్యక్తం చేశాడు. ఇక ‘కన్నప్ప’ సినిమా శివ భక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ నంది పాత్రలో, అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా కనిపించనున్నారు. మోహన్‌లాల్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Tags:    
  • Kannappa 
  • Manchuvishnu 
  • MohanLal 
  • Prabhas 
  • Tollywood 
  • Panindia 
  • MohanBabu 
  • Manchufamily 
  • Rajasaab 
  • kalki2898AD 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS