ఆమె జీవితం సినిమా-రాజకీయానికే అంకితం!
అటుపై రాజకీయాల్లోనూ కంగన ఎక్కడా తగ్గలేదు. తొలిసారి పోటీతోనే ఏకంగా ఎంపీ అయింది. అక్కడ కూడా తనదైన బాణీని వినిపించే ప్రయత్నం చేస్తోంది.;
బాలీవుడ్ లో కంగనా రనౌత్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకొచ్చి అగ్ర తారగా ఎదిగింది. ఇంతింతై వటిడింతైన చందంగా అమ్మడు పరిశ్రమలో ఎది దిగింది. ఎదిగే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కుంది. పెద్ద పెద్ద బడా హీరోలకు ఎదురెళ్లింది. నువ్వెంత అంటే? నువ్వెంత అన్న తీరుతో యుద్దాలకే తెర తీసింది. కంనగలో ఈ రకమైన తెగింపు అంత వరకూ బాలీవుడ్ ఏ నటీ మణిలోనూ చూడలేదు. అలా తొలిసారి కంగన బాలీవుడ్ పరిశ్రమకే ఓ సవాల్ గా మారింది.
ఎక్కడైనా తగ్గేదేలే:
అటుపై రాజకీయాల్లోనూ కంగన ఎక్కడా తగ్గలేదు. తొలిసారి పోటీతోనే ఏకంగా ఎంపీ అయింది. అక్కడ కూడా తనదైన బాణీని వినిపించే ప్రయత్నం చేస్తోంది. పరోక్షంగా పార్టీ తీరుపైనే అమ్మడు సెటైర్లు గుప్పిస్తుంది. సినిమా అయినా రాజకీయమైనా? తనెక్కడా తగ్గదేలే అన్న తీరుతోనే ముందుకెళ్తోంది. ఈ రెండు రంగాలపై ఉన్న ఆసక్తి అమ్మడికి వ్యక్తిగత జీవితంపై ఎంత మాత్రం లేదని తాజాగా కంగన మాటల్లో బయట పడింది. తన నరనరాన సినిమా-రాజకీయ రంగాలు తప్ప ఇంకేలేవని తేల్చి చెప్పింది.
విమర్శించే అధికారం ఎవరిచ్చారు?
కంగన ముందు పెళ్లి ప్రస్తావన్ రాగా? ఆ జీవితానికి పూర్తి దూరంగా ఉన్నట్లు వెల్లడించింది. పెళ్లి...పిల్లలు అనేది తనకు ఎంత మాత్రం సెట్ అవ్వవని పేర్కొంది. వివాహ వ్యవస్తపై కూడా అంతగా నమ్మకం లేదని తేల్చి చెప్పింది. గతంలో తాను పెళ్లి చేసుకుంటానని...పిల్లలు కంటానని జరిగిన ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని తాను కోరుకున్న జీవితం పెళ్లి...భర్త..పిల్లలు కాదని కుండబద్దలు కొట్టేసింది. `పెళ్లిపై తనకు శ్రద్ద లేదని కొందరు విమర్శిస్తున్నారు. పెళ్లి చేసుకోవాలా? లేదా? అన్నది తన వ్యక్తిగత అభిప్రాయ మని తనని విమర్శించే అధికారం ఎవరికీ లేదని అభిప్రాయపడింది.
కంబ్యాక్ కోసం ఎదురు చూపు:
తన గురించి ఎవరైనా విశ్లేషించాలనుకుంటే సినిమా..రాజకీయ రంగాల్లో ఎలా రాణిస్తుందో? వాటిపై డిబేట్లు పెట్టుకున్నా? తనకు ఎలాంటి అభ్యంతరం లేదని..రాజకీయాలోకి రావడానికి కారణంగా ప్రజలకు సేవచేయాలని అంతకు మంచి రాజకీయాల్లోకి తాను కోట్ల రూపాయలు సంపాదించడానికి రాలేదంది. దీంతో కంగన పెళ్లి విషయంలో విమర్శలకు, అభిమానులకు పూర్తి క్లారిటీ దొరికింది. ప్రస్తుతం కంగన సినిమా-రాజకీయం అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తోంది. ఈ మధ్య కాలంలో కంటన నటించిన సినిమలేవి సరిగ్గా ఆడటం లేదు. భారీ ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి. దీంతో మంచి కంబ్యాక్ చిత్రం కోసం ఎదురు చూస్తోంది.