• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈసారి మూడు పాత్ర‌ల్లో...

ఈసారి మూడు పాత్ర‌ల్లో క్వీన్ చించుడే

| ఇప్పుడు కంగ‌న న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీ త‌ను వెడ్స్ మ‌ను రీబూట్ అవుతోంది.

By - Tupaki Desk
Update: 2024-10-04 22:30 GMT

కోరి ఎన్ని వివాదాల్లో త‌ల దూర్చినా క్వీన్ కంగ‌న‌కు న‌టిగా కెరీర్ ప‌రంగా ఎదురే లేదు. ఈ బ్యూటీ వ‌ర‌స ప‌రాజ‌యాల్లో ఉన్నా కానీ, త‌న సొంత సినిమా ఎమ‌ర్జెన్సీని రిలీజ్ చేయ‌లేక‌పోతున్నా కానీ, అవ‌కాశాలు వెంట‌ప‌డుతూనే ఉన్నాయి. ఇప్పుడు కంగ‌న న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీ త‌ను వెడ్స్ మ‌ను రీబూట్ అవుతోంది. ఈ ఫ్రాంఛైజీలో మూడో భాగం తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం. ఆస‌క్తిక‌రంగా ఇందులో కంగ‌న త్రిపాత్రాభిన‌యం చేయ‌నుంద‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...


2011లో ఆనంద్ ఎల్ రాయ్, కంగనా రనౌత్ , ఆర్ మాధవన్ మొదటిసారి కలిసి 'తను వెడ్స్ మను' లాంటి క్లాసిక్ ని అందించారు. ఇది బాక్సాఫీస్ వద్ద స్లీపర్ హిట్‌గా నిలిచింది. నాలుగు సంవత్సరాల తరువాత ఈ ముగ్గురూ సీక్వెల్ కోసం తిరిగి కలిశారు. ఇది భారీ బ్లాక్‌బస్టర్‌గా మారడమే కాకుండా నాయికా ప్ర‌ధాన చిత్రాల్లోనే అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. అప్పటి నుండి తను వెడ్స్ మను 3 గురించి ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయినా కానీ మేకర్స్ ఈ విషయంపై మౌనంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆనంద్ ఎల్ రాయ్ .. అతడి రైటింగ్ పార్ట్‌నర్ హిమాన్షు శర్మ మూడవ భాగం ప్లాట్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. స‌న్నిహిత‌ వర్గాల సమాచారం ప్రకారం.. తను వెడ్స్ మను 3 గత చిత్రాల ముగింపు నుంచి మొద‌ల‌వుతుంద‌ని తెలిసింది. మొదటి రెండు చిత్రాల మాదిరిగానే మూడవ భాగంలో హాస్యం, శృంగారం, నాటకీయత కలగలిసి వాస్త‌విక‌త‌ను ప్ర‌తిబింబించేలా క‌థాంశం ఉంటుంది. ప్రాథమిక కాన్సెప్ట్ లాక్ అయింది. 2025 ద్వితీయార్థంలో షూటింగ్ ప్రారంభించడమే లక్ష్యం అని తెలుస్తోంది.

ఈసారి కంగనా రనౌత్ త్రిపాత్రాభినయం చేస్తుందని, ఆర్ మాధవన్ తన ఏకైక పాత్రను కొనసాగిస్తున్నాడని సోర్స్ వెల్లడించింది. కంగనా కెరీర్ లో మొదటిసారి త్రిపాత్రాభినయం చేయడానికి థ్రిల్లింగ్‌గా ఉంది. ఆనంద్ ఎల్ రాయ్ నుండి పూర్తి కథనం కోసం ఎదురుచూస్తోంది. ఇది కంగ‌న‌కు సవాల్ లాంటిది. నటిగా కొత్త కోణాలను అన్వేషించడానికి అనుమతిస్తుంది``అని అంతర్గత సోర్స్ వెల్ల‌డించింది. 'తను వెడ్స్ మను రిటర్న్స్‌'లో కంగనా ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ధనుష్, కృతి సనన్‌లతో ఆనంద్ ఎల్.రాయ్ తన ప్రస్తుత ప్రాజెక్ట్ `తేరే ఇష్క్ మే`ని పూర్తి చేసిన తర్వాత చిత్రీకరణ జూలై లేదా ఆగస్టు 2025లో ప్రారంభమవుతుంది. ఈలోగా కంగనా ఎమర్జెన్సీ విడుదలకు సిద్ధమవుతోంది. తను వెడ్స్ మను 3 విడుద‌ల‌కు 2026 వ‌ర‌కూ ఛాన్స్ లేదు.

సీక్వెల్ ఆలోచ‌న లేదంటూనే...

మొదట్లో తను వెడ్స్ మనుకి సీక్వెల్ చేసే ఆలోచన లేదని దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ప్ర‌క‌టించినా కానీ, త‌ర్వాత రెండో భాగం తీసాడు. ఇప్పుడు మూడో భాగాన్ని ప్లాన్ చేస్తున్నాన‌ని చెప్పాడు. ఇందులో పాత్రలన్నీ మూడో భాగం కోసం అడుగుతున్నాయి. మనకు గొప్ప కథ దొరికిన నిమిషంలో ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెబుతున్నారు.

తను వెడ్స్ మను 3 కథలో కొత్త‌ద‌నం ఏమిటో ఆనంద్ ఎల్ రాయ్ వివ‌రించాడు. నేను నిజంగా వెతుకుతున్నది ప్రత్యేకమైన స్త్రీ-పురుష సంబంధాన్ని... తను వెడ్స్ మనులోని డైనమిక్స్ రాంఝనా నుండి భిన్నంగా ఉన్నాయి. రాంఝనా అత్రంగి రే నుండి భిన్నంగా ఉంటుంది. అత్రంగి రే హసీన్ దిల్‌రూబా నుండి చాలా భిన్నంగా ఉంటుంది. దర్శకుడిగా, నిర్మాతగా ప్రతిసారీ కొత్త ప్రేమకథను అన్వేషించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. నేను ఒక నిర్దిష్టమైన చురుకుదనం ఉన్న ప్రేమ‌క‌థ కోసం వెతుకుతున్నాను. తను వెడ్స్ మనులో నేను మద్యపానం మరియు ధూమపానం చేసే అమ్మాయిని చూపించాను. దర్శకుడిగా నేను ఆమెను జడ్జ్ చేయలేదు. అందుకే నా ప్రేక్షకులు ఇలాంటి పాత్ర‌ను అంచనా వేయలేదు... అని తెలిపాడు.

Tags:    
  • Bollywood 
  • Tollywood 
  • Filmindustry 
  • Emergency 
  • TanuWedsManu 
  • Kanganaranaut 
  • AanandLRai 
  • RMadhavan 
  • Tanuwedsmanu3 
  • HimanshuSharma 
  • Dhanush 
  • Kritisanon 
  • AtrangiRe 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS