కన్నప్ప ట్రోల్స్ పై కలెక్షన్ కింగ్ రెస్పాన్స్..!
ఐతే కన్నప్ప సినిమా రిలీజ్ టైం లోనే ఈ సినిమాపై ట్రోల్స్ ఇంకా నెగిటివ్ కామెంట్స్ చేయొద్దని చిత్ర యూనిట్ రిక్వెస్ట్ చేసింది.;
మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా ఈమధ్యనే రిలీజైంది. మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు. కన్నప్ప సినిమాకు ఫస్ట్ షో టాక్ పాజిటివ్ గానే వచ్చింది. ప్రభాస్ రుద్ర పాత్రలో మెరుపులు మెరిపించాడు.. అక్షయ్ కుమార్ శివుడిగా.. మోహన్ లాల్ గెస్ట్ రోల్ లో తమ మార్క్ చూపించారు. ఇక మంచు విష్ణు తిన్నడుగా అదే కన్నప్పగా చూపించిన అభినయం ప్రశంసనీయంగా అనిపించింది.
కన్నప్ప సినిమా అంతా ఒక ఎత్తు చివరి అరగంట ఒక ఎత్తు అనిపించేలా చేసింది. ఆ క్లైమాక్స్ చూసి ప్రేక్షకులంతా బరువైన హృదయంతో తిరిగి వచ్చారు. ఐతే కన్నప్ప సినిమా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా ఈ సినిమాతో మంచు ఫ్యామిలీ ఒక మంచి ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. సినిమా గురించి అందులో నటీనటుల గురించి చెప్పడం కన్నా కన్నప్పతో మంచు విష్ణు తన భక్తి తత్వాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడని చెప్పొచ్చు.
ఐతే కన్నప్ప సినిమా రిలీజ్ టైం లోనే ఈ సినిమాపై ట్రోల్స్ ఇంకా నెగిటివ్ కామెంట్స్ చేయొద్దని చిత్ర యూనిట్ రిక్వెస్ట్ చేసింది. లేటెస్ట్ గా కన్నప్ప సినిమాపై ట్రోల్స్ చేసిన వాళ్లు.. విమర్శించిన వారి గురించి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రెస్పాండ్ అయ్యారు. ఒక పెద్దాయన చెప్పారు ఈ జన్మలో కానీ ఇదివరకు జన్మలో కానీ చేసుకున్న కర్మ ఈ కామెంట్స్ చేసిన వారి ద్వారా కరిగిపోతాయని అన్నారు. అలా కామెంట్స్ చేసిన వాళ్లు కూడా బాగుండాలి.. వాళ్ల ఫ్యామిలీస్, అమ్మా నాన్న అంతా బాగుండాలని అన్నారు మోహన్ బాబు.
కన్నప్ప సినిమా కోసం దాదాపు శివుడితో రెండేళ్ల పైన ప్రయాణం చేశారు మోహన్ బాబు అండ్ టీం. అందుకే సినిమాను ఎంత ఖచు పెట్టి తీశాం అన్నట్టు కాకుండా ఎంత భక్తి భావంతో చేశాం అన్నది చెబుతూ వచ్చారు. సినిమా చూసినా ఎక్కువమంది ఆడియన్స్ కూడా కన్నప్ప ని ఒక మంచి ప్రయత్నం లానే చూశారు. మిగతా విషయాలు ఎలా ఉన్నా మోహన్ బాబు, మంచు విష్ణు ఈ సినిమా తీయలేదు ఆ శివుడే వాళ్ల చేత తీయించాడని చెప్పుకునేలా చేశారు.