• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా ఫ్యాన్స్ కళ్లన్నీ...

మెగా ఫ్యాన్స్ కళ్లన్నీ భారతీయుడు వైపే!

| జీనియస్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో సీనియర్ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఇండియన్-2'.

By - Tupaki Desk
Update: 2024-07-06 17:30 GMT

జీనియస్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో సీనియర్ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఇండియన్-2'. ఇది 28 ఏళ్ల క్రితం వచ్చిన 'ఇండియన్' సినిమాకు సీక్వెల్. తెలుగులో 'భారతీయుడు 2' పేరుతో రిలీజ్ కాబోతోంది. మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులు ఈ సినిమా పట్ల ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా 'గేమ్ ఛేంజర్' అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అనుకోని కారణాలతో 'ఇండియన్ 2' ఆగిపోవడంతో, దర్శకుడు ఈ మెగా ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో రెండు చిత్రాలను ఒకేసారి టేకప్ చెయ్యాల్సి వచ్చింది. రెండు సినిమాల షూటింగులు ప్యారలల్ గా ప్లాన్ చెయ్యడంతో, చెర్రీ సినిమా లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు 'భారతీయుడు 2' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన డైరెక్టర్ శంకర్.. చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం చూస్తున్నారు. 'రోబో' తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో హిట్టు కొట్టాలని ప్రయత్నిస్తున్నారు కానీ, ఆశించిన విజయం దక్కడంలేదు. 'స్నేహితులు', 'ఐ' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. చివరగా 2018లో ఆయన్నుంచి వచ్చిన 2.0 సినిమా నిర్మాతలకు నష్టాలనే మిగిల్చింది. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు 'భారతీయుడు 2' సినిమాతో కంబ్యాక్ ఇవ్వడాన్ని శంకర్ రెడీ అయ్యారు.

'ఇండియన్ 2' సినిమాతో సక్సెస్ సాధించి, శంకర్ తన సత్తా ఏంటో చూపించాల్సిన అవసరం ఉంది. ఈ విజయం రామ్ చరణ్ కు కూడా కీలకమే. ఎందుకంటే ఈ సినిమా ఫలితం 'గేమ్ చేంజర్' పై ప్రభావం చూపిస్తుంది కాబట్టి. 'భారతీయుడు 2' హిట్టయితే ఆటోమేటిక్ గా చరణ్ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి.. కావాల్సిన బజ్ క్రియేట్ అవుతుంది.. ఒక్కసారిగా లెక్కలన్నీ మారిపోతాయి. కానీ అదే రిజల్ట్ ఏమాత్రం కొంచం తేడా కొట్టినా, శంకర్ నెక్స్ట్ మూవీ మార్కెట్ పై ఎఫెక్ట్ పడుతుంది.

అందులోనూ RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తోన్న సినిమా 'గేమ్ చేంజర్'. తన తండ్రితో కలిసి నటించిన 'ఆచార్య' చిత్రం డిజాస్టర్ గా మారింది. కాబట్టి ఈసారి కచ్ఛితంగా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి, తన స్టార్ పవర్ ఏంటో బాక్సాఫీసుకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి శంకర్ సక్సెస్ కూడా తోడైతే గేమ్ చేంజర్ కు ఇంక తిరుగుండదు. అందుకే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ 'భారతీయుడు 2' కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు. శంకర్ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో సపోర్ట్ గా నిలుస్తున్నారు.

ఇప్పటికైతే 'ఇండియన్ 2' మూవీ నుంచి ప్రమోషనల్ మెటీరియల్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. పాటలు పెద్దగా క్లిక్ అవ్వకపోయినా, టీజర్ ట్రైలర్ మాత్రం సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. దీనికి తోడు కమల్ హాసన్ కీలక పాత్ర పోషించిన 'కల్కి 2898 AD' చిత్రం సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది. దీంతో కమల్ గురించి జనాల్లో ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఇదంతా పరోక్షంగా 'భారతీయుడు 2' కి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మరి బాక్సాఫీసు వద్ద ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    
  • Kamalhassan 
  • Indian2 
  • Ramcharan 
  • Tollywood 
  • Movienews 

Similar News

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

Copyright @2026

Powered by Blink CMS