• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమల్ - మణిరత్నం.....

కమల్ - మణిరత్నం.. పర్ఫెక్ట్ టైమ్ లోనే..

| యూనివర్సల్ యాక్టర్ కమల్ ఈ ఏడాది కల్కి2898ఏడీ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించి ఆకట్టుకున్నారు.

By - Tupaki Desk
Update: 2024-09-11 12:30 GMT

యూనివర్సల్ యాక్టర్ కమల్ ఈ ఏడాది కల్కి2898ఏడీ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. సుప్రీమ్ యాస్కిన్ క్యారెక్టర్ లో కమల్ హాసన్ నట విశ్వరూపం కల్కి పార్ట్ 2లో కనిపించనుంది. ఇక కల్కి తర్వాత ఈ ఏడాది ఇండియన్ 2 సినిమాతో కమల్ హాసన్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. సూపర్ హిట్ మూవీ ఇండియన్ కి సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ థగ్ లైఫ్ అనే మూవీ చేస్తున్నాడు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో శింబు, అశోక్ సెల్వన్, అలీ ఫజల్, జియో జార్జ్ లాంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలలో నటించారు. ఈ థగ్ లైఫ్ మూవీకి కమల్ హాసన్ కథ అందించారు. మణిరత్నం, కమల్ హాసన్ కలయికలో మూడు దశాబ్దాల క్రితం నాయకన్ మూవీ వచ్చింది. మరల ఇప్పుడే వీరిద్దరూ కలిసి థగ్ లైఫ్ మూవీ చేస్తున్నారు.

ఇంకా మూవీ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. యూఏఈలో చివరి షెడ్యూల్ ని స్టార్ట్ చేసారంట. ఈ షూటింగ్ కంప్లీట్ అయ్యాక రిలీజ్ డేట్ పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. నిజానికి ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ ఆఖరులో లేదంటే నవంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు సంక్రాంతికి మూవీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

2025 సంక్రాంతి రేసులో అజిత్ విడా మయార్చి రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఆ చిత్రాన్ని 2025 సమ్మర్ కి వాయిదా వేయబోతున్నట్లు సమాచారం. తెలుగులో చూసుకుంటే వెంకీ అనిల్ సినిమాతో పాటు మెగాస్టార్ విశ్వంభర ముందే డేట్స్ లాక్ చేసుకున్నాయి. ఇక ఈ పోటీలో సంక్రాంతి ఫెస్టివల్ ని ఉపయోగించుకోవాలని కమల్ హాసన్ అండ్ కో భావిస్తున్నారంట. మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో మూవీ పైన భారీ అంచనాలు నెలకొని ఉంటాయి.

కమల్ హాసన్ ఇండియన్ 3 చిత్రాన్ని 2025లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అంతకంటే ముందుగానే థగ్ లైఫ్ తో సూపర్ హిట్ కొట్టాలని కమల్ హాసన్ భావిస్తున్నారు. అందుకే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారంట. ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి ఫీమేల్ లీడ్ రోల్స్ లో కనిపించబోతున్నారు. కమల్ హాసన్, మణిరత్నం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండటం విశేషం.

Tags:    
  • Nayakan 
  • Kamalhaasan 
  • Maniratnam 
  • Thuglifemovie 
  • Filmindustry 
  • Indian2 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS