• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమల్.. స్క్రిప్ట్ ను అలా...

కమల్.. స్క్రిప్ట్ ను అలా హ్యాండిల్ చేస్తున్నారా?

| చిత్ర పరిశ్రమలోకి వచ్చి ఎన్నో ఏళ్లు అయినా.. ఆయన అదే పంథాను కొనసాగిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-12-21 00:30 GMT

కమల్ హాసన్.. సినీ ఇండస్ట్రీలో ఆయన ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. చిత్ర పరిశ్రమలోకి వచ్చి ఎన్నో ఏళ్లు అయినా.. ఆయన అదే పంథాను కొనసాగిస్తున్నారు. ఏడు పదుల వయసులో వరుస చిత్రాలతో అలరిస్తున్నారు. తన విలక్షణమైన నటనతో ఆకట్టుకుంటున్నారు. యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు!

అయితే మక్కల్ నీది మయమ్‌ పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కమల్.. ఎప్పటికప్పుడు పలు విషయాలపై స్పందిస్తుంటారు. అదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్డేట్స్ ఇస్తుంటారు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా కమల్ హాసన్.. ఇన్ స్టాలో ఓ క్రేజీ పోస్ట్ పెట్టారు.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన.. గ్లోవ్స్ తో కొత్త స్క్రిప్ట్ ను హ్యాండిల్ చేస్తున్నట్లు పోస్ట్ పెట్టారు. ఓ క్లాత్ షోరూమ్ కు వెళ్లిన ఆయన.. గ్లోవ్స్ ను హ్యాండ్స్ కు వేసుకుని చెక్ చేసుకున్నారు. ఆ సమయంలో దిగిన పిక్ ను పోస్ట్ చేశారు. నా కొత్త స్క్రిప్ట్‌ను కిడ్ గ్లోవ్స్‌ తో హ్యాండిల్ చేస్తున్నానంటూ క్యాప్షన్ గా కమల్ హాసన్ రాసుకొచ్చారు.

పిక్ లో అదిరిపోయే లుక్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. కిడ్ గ్లోవ్స్ తో స్క్రిప్ట్ ను హ్యాండిల్ చేస్తున్నారా సర్ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. రీసెంట్ గా చికాగోలో చిల్ అవుతున్న పిక్స్ కూడా పోస్ట్ చేశారు. చికాగో చాలా చల్లగా ఉంటుందని రాసుకొచ్చారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. 2024లో ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీలో సుప్రీం యాస్కిన్ రోల్ లో నటించారు. తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించారు. ఆ సినిమా సీక్వెల్ లో కూడా నటించనున్నారు. ఆ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ సీక్వెల్ ఇండియన్-2 మూవీతో థియేటర్లలో సందడి చేశారు. కానీ ఆ సినిమాతో డిజాస్టర్ అందుకున్నారు.

కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఇండియన్-2 బాగా నిరాశపరిచింది. ఇప్పుడు ఇండియన్-3లో యాక్ట్ చేస్తున్నారు. త్వరలో ఆ సినిమా థియేటర్లలోనే రిలీజ్ అవ్వనుందని రీసెంట్ గా శంకర్ క్లారిటీ ఇచ్చారు. దాంతోపాటు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న థగ్ లైఫ్ లో యాక్ట్ చేస్తున్నారు. 37 ఏళ్ల తర్వాత శంకర్, కమల్ కాంబో రిపీట్ అవుతుండడంతో.. జూన్ 5న రిలీజ్ కానున్న ఆ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags:    
  • Kollywood 
  • Filmindustry 
  • Indian2 
  • Indian3 
  • Kamalhaasan 
  • Instapost 
  • Viralpost 
  • Socialmedia 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS