• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇండియన్-3.. ఇదొక్కటే...

ఇండియన్-3.. ఇదొక్కటే మార్గం!

| విశ్వనటుడు కమల్ హాసన్ ఐకానిక్ హిట్ సినిమాల్లో ఇండియన్ మూవీ ఒకటి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఆ సినిమా.. 1996లో రిలీజ్ అయ్యి ఓ రేంజ్ లో హిట్ అయింది.

By - Tupaki Desk
Update: 2025-07-18 05:56 GMT

విశ్వనటుడు కమల్ హాసన్ ఐకానిక్ హిట్ సినిమాల్లో ఇండియన్ మూవీ ఒకటి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఆ సినిమా.. 1996లో రిలీజ్ అయ్యి ఓ రేంజ్ లో హిట్ అయింది. ఆ మూవీలో కమల్ హాసన్ సేనాపతి రోల్ లో కనిపించి తన యాక్టింగ్ తో వేరే లెవెల్ లో అదరగొట్టారు.

ఆ తర్వాత ఇండియన్ మూవీకి సీక్వెల్ ఇండియన్-2ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఇండియన్-3ని కూడా ప్లాన్ చేశారు. కానీ అనేక ఏళ్ల గ్యాప్ తర్వాత రిలీజ్ అయిన ఇండియన్-2.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా.. మూవీ లవర్స్, అభిమానుల అంచనాలను అస్సలు అందుకోలేకపోయింది.

విడుదలకు ముందే ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ అయినా.. సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో రిజల్ట్ అందుకోలేకపోయింది. దీంతో ఇండియన్-3పై అందరికీ అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. సినిమా రిలీజ్ అవ్వదని కొందరు.. ఓటీటీలో రిలీజ్ అవుతుందని మరికొందరు అన్నారు. ఇంకొందరు పూర్తి ప్రాజెక్ట్ కే స్వస్తి పలికేశారని అన్నారు.

కానీ మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. ఆ మధ్య శంకర్ మాత్రం ఇండియన్-3 వస్తుందనే చెప్పారు. అయితే ప్రస్తుతానికి కొన్ని సీన్స్ తో పాటు ఒక సాంగ్ షూటింగ్ పెండింగ్ ఉందని తెలుస్తోంది. ఇప్పుడు షూటింగ్ మొదలు కానున్నట్లు సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అవ్వనుందట.

అదే సమయంలో ఇండియన్-3 మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా భాగం కంప్లీట్ అయింది. కాస్త మాత్రమే పెండింగ్ ఉంది. దీంతో బడ్జెట్ తిరిగి పొందాలంటే థియేటర్లలో విడుదల చేయడం మేకర్స్ కు ఒక్కటే మార్గమని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. కాబట్టి థియేటర్స్ లో ఇండియన్-3 సినిమా రిలీజ్ చేయడం జరగాల్సిందేనని చెప్పాలి.

అయితే పార్ట్-3లో సేనాపతి ఉగ్రవాదిగా మారడానికి కారణాలు, బ్రిటిషర్లతో చేసిన యుద్ధాలు సహ పలు అంశాలు ఉండనున్నాయి. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన సాంగ్స్ కూడా ఉండనున్నాయి. కాజల్ అగర్వాల్ సందడి చేయనుంది. కానీ పార్ట్-2 ఫ్లాప్ అవ్వడంతో మూడో భాగంపై ఎలాంటి హైప్ లేదు. క్రేజ్ లేకుండా పోయింది. మరి మేకర్స్ ఏం చేస్తారో.. ఎప్పుడు రిలీజ్ చేస్తారో వేచి చూడాలి.

Tags:    
  • Indian3 
  • KamalHaasan 
  • Shankar 
  • SenapathiReturns 
  • AnirudhRavichander 
  • KajalAggarwal 
  • IndianFranchise 
  • KollywoodNews 
  • TeluguCinema 
  • Indian3Updates 
  • ఇండియన్3 
  • కమల్ హాసన్ 
  • శంకర్ 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS