• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కళ్యాణ్ రామ్‌ కోసం సుక్కు...

కళ్యాణ్ రామ్‌ కోసం సుక్కు అండ్‌ టీమ్‌?

| టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్ సుకుమార్‌ ప్రస్తుతం అల్లు అర్జున్‌ తో పుష్ప 2 ను ముగించే పనిలో ఉన్నాడు.

By - Tupaki Desk
Update: 2024-08-27 09:48 GMT

టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్ సుకుమార్‌ ప్రస్తుతం అల్లు అర్జున్‌ తో పుష్ప 2 ను ముగించే పనిలో ఉన్నాడు. ఒక వైపు దర్శకత్వం చేస్తూనే మరో వైపు సుకుమార్‌ నిర్మాణ భాగస్వామిగా వరుస సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. ఆయన సొంత బ్యానర్‌ సుకుమార్ రైటింగ్స్ ద్వారా కొత్త వారిని ఎంకరేజ్‌ చేస్తున్నాడు. ముఖ్యంగా తన శిష్యులకు అవకాశాలు ఇస్తున్న సుకుమార్‌ మరో కొత్త ప్రాజెక్ట్‌ కు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈసారి నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా సుకుమార్‌ రైటింగ్స్ బ్యానర్లో సినిమా రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

సుకుమార్‌ తన శిష్యుడు సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో కుమారి 21 ఎఫ్‌ అనే సినిమాను నిర్మించాడు. ఆ తర్వాత మరో శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఉప్పెన సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌ వారితో కలిసి నిర్మించాడు. ఆయన నిర్మాతగా మాత్రమే కాకుండా కథ మరియు స్క్రీన్‌ ప్లే లో ఆయన మార్క్‌ ఉంటుంది. ఏదో ఒక సమయంలో సుకుమార్‌ సినిమా మేకింగ్‌ లో వేలు పెడతాడని, అందుకే ఆయన నిర్మాణంలో సినిమాలు కూడా అంత బాగుంటాయని ఇండస్ట్రీ లో మరియు మీడియా వర్గాల్లో ప్రచారం ఉంది.

కళ్యాణ్ రామ్‌ ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఆ సినిమా విడుదల అవ్వడానికి ముందే సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్‌ సినిమా ప్రారంభం అయ్యే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. కానీ సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్‌, సుకుమార్‌ రైటింగ్స్ బ్యానర్‌ లు సంయుక్తంగా కళ్యాణ్‌ రామ్‌, సూర్య ప్రతాప్‌ ల కాంబో మూవీ ని నిర్మించే అవకాశాలు ఉన్నాయి.

గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కి కూడా సుకుమార్‌ మరియు ఆయన టీం మెంబర్స్‌ కథ మరియు స్క్రిప్ట్‌ వర్క్‌ లో ఇన్వాల్వ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేనప్పటికీ కళ్యాణ్ రామ్‌, సూర్య ప్రతాప్‌ కాంబో మూవీ గురించి అనేక రకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతకు సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది, సినిమాలో సుకుమార్‌ నిర్మాణ భాగస్వామిగా ఉంటాడా, తద్వారా కథపై తనదైన ముద్రను ఆయన వేస్తాడా అనేది సినిమా ప్రారంభం అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    
  • Sukumar 
  • Tollywood 
  • Filmindustry 
  • Kalyanram 
  • Sukumarwritings 
  • Suryapratap 
  • Pushpa2 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS