'హలో' హీరోయిన్.. మొత్తానికి ఎన్నాళ్లకెన్నాళ్లకు..

హలో హీరోయిన్.. అదేనండీ యంగ్ హీరో అక్కినేని అఖిల్ హలో మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ పోషించిన కళ్యాణి ప్రియదర్శన్.;

Update: 2025-09-02 20:30 GMT

హలో హీరోయిన్.. అదేనండీ యంగ్ హీరో అక్కినేని అఖిల్ హలో మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ పోషించిన కళ్యాణి ప్రియదర్శన్. కేరళకు చెందిన ఆమె.. తెలుగు మూవీతోనే తెరంగేట్రం చేసింది. హలో సినిమాలో తన యాక్టింగ్ తో ఫిదా చేసిన ఆమె.. మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ తో సెకెండ్ మూవీ చేసింది.

కళ్యాణి, సాయి దుర్గతేజ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రలహరి మూవీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత శర్వానంద్ తో ఆమె చేసిన రణరంగం డిజాస్టర్ గా మారింది. ఆ తర్వాత ఇప్పటి వరకు మరో తెలుగు సినిమాలో నటించని భామ.. డబ్బింగ్ వెర్షన్స్ తో సందడి చేస్తోంది. కానీ మాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయింది.

వరుసగా మలయాళం సినిమాల్లో యాక్ట్ చేస్తున్న అమ్మడు.. కెరీర్ లో భారీ హిట్ కోసం వెయిట్ చేస్తోంది. ఇప్పుడు రీసెంట్ మూవీ లోకా చాప్టర్ 1: చంద్రతో తన కల నెరవేర్చుకుంది. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. మహిళా సూపర్ హీరో థ్రిల్లర్ గా తెరకెక్కి అందరినీ ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది.

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ మూవీ హృదయపూర్వం కలెక్షన్స్ ను డామినేట్ చేసింది. ఆ సినిమా కూడా ఇటీవల రిలీజ్ అయింది. అయితే లోకా డబ్బింగ్ వెర్షన్స్ కూడా మంచి వసూళ్లను రాబడుతున్నాయి. అదే సమయంలో కళ్యాణి ప్రియదర్శన్ తన యాక్టింగ్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారని చెప్పాలి.

చంద్ర రోల్ లో ఆమె అద్భుతమైన నటన సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలిచింది. దీంతో అటు అభిమానుల నుంచి.. ఇటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. యాక్షన్ సీన్స్ లో ఆమె యాక్టింగ్ చూసి అంతా ఫిదా అవుతున్నారు. అమ్మడు అదరగొట్టేసిందని చెబుతున్నారు. చాలా బాగా యాక్ట్ చేసిందని అంటున్నారు.

మొత్తానికి చాలా ఏళ్ల తర్వత ఒక నటిగా అనుకున్నంత రేంజ్ లో హిట్ ను అందుకుంది కళ్యాణి. నెవ్వర్ బిఫోర్ అనేలా ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది.. చేసుకుంటోంది.. దీంతో ఇదే ర్యాపో కంటిన్యూ చేయాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అప్ కమింగ్ మూవీస్ తో భారీ హిట్స్ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News