కల్యాణ్ కృష్ణ మెగా అల్లుడు దగ్గర తేలుతున్నాడా?
మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాకు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వహించాలి. ఆ ప్రాజెక్ట్ ను లాంచ్ చేసి మరీ పక్కనబెట్టిన సంగతి తెలిసిందే.;
మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాకు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వహించాలి. ఆ ప్రాజెక్ట్ ను లాంచ్ చేసి మరీ పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. ఎందుకలా జరిగిందంటే? కల్యాణ్ వినిపించిన స్టోరీ రోటీన్ గా భావించి కల్యాణ్ కృష్ణ కి షాక్ ఇచ్చారు. అప్పటికే 'భోళా శంకర్' తో నమ్మి అవకాశం ఇస్తే మెహర్ రమేష్ ఊహించని దెబ్బ కొట్టాడు.
అది డిజాస్టర్ గా తేలడంతో? చిరంజీవి తదుపరి సినిమా విషయంలో కల్యాణ్ కృష్ణ ట్రాక్ రికార్డు చూసుకుని వెనక్కి తగ్గారు. అనంతరం 'బింబిసార' ఫేం వశిష్ట మల్లిడి తెరపైకి తెచ్చి 'విశ్వంభర' పట్టాలెక్కించారు. ఈ సినిమాపై చిరు ఎంతో కాన్పిడెంట్ గా ఉన్నారు. 'జగదీక వీరుడు అతిలోక సుందరి', 'అంజి' తర్వాత చిరంజీవి చేస్తోన్న సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ఇది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
మరి కల్యాణ్ కృష్ణ సంగతేంటి? చిరు పక్కన బెట్టిన తర్వాత కళ్యాణ్ కృష్ణ పేరు ఇండస్ట్రీలో వినిపించ లేదు. ఏ హీరోకి స్టోరీ చెప్పినట్లు కల్యాణ్ వార్తల్లో లేడు. మరి ఇప్పుడు ఆయన ఏంచేస్తున్నట్లు? అంటే? చిరంజీవి ఆయన్ని అంత ఈజీగా ఎందుకు వదిలేస్తాడు? కల్యాణ్ కృష్ణకు మేనల్లుడితో మరో ప్రాజెక్ట్ సెట్ చేసినట్లు వినిపిస్తుంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సరైన స్టోరీ కోసం ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే.
'ఉప్పెన' తర్వాత చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. దీంతో హిట్ సినిమాతోనే రావాలనే కసితో ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో చిరంజీవి మేనల్లుడితో మంచి సినిమా తీయమని కళ్యాణ్ ని కోరాడట. దీంతో ఆయన వైష్ణవ్ ఇమేజ్ కు తగ్గ స్టోరీ సిద్దం చేస్తున్నట్లు మెగా కాంపౌండ్ వర్గాల నుంచి తెలిసింది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి.