కల్కి.. టాక్ ఎలా ఉంది ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసిన కూడా హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Update: 2024-05-09 10:29 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసిన కూడా హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ హీరోల కంటే ఉన్నతంగా ప్రభాస్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. మొదటి రోజే ఊహించని స్థాయిలో రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ లైన్లో పెడుతున్న సినిమాలు కూడా మరింత ఆసక్తికరంగా ఉంటున్నాయి.

తప్పకుండా రాబోయే రోజుల్లో మాత్రం ప్రభాస్ చాలా ఈజీగా 1000 కోట్ల టార్గెట్ ను అందుకుంటాడు అనేలా కామెంట్స్ అయితే వినబడుతున్నాయి. ఇక ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా కల్కి 2898AD. అందరి ఫోకస్ ఈ సినిమా పైనే ఉంది. ఎందుకంటే నిర్మాత అశ్వినీ దత్ గతంలో ఎప్పుడు లేనంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

దర్శకుడు నాగ అశ్విన్ ఒక సరికొత్త ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నాడు. ఇక ఈ సినిమాను మొదట ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలెన్స్ ఉండడంతో మరొక డేట్ ఫిక్స్ చేసుకోలేక తప్పలేదు. ఇక వైజయంతి వారు సెంటిమెంట్ డేట్ ఫిక్స్ చేసుకోవాలని అనుకున్నప్పటికీ ఎలక్షన్స్ కారణంగా మరో ప్లాన్ కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ రోజున (మే 9) కల్కి హడావిడి ఏ తరహాలో ఉండేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈపాటికి సినిమా టాక్ బయటకు వచ్చేది. ఏ మాత్రం పాజిటివ్ గా వచ్చినా కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో టికెట్లు దొరకలేని పరిస్థితి ఏర్పడేది. ఫస్ట్ షోలు చూసిన ఆడియెన్స్ నుంచి హిట్టా ఫ్లాపా అంటూ మిగతా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా అడిగేవారు. ఇక మీమ్స్ ట్రోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థియేటర్ల వద్ద రెబల్ ఫ్యాన్స్ హడావిడి కూడా మంచి వైబ్ లో ఉండేది. తప్పకుండా సమ్మర్ లో ఈ సినిమా ఒకసారి కొత్త సెన్సేషన్ అయితే క్రియేట్ చేసేది.

Read more!

ఇక ఈవినింగ్ కల్లా పాజిటివ్ టాక్ విషయంలో క్లారిటీ వస్తుంది కాబట్టి మేకర్స్ ఎంతో హడావిడిగా సెలబ్రేషన్స్ కూడా మొదలుపెట్టేవారు. టపాకాయలు, కేక్ కట్ చేయడం వంటి అద్భుతమైన మూమెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. పబ్లిక్ టాక్ కూడా ఇంటర్నెట్లో ఒక ట్రెండ్ సెట్ చేసేవి. ప్రభాస్ కల్కి సినిమాలో మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడు అని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ సినిమాలో అమితాబచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే

లాంటి బడా స్టార్స్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. వారి పాత్రలకు సంబంధించిన అంశాలు కూడా సోషల్ మీడియాలో ఈరోజే వైరల్ అయ్యేవి. మొత్తానికి ఈరోజు సినిమా వచ్చి ఉంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద హడావిడి వేరే లెవెల్లో అయితే ఉండేది. మరి ఎలక్షన్స్ తరువాత జూన్ 27న రాబోతున్న కల్కి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News