మొదరాత్రి, డోరతి, బత్త ఈ మూడు సినిమాల సక్సెస్ వెనక సీక్రెట్ ఏంటంటే?
కొన్ని సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తాయి. సినిమా అయిపోయిన తర్వాత కూడా వాళ్లను కొన్ని సన్నివేశాలు వెంటాడుతూనే ఉంటాయి.
కొన్ని సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తాయి. సినిమా అయిపోయిన తర్వాత కూడా వాళ్లను కొన్ని సన్నివేశాలు వెంటాడుతూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మొదరాత్రి, డోరతి, బత్తా మూడు సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి... ఈ మూడు సినిమాల సక్సెస్ వెనకాల దాగి ఉన్న సీక్రెట్స్ ఏంటి? దర్శకులు ఈ కథలను అంత ఎఫెక్టివ్ గా ఎలా చెప్పగలిగారనేది తెలుసుకుందాం...
మొదరాత్రి
పెళ్లి ఇష్టం లేని అమ్మాయి, అబ్బాయి మధ్య పెళ్లి జరగడం అనే పాయింట్ తో కథను బాగా రాసుకున్నారు. పెళ్ళికి వచ్చిన బంధువులు ఎలా ప్రవర్తిస్తారు. ఎవరెవరు ఎలా మాట్లాడుతారనేది దర్శకుడు కండ్లకు కట్టినట్టుగా చూపించాడు. డైరెక్టర్ రాజా కురుప్పు స్వామి తమిళ నాడు లోని తుత్తూకూడి అనే టౌన్ లో పెరిగాడు. అక్కడ ఉండే మనుషుల స్వభావాలను గమనించిన ఆయన ఈ సినిమాను తన సొంత ఊరు బ్యాక్ డ్రాప్ లోనే తీసుకొని ప్రతి ఒక్కరినీ మెప్పించే విధంగా తెరకెక్కించాడు. ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది. ఒక్కరోజులో పెళ్లి జరిగిన ఇంట్లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వాళ్ల మధ్య ఉండే గొడవలు, అలకలు అన్ని పెర్ఫెక్ట్ గా చూపించాడు. ఒక రకంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి తను చూసిన పరిస్థితుల నుంచి కథ రాసుకున్నాడు కాబట్టి అన్ని పర్ఫెక్ట్ గా రాసుకున్నాడు. వాటిని స్క్రీన్ మీద బాగా డీల్ చేశాడు.
డోరతి
తమిళ్ ఇండస్ట్రీ లో ఉన్న అతి తక్కువ మంది గొప్ప ఫిలిం మేకర్స్ లో కార్తీక్ సుబ్బరాజు ఒకరు. రీసెంట్ గా ఆయన చేసిన డోరతి మూవీ కథతో పాటు మేకింగ్ లో మ్యాజిక్ ను క్రియేట్ చేసింది. నిజానికి కార్తీక్ సుబ్బరాజు మదురై లో పుట్టి పెరిగాడు. ఈ మూవీ కూడా అక్కడే జరుగుతుంది. 1980 లో ఉండే మదురై ను చాలా చక్కగా చూపించాడు. అక్కడి మనుషులు ఎలా ఉంటారు. వాళ్ల మధ్య ఉండే వివక్షలను సైతం బాగా చూపించారు. అప్పట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదో, మేల్ ఈగో ఏ రేంజ్ లో ఉంటుందో ఆయన చూశాడట. దాంతో ఈ సినిమాలో వాటిని చూపించాడు. అలాగే ఆడవాళ్లు పడే బాధ మగాళ్ళకి ఎప్పటికీ తెలియదనే ఉద్దేశ్యంతోనే సుబ్బు క్యారెక్టర్ ను మగాడు గా చూపించి ఆ తర్వాత అమ్మాయి లాగా కన్వర్ట్ చేసి అతని చేత ఆడవాళ్ళ బాధను చెప్పించే ప్రయత్నం చేశాడు.
బత్త
విజయ్ సేతుపతి మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ మూవీ ప్రతి ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేసింది. ఒక పిల్లాడు చేసిన పని వల్ల ఒక రౌడీ జీవితం ఎలా మారిపోయిందనేది చాలా బాగా చూపించారు. నిజానికి డైరెక్టర్ బాలాజీ తను స్కూల్ లో ఉన్నప్పుడు ఒక సర్ ను టాయిలెట్ లో పెట్టి బయటి నుంచి గడియ పెట్టారట. దాని వల్ల అక్కడ ఎలాంటి ఇబ్బందులు జరిగియనేది సినిమాగా చెప్పాడు. నిజ జీవితపు సంఘటనల ఆధారంగా మూవీ తీశారు. ఈ మూవీలో పెద్దగా భారీ లోకేషన్స్ కూడా ఏమి ఉండవు. ఫస్టాఫ్ లో ఎక్కువ సమయం టాయిలెట్ లోనే జరుగుతుంది. విజయ్ సేతుపతి టాయిలెట్ కి ఎందుకు వెళ్ళాడు అనే స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నారు. సమాజం హేళన చేయడం వల్ల ఒక వ్యక్తి ఎలా రౌడీ గా మారాడనేది కూడా చాలా బాగా చూపించారు.
ఈ మూడు సినిమాలను మనం అబ్జర్వ్ చేస్తే డైరెక్టర్లు వాళ్ళు పెరిగిన పరిస్థితులు వాళ్ల ఊరు లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాలను తీశారు. కాబట్టి యూనిక్ స్టైల్ లో ఈ సినిమాలను ప్రజెంట్ చేశారు. ఫాంటసీ కథల కంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన కథలు కాబట్టి ఈ సినిమాలు ఎమోషనల్ గా చాలా మందికి కనెక్ట్ అయ్యాయి.