• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప‌ర్స్ ఖాళీ అవ్వ‌కుండా...

ప‌ర్స్ ఖాళీ అవ్వ‌కుండా 'కల్కి 2898 AD' చూడ‌ట‌మెలా?

| నేటి నుండి 'కల్కి 2898 AD' టిక్కెట్లు కేవలం రూ. భారతదేశం అంతటా సినిమా థియేటర్లలో రూ.100కే (పన్నులు మినహాయించి) అందుబాటులోకి వ‌చ్చింది.

By - Tupaki Desk
Update: 2024-08-02 05:06 GMT

కల్కి 2898 AD చిత్రం 27 జూన్ 2024న విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనాత్మక వ‌సూళ్ల‌తో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అమెరికా లాంటి చోట్ల నెవ్వ‌ర్ బిఫోర్ క‌లెక్ష‌న్ల‌తో ఔరా! అనిపించింది. ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి సమీక్షలను సంపాదించిన ఈ చిత్రం సీక్వెల్ గురించి ఆస‌క్తిగా వేచి చూసేలా చేసింది. క‌ల్కి ఇప్పటి వరకు 1100 కోట్లు వ‌సూలు చేసింది. ఇంకా థియేట‌ర్లలో విజ‌య‌వంతంగా న‌డుస్తోంది.

 

ఈ చిత్రం థియేటర్లలో ఆరవ వారంలోకి ప్రవేశించడంతో మేకర్స్ 'పాకెట్ ప‌ర్స్ ఫ్రెండ్లీ టికెట్' ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. నేటి నుండి 'కల్కి 2898 AD' టిక్కెట్లు కేవలం రూ. భారతదేశం అంతటా సినిమా థియేటర్లలో రూ.100కే (పన్నులు మినహాయించి) అందుబాటులోకి వ‌చ్చింది. వారం పాటు ఇదే టికెట్ రేటు కొన‌సాగ‌నుంది. ఈ నిర్ణ‌యం థియేట‌ర్ల‌కు ప్ర‌జ‌ల్ని మ‌రింత‌గా ర‌ప్పిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ సైన్స్-ఫిక్షన్ సినిమా దృశ్యాలను తిరిగి థియేట‌ర్ల‌లోనే ఆస్వాధించేందుకు సినీప్రియుట‌కు ఇది స‌ద‌వ‌కాశం.

టికెట్ ధ‌ర అందుబాటులో ఉంటే కుటుంబాలు కలిసి సినిమాను ఆస్వాధించడానికి సరైన అవకాశం ద‌క్కిన‌ట్టు. ఈ ప్రత్యేక ధర ఆగస్టు 9 వరకు అందుబాటులో ఉంటుంది. క‌ల్కి చిత్రంలో ప్ర‌భాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, శోభన త‌దిత‌రులు న‌టించారు. ప్ర‌భాస్, అమితాబ్ బ‌చ్చ‌న్, దీపిక ప‌దుకొనే పాత్ర‌లు, క‌మ‌ల్ హాస‌న్ పాత్ర‌ సినిమాకి ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. వైజయంతీ మూవీస్ భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

Tags:    
  • Kalki2898AD 
  • Prabhas 
  • Movieticket 
  • Nagashwin 
  • Vyjayanthimovies 
  • Amitabhbachchan 
  • Deepikapadukone 
  • Dishapatani 
  • Kalki 
  • Pocketpursefriendlyticket 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS