డోంట్ వర్రీ.. కొత్త రిలీజ్ డేట్ కూడా సేఫే!

అయితే కల్కి సినిమాను జూన్ 27వ తేదీన రిలీజ్ చేస్తామని రీసెంట్ గా మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-04-28 23:30 GMT

కల్కి .. కల్కి.. కల్కి.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా కోసమే చర్చ జరుగుతోంది. నాగ్ అశ్విన్ అద్భుతమైన క్రియేషన్ ను చూసేందుకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని, కనీవినీ ఎరుగని వీఎఫ్ ఎక్స్ ఆడియన్స్ ను అలరించనుందని వార్తలు వస్తున్నాయి. మొత్తంగా అంతా జూన్ 27వ తేదీ కోసం ఈగర్లీ వెయింటింగ్.

అయితే కల్కి సినిమాను జూన్ 27వ తేదీన రిలీజ్ చేస్తామని రీసెంట్ గా మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అంతకు రెండు రోజుల ముందు నుంచే ఈ సినిమా కొత్త విడుదల తేదీ అదేనని సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. మేకర్స్ కూడా అదే డేట్ ను అనౌన్స్ చేశారు. అయితే ఈ ప్రకటన చేయడానికి మేకర్స్ చాలా రోజులుగా తర్జనభర్జన పడ్డారు. సినీ పండితులు, డిస్ట్రిబ్యూటర్లతో అనేక సార్లు సంప్రదింపులు జరిపారు.

లక్కీ డేట్ ను కొన్ని కారణాల వల్ల వదిలేస్తున్నా.. మే 30న రిలీజ్ చేయాలని డిస్ట్రిబ్యూటర్లు సలహా ఇచ్చారట. కానీ ప్రమోషన్స్ కు టైమ్ సరిపోదని భావించి ఆ తేదీని మేకర్స్ రిజెక్ట్ చేశారని టాక్. ఆ తర్వాత జూన్ రెండో వారంలో విడుదల చేయాలని అనుకోగా.. అప్పుడు కమల్ హాసన్ ఇండియన్-2 రిలీజ్ కానుంది. కల్కిలో కూడా ఆయన నటించడంతో, రెండు సినిమాల మధ్య గ్యాప్ అవసరం కనుక ఆ డేట్ వైపు మేకర్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు.

చివరకు జూన్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. కానీ ఇప్పుడు ఈ డేట్ పై కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అప్పటికే విద్యార్థులకు సెలవులు పూర్తై స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అవుతాయి. దీని ప్రభావం వసూళ్లపై పడుతుందని తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే హాలీడేస్ విషయంలో ఎలాంటి టెన్షన్ అక్కర్లేదని మరి కొందరు చెబుతున్నారు. పాజిటివ్ టాక్ వస్తే చాలు.. మూవీ వంద శాతం దూసుకెళ్లడం పక్కా అంటున్నారు.

టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా మూవీ రాలేదని, కాబట్టి పర్లేదని చెబుతున్నారు. బాహుబలి సినిమా విడుదలను కొందరు గుర్తు చేస్తున్నారు. జులై 10వ తేదీన ఆ సినిమా రిలీజ్ అయినా.. ఎలాంటి రికార్డులు సృష్టించిందో తెలుసు కదా అని అంటున్నారు. ఇప్పుడు కల్కి కూడా సేఫ్ డేట్ కే వస్తుందని, ఆ విషయంలో టెన్షన్ వద్దని చెబుతున్నారు. మరి ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News