కల్కి.. ఇంకా గట్టిగా ఉండాలమ్మా..

ప్రమోషన్ల విషయంలో జాగ్రత్తలు వహించాలని మేకర్స్ కు పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు. మూవీపై అంచనాలు పెరిగేలా ఉండాలని, తగ్గేలా కాదని చెబుతున్నారు.

Update: 2024-05-01 07:08 GMT

పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 ఏడీ. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, స్టార్ హీరో ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి స్టార్స్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు నాగ్ అశ్విన్. 6 వేల ఏళ్ల నాటి స్టోరీ కోసం కొత్త ప్రపంచాన్నే క్రియేట్ చేసినట్లు ఇటీవల ఆయన చెప్పడంతో అంచనాలు పెరిగిపోయాయి.

అయితే ఈ సినిమా మేకింగ్ తోపాటు ప్రమోషన్స్ కూడా వేరే లెవల్ లో నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. జులై 27వ తేదీన ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. రిలీజ్ డేట్ కోసం కొన్ని రోజులుగా అంతా చర్చ జరుగుతున్నా.. వాటికి రెస్పాండ్ అవ్వకుండా అమితాబ్ గ్లింప్స్ ను విడుదల చేశారు.

గ్లింప్స్ ద్వారా కల్కి సినిమాలో అశ్వత్థామ పాత్రలో అమితాబ్ కనిపించనున్నారని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఐపీఎల్ టైమ్ లో స్టార్ స్పోర్ట్స్ ద్వారా ఈ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఇండియా వైడ్ గా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్న రాత్రి ప్రభాస్ తో ప్లాన్ చేసిన చిన్న వీడియోను మ్యాచ్ మధ్య యాడ్ గా రివీల్ చేశారు. మే 3వ తేదీన ముంబై ఇండియన్స్, కేకేఆర్ జట్ల మ్యాచ్ జరగనుందని, ఇది కూడా ఓ యుద్ధం లాంటిదే అని భైరవ గెటప్ లో చెప్పారు ప్రభాస్.

Read more!

అయితే ఈ గ్లింప్స్ కు అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ప్రభాస్ లుక్ చాలా ఓల్డ్ గా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ప్రభాస్ హిందీ డబ్బింగ్ పెద్దగా బాలేదని అంటున్నారు. గ్లింప్స్ చూశాక కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ప్రమోషన్ల విషయంలో జాగ్రత్తలు వహించాలని మేకర్స్ కు పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు. మూవీపై అంచనాలు పెరిగేలా ఉండాలని, తగ్గేలా కాదని చెబుతున్నారు.

హిందీ డబ్బింగ్ విషయంలో నాగ్ అశ్విన్ శ్రద్ధ వహించాలని అంటున్నారు. సలార్‌ లో లాగా కల్కి హిందీ వెర్షన్ కు గాను ప్రభాస్ వాయిస్‌ కు శరద్ కేల్కర్ తో డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇక త్వరలో సినిమాలోని మిగతా పాత్రలను వివిధ రూపాల్లో ఆడియన్స్ కు మేకర్స్ పరిచయం చేయనున్నారని టాక్ నడుస్తోంది. దీంతో ప్రమోషన్స్ ఇంకా సాలిడ్ గా చేయాలని చెబుతున్నారు నెటిజన్లు. మరి ఎలాంటి మేకర్స్ డిసిషన్ తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News