కల్కి2లో టాలెంటెడ్ హీరో క్యామియో?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ఆఖరిగా వచ్చిన సినిమా కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తో పాటూ భారీ కలెక్షన్లను కూడా అందుకుంది.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ఆఖరిగా వచ్చిన సినిమా కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తో పాటూ భారీ కలెక్షన్లను కూడా అందుకుంది. కల్కి 2898ఏడీ సినిమాలో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేసిన నాగి, సీక్వెల్ లో అసలు కథలోకి దిగనున్నారు. ఇంకా చెప్పాలంటే అసలు కథంతా రాబోయే సినిమాలోనే ఉండనుంది.
కల్కి2 నుంచి తప్పుకున్న దీపికా
ఈ నేపథ్యంలోనే కల్కి2 ఎప్పుడెప్పుడొస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ లైనప్ లో ఉన్న క్రేజీ సినిమాల్లో కల్కి2 కూడా ఒకటి. ఆల్రెడీ కల్కి2 స్క్రిప్ట్ రెడీ అవడంతో ప్రభాస్ రావడమే లేటు షూటింగ్ కు వెళ్దామని అన్నీ రెడీ చేసుకుంటున్న టైమ్ లో ఈ ప్రాజెక్టు నుంచి సినిమాలో కీలక పాత్రలో నటించిన దీపికా పదుకొణె తప్పుకున్నారు.
కల్కిలో పలు క్యామియోలు
దీంతో దీపికా పాత్రలో ఎవరిని తీసుకోవాలా అని చిత్ర యూనిట్ ఆలోచనలో పడటంతో కల్కి2 అనుకున్న దానికంటే ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. కల్కి మూవీలో పలువురు గెస్ట్ రోల్స్ లో కనిపించి సినిమాపై మరింత క్రేజ్ పెంచిన సంగతి తెలిసిందే. మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, ఫరియా అబ్దుల్లా కల్కి మూవీలో క్యామియోలు చేసి ఆకట్టుకోగా ఇప్పుడు కల్కి2లో కూడా అలాంటి కొన్ని క్యామియోలను ప్లాన్ చేస్తున్నారట నాగ్ అశ్విన్.
కల్కి2లో నవీన్ పోలిశెట్టి క్యామియో
అందులో భాగంగానే టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి కల్కి2 నటించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కల్కి2లో ఓ చిన్న రోల్ కోసం నాగ్ అశ్విన్, నవీన్ ను తీసుకోవాలని డిస్కషన్స్ చేస్తున్నారని అంటున్నారు. సినిమాలో ఉండే ఓ ప్రభావవంతమైన పాత్ర కోసం నవీన్ ను తీసుకోవాలని నాగి భావిస్తున్నారట. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే కొన్నాళ్ల కిందట నేచురల్ స్టార్ నాని కూడా కల్కి2 లో గెస్ట్ రోల్ చేస్తారని వార్తొలచ్చాయి. కానీ నాని మాత్రం ఆ వార్తలను ఖండించారు.
అయితే కల్కి2లో నవీన్ పోలిశెట్టి గెస్ట్ రోల్ చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి కొందరు అసలు ఈ గెస్ట్ రోల్స్ వల్ల ఏం ఉపయోగం? గెస్ట్ రోల్స్ పై కాకుండా ముందు ఫోకస్ చేయండని కామెంట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం కల్కిలానే ఈ సినిమా కోసం కూడా నాగి పలువురు సెల్రబిటీలను రంగంలోకి దింపనున్నారేమో అని భావిస్తున్నారు. ఇక నవీన్ కెరీర్ విషయానికొస్తే ఈ హీరో నటిస్తున్న అనగనగా ఒక రాజు మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.