కలియుగం 2064లో ఇలా ఉంటుందా..?

నేషనల్ వైడ్ గా సినిమాలకు పెరిగిన స్కోప్.. ఇంకా బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అనే డేర్ నెస్ వల్ల కొన్ని అద్భుతమైన కథలు తెర మీద చూడగలుగుతున్నాం.;

Update: 2025-04-25 16:57 GMT

నేషనల్ వైడ్ గా సినిమాలకు పెరిగిన స్కోప్.. ఇంకా బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అనే డేర్ నెస్ వల్ల కొన్ని అద్భుతమైన కథలు తెర మీద చూడగలుగుతున్నాం. అఫ్కోర్స్ దాన్ని ఎవరు మొదలు పెట్టారు అన్న దాని కన్నా దర్శకులంతా ఆ మూమెంట్ ని కొనసాగించడం అన్నది గొప్ప విషయం. ముఖ్యంగా కల్కి 2898 ఏడి లాంటి సినిమా ఒకటి వస్తుందని.. అది తెర మీద అద్భుతాలు చూపిస్తుందని ఎవరు ఊహించి ఉండరు.

నాగ్ అశ్విన్ తన క్రియేటివిటీతో 2898 AD అంటూ ఒక అద్భుతాన్ని చూపించాడు. కల్కి సినిమా తర్వాత అలాంటి ప్రయత్నాలు చాలా వస్తున్నాయి. ఈ క్రమంలో కన్నడ పరిశ్రమ నుంచి వస్తున్న సినిమా కలియుగం 2064. నాగ్ అశ్విన్ ఎప్పుడో 2898 AD గా చూపిస్తే దర్శకుడు ప్రమోద్ సుందర్ మాత్రం కలియుగం 2064 లోనే కాలం ఎలా మారుతుందో చూపించాడు.

కలియుగం 2064 ట్రైలర్ చూస్తే ఇది కల్కి కి కాస్త దగ్గరగా ఉందని అనిపిస్తున్నా ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందనిపిస్తుంది. కలియుగం 2064 సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. ట్రైలర్ లో ప్రజలు తినడానికి ఏమి దొరక్క ఇబ్బంది పడటం చూపిస్తూ మిగతా అంతా కూడా కల్కి ఫార్మాట్ లోనే ప్లాన్ చేశారు.

కలియుగం సినిమాను ఆర్కె ఇంటర్నేషనల్ ఇంక్. ప్రైమ్ సినిమాస్ నిర్మిస్తున్నారు. ట్రైలర్ తో సంథింగ్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన ఈ సినిమాను మే 9న రిలీజ్ లాక్ చేశారు. ఈమధ్య శ్రద్ధ శ్రీనాథ్ తెలుగులో వరుస సినిమాలు చేసింది. వెంకటేష్ తో సైంధవ్ సినిమా చేసిన అమ్మడు విశ్వక్ సేన్ తో మెకానిక్ రాకీ చేసింది. ఇక ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమా తో కూడా అలరించింది. మరి ఈ కలియుగం అమ్మడికి కలిసి వస్తుందా లేదా అన్నది చూడాలి.

ఈమధ్య ఆడియన్స్ కూడా కొత్త కథ అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి అంటే సినిమాలు చూసేస్తున్నారు. తప్పకుండా ఈ కలియుగానికి అది కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. ఐతే కలియుగం 2064 ట్రైలర్ చూడగానే ఎక్కువమంది ప్రభాస్ కల్కితో పోల్చడం కామనే. ఐతే అందులో లాగా 3 ప్రాంతాలు లేవు కానీ కలియుగం కొత్త ఎక్స్ పెరిమెంట్ గా అనిపిస్తుంది.

Full View
Tags:    

Similar News