ఇంగ్లీష్ టైటిల్స్ ప్రాబ్లమా.. కంటెంటా?
టాలీవుడ్‌లో ఇంగ్లీష్ టైటిల్స్ అనేది ట్రెండ్ అనేది కొన్నేళ్ల క్రితం కింగ్ నాగార్జున - వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన `సూపర్` మూవీతో మొదలైంది.;
టాలీవుడ్‌లో ఇంగ్లీష్ టైటిల్స్ అనేది ట్రెండ్ అనేది కొన్నేళ్ల క్రితం కింగ్ నాగార్జున - వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన `సూపర్` మూవీతో మొదలైంది. ఆ ట్రెండ్‌ని స్టైల్, నోట్‌బుక్, ఓ మై ఫ్రెండ్, 100%లవ్, జెంటిల్‌మెన్, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్, జక్కన్న పాన్ ఇండియా మూవీ `ఆర్ఆర్ఆర్` వరకు ఫాలో అయ్యారు. ఇప్పటికీ కంటెంట్‌ని బట్టి, డిమాండ్ మేరకు ఇంగ్లీష్ టైటిల్స్‌నే వాడేస్తున్నారు. అయితే ఈ మధ్య ఇంగ్లీష్ టైటిల్స్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాల్ని అందుకోలేకపోయాయి.
దీంతో ఇంగ్లీష్ టైటిల్స్‌పై ఓ ఆసక్తికరమై చర్చ నెట్టింట మొదలైంది. భారీ సెట్టింగుల డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గుణశేఖర్ రీసెంట్‌గా చేసిన మూవీ `యుఫోరియా`. జూబ్లీహిల్స్ పబ్ నేపథ్యంలో జరిగిన యదార్థ సంఘటనల నేపథ్యంలో నేటి జెన్‌జీ తప్పుదారి పడుతున్న తీరుని ప్రశ్నిస్తూ ఓ సంచలన కథతో దీన్ని రూపొందించారు. భూమిక, `ధురంధర్` బ్యూటీ సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇదే తరహాలో ఇంగ్లీష్ టైటిల్‌తో వచ్చిన మూవీ `ఫంకీ`.
మాస్‌కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా అనుదీప్ కెవి రూపొందించిన ఈ మూవీ ఫిబ్రవరి 13న విడుదలై ఫస్ట్ డే, ఫస్ట్ షోకే డివైడ్ టాక్‌ని పక్కాగా చెప్పాలంటే ఫ్లాప్ టాక్‌ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. ఇక సంతోష్ శోభన్ హీరోగా నటించిన `కపుల్ ఫ్రెండ్లీ` ఫిబ్రవరి 14న విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకున్నా కానీ ఆశించి స్థాయిలో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించలేకపోతోంది. దీంతో థియేటర్లకు ఎక్కువ ఫుట్ ఫాల్స్ కావడం లేదు. గత ఏడాది విడుదలైన సూపర్ హిట్ సినిమాల పరిశీలిస్తే అసలు ప్రాబ్లం ఇంగ్లీష్ టైటిల్‌లో ఉందా? లేక కంటెంట్‌లో ఉందా? అన్నది క్లారిటీ వస్తుంది.
గత ఏడాది ఇంగ్లీష్ టైటిల్స్‌తో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టిన సినిమాలున్నాయి. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, కోర్ట్, మ్యాడ్ స్క్వేర్, కె ర్యాంప్, పవన్‌కల్యాణ్ నటించిన ఓజీ, నేచురల్ స్టార్ నాని నటించిన `హిట్ 3` ఇవన్నీ ఇంగ్లీష్ టైలిల్స్‌తో రూపొందిన సినిమాలే కానీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో అదరగొట్టాయి. నిర్మాతలకు భారీ లాభాల్ని తెచ్చి పెట్టాయి. ఈ సినిమాలు సాథించిన విజయాల్ని బట్టి ఇక్కడ ఇంగ్లీష్ టైటిల్ అన్నది సమస్య కాదని, సరైన కంటెంట్ ఉంటే టైటిల్ ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరని స్పష్టమైంది.
అంటే సినిమాకు టైటిల్ ఎలా ఉన్నా బలమైన కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు దానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ విషయాన్ని పక్కన పెట్టి ఇంగ్లీష్ టైటిల్ ఉంది కాబట్లే రీసెంట్‌గా విడుదలైన సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతున్నాయన్నది అర్థం లేని వాదనే అవుతుంది. ఇప్పటికైనా కంటెంట్‌కి ప్రాధాన్యతనిచ్చి డైరెక్టర్లు, నిర్మాతలు సినిమాలు చేస్తారని ఆశిద్దాం.