• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కాజల్ కి ఆఫర్లు రాకుండా...

కాజల్ కి ఆఫర్లు రాకుండా చేస్తుంది ఎవరు..?

| పెళ్లైన హీరోయిన్స్ కి అవకాశాలు తక్కువ అన్నది ఒకప్పటి మాట. ఈమధ్య ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కొందరు భామలు అదరగొట్టేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-01-16 03:00 GMT

పెళ్లైన హీరోయిన్స్ కి అవకాశాలు తక్కువ అన్నది ఒకప్పటి మాట. ఈమధ్య ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కొందరు భామలు అదరగొట్టేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో దీపికా పదుకొనె, అలియా భట్ లాంటి వారు పెళ్లైనా సరే సినిమాల అవకాశాల్లో తగ్గట్లేదు. వారి సక్సెస్ రేటు కూడా అదే రేంజ్ లో ఉంది. అయితే సౌత్ సినిమాలకు వస్తే అది కాస్త తక్కువ అని చెప్పొచ్చు. పెళ్లై పిల్లలు ఉన్న భామలు సినిమాలు చేసినా వారికి తగిన క్రేజ్ కొనసాగే ఛాన్స్ లేదు. దానికి బెస్ట్ ఎక్సాంపుల్ కాజల్ అగర్వాల్ పెళ్లి ముందు వరకు తెలుగులో ఆమె టాప్ హీరోయిన్ గా కొనసాగింది.


గౌతం కిచ్లుతో పెళ్లి.. ఆ వెంటనే బాబు పుట్టడంతో రెండేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఈ లోగా కొత్త హీరోయిన్స్ రావడంతో కాజల్ ప్రిఫరెన్స్ తగ్గింది. ఆచార్య సినిమాలో ఆమె ఉన్నా సరే ఎడిటింగ్ రూం లో ఆమె పాత్ర కట్ చేశారంటే కాజల్ గ్రాఫ్ ఎంత పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఆఫ్టర్ మ్యారేజ్ మంచు విష్ణుతో మోసగాళ్లు చేయగా అది కాస్త నిరాశ పరచింది. లాస్ట్ ఇయర్ బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా చేసిన కాజల్ ఆ సినిమాతో హిట్ అందుకుంది.

అయితే భగవంత్ కేసరిలో కాజల్ పాత్ర అంత గొప్పగా ఏమి లేదు. పెళ్లి తర్వాత తన లుక్ చాలా మారిపోయింది. అయితే ప్రస్తుతం తెలుగులో సత్యభామ, హిందీలో ఉమ, తమిళంలో ఇండియన్ 2 సినిమాలతో వస్తుంది కాజల్. ఈ సినిమాలతో ఆమె మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తుంది. తెలుగు మేకర్స్ కాజల్ కి కావాలనే అవకాశాలు ఇవ్వట్లేదా అన్న డౌట్ వస్తున్నా కాజల్ లుక్ చూసి ఆమె కమర్షియల్ సినిమాలకు కష్టమే అని భావిస్తున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ లేదా బలమైన పాత్రలకు ఆమె ఓకే అంటున్నారు కానీ గ్లామర్ రోల్స్ కి కాజల్ ఇక నాట్ ఓకే అని అంటున్నారు.

కాజల్ సైడ్ నుంచి కూడా అదే మాట వినిపిస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఇక గ్లామర్ రోల్స్ కాకుండా కథాబలం ఉన్న సినిమాలను చేయాలని అనుకుంటుంది అమ్మడు. అందుకే సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తుంది. తెలుగులో ప్రస్తుతం కాజల్ చేస్తున్న సత్యభామ ఆమెకు కచ్చితంగా కొత్త ఇమేజ్ ని తెచ్చే అవకాశం ఉంది. టీజర్ తోనే సత్యభామ పై బజ్ ఏర్పడగా సినిమాతో కాజల్ మారోసారి తన సత్తా చాటుతుందని అంటున్నారు.

Tags:    
  • Kajal 
  • Actresskajal 
  • Bhagawantkesari 
  • Balksrishna 
  • India2 
  • Satyabama 
  • Tollywood 
  • Goutham 
  • Marriage 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS