• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్ట్రీమింగ్ కి సిద్ధమైన...

స్ట్రీమింగ్ కి సిద్ధమైన ది: ట్రయల్ సీజన్ 2.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే?

| బాలీవుడ్ బ్యూటీ కాజోల్ పదహారేళ్లకే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తన అందం, అభినయంతో, నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.

By - Madhu Reddy
Update: 2025-08-07 07:43 GMT

బాలీవుడ్ బ్యూటీ కాజోల్ పదహారేళ్లకే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తన అందం, అభినయంతో, నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్లో షారుక్ ఖాన్ తో కలిసి పలు చిత్రాలు చేసింది. అంతేకాదు కాజోల్ - షారుక్ ఖాన్ జంట బెస్ట్ హిట్ పెయిర్ గా కూడా గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో కూడా వరుస సినిమాలు, సీరీస్ లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న కాజోల్ ఇప్పుడు మరో సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాజోల్ నటించిన 'ది ట్రయల్' 2వ సీజన్ త్వరలోనే జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే 'ది ట్రయల్' పేరుతో వచ్చిన ఫస్ట్ సీజన్ లో కాజోల్ నొయోనికా సేన్ గుప్తా అనే లాయర్ పాత్రలో అలరించింది. అయితే మొదటి సీజన్ అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ సీజన్ 2 పై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. మరి ది ట్రయల్ సీజన్-2 వెబ్ సిరీస్ ఎప్పటినుండి జియో హాట్ స్టార్ లో అందుబాటులోకి రాబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన 'ది ట్రయల్ సీజన్ 1' కి కొనసాగింపుగా 'ది ట్రయల్:ప్యార్ కానూన్ దోఖా సీజన్ 2' త్వరలోనే జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే 'ది ట్రయల్' వెబ్ సిరీస్ ను 'ది గుడ్ వైఫ్' అనే అమెరికన్ వెబ్ సిరీస్ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో హౌస్ వైఫ్ గా ఉన్న కాజోల్ తన భర్త సమస్యల్లో ఇరుక్కుపోయినప్పుడు న్యాయవాదిగా మారి ఎలా తన భర్తని బయటకు తీసుకువస్తుంది అనేది చూపించారు.

అయితే ది ట్రయల్ సీజన్ -2 లో మాత్రం కాజోల్ పాత్ర మరింత బలంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

ది ట్రయల్ 2 సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా.. కాజోల్ "కోర్టు గది అనేది యుద్ధ భూములలో ఒకటి" అంటూ పోస్ట్ పెట్టి ది ట్రయల్ సీజన్ -2 పై భారీ అంచనాలు పెంచేసింది. ది ట్రయల్ సీజన్ 2 సిరీస్ సెప్టెంబర్ 19 నుండి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. సీజన్ 2 లో కాజోల్ వ్యక్తిగత జీవితంలో మరిన్ని సవాళ్లను ఎదుర్కొవడాన్ని చూపిస్తారని తెలుస్తోంది.ఈ వెబ్ సిరీస్ లో అలీ ఖాన్, కరణ్ వీర్ శర్మ, గౌరవ్ పాండే, సోనాలి కులకర్ణి, జిషు సేన్ గుప్తా, కోబ్రా సైట్, షీబా చద్దా తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉన్న ఈ సీజన్ 2 సిరీస్ ని ఉమేష్ బిస్ట్ దర్శకత్వం వహించగా.. బనిజయ్ ఆసియా నిర్మించారు.

Tags:    
  • Kajol 
  • TheTrialSeason2 
  • HotstarSeries 
  • LegalDrama 
  • TheGoodWifeAdaptation 
  • కాజోల్ 
  • ది_ట్రయల్_సీజన్2 
  • హాట్‌స్టార్ 
  • లీగల్‌డ్రామా 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS