• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హిట్ వచ్చిన కాజల్ కి యూజ్...

హిట్ వచ్చిన కాజల్ కి యూజ్ కాలేదు

| మూవీ మొత్తం చూసుకుంటే కాజల్ అగర్వాల్ గట్టిగా నాలుగు, ఐదు సన్నివేశాలకి మాత్రమే పరిమితం అయ్యింది.

By - Tupaki Desk
Update: 2023-10-21 14:30 GMT

స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియాలో సుదీర్ఘ కాలం పూర్తి చేసుకున్న అందాల భామ కాజల్ అగర్వాల్. ఈ అమ్మడు స్టార్ హీరోలు అందరితో కూడా సుమారు నటించింది అని చెప్పొచ్చు. అలాగే తెలుగు, తమిళ్ తో పాటు హిందీ భాషలో కూడా చాలా మూవీస్ చేసింది. ప్రస్తుతం పెళ్లి చేసుకున్న ఈ అందాల భామకి కొడుకు కూడా ఉన్నాడు. అయిన ఈ బ్యూటీ నటిగా తన కెరియర్ ని కొనసాగిస్తోంది.

అయితే ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ కేటగిరీలో చేరిపోయిన కాజల్ అగర్వాల్ కి సీనియర్ హీరోలకి జోడీగానే అవకాశాలు వస్తున్నాయి. ఆచార్య మూవీలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ ని పెట్టి కొన్ని సీక్వెన్స్ తెరకెక్కించిన మళ్ళీ ఫైనల్ కాపీలో ఆమె పాత్రని పూర్తిగా తొలగించేసారు. ఇప్పుడు భగవంత్ కేసరి చిత్రంలో కాజల్ అగర్వాల్ ని బాలయ్యకి జోడీగా అనిల్ రావిపూడి ఎంపిక చేశారు.

మూవీ మొత్తం చూసుకుంటే కాజల్ అగర్వాల్ గట్టిగా నాలుగు, ఐదు సన్నివేశాలకి మాత్రమే పరిమితం అయ్యింది. అవి కూడా సినిమాకి ఏ విధంగా కూడా ఉపయోగం లేనివని చెప్పాలి. నిజానికి సినిమాలో ఆమె పాత్ర కూడా అంత బలంగా ఏమీ లేదు. అలా అని గ్లామర్ పరంగా కాజల్ అగర్వాల్ పాత్రని వినియోగించుకున్నారా అంటే అది జరగలేదు.

మూవీలో ఆమె పాత్ర కేవలం సపోర్టింగ్ రోల్ తరహాలోనే ఉంది తప్ప హీరోయిన్ స్థాయిలో లేదని చెప్పాలి. నిజానికి కాజల్ అగర్వాల్ గ్లామర్ పరంగా ఇప్పటికి వన్నె తగ్గని అందాలతో మెరిసిపోతోంది. కరెక్ట్ గా ఉపయోగించుకుంటే గ్లామర్ రోల్స్ కోసం ఈమెని మరికొంతకాలం యూజ్ చేసుకోవచ్చు. అవకాశాలు వస్తున్న కూడా చెప్పుకోదగ్గ పాత్రలు పడకపోతే హీరోయిన్ గా నటించి కూడా అనవసరం అవుతుంది.

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పరిస్థితి అదే. ఆమె హీరోయిన్ గా నటించిన కూడా ఏ మాత్రం మూవీ ఆమెకి ప్లస్ కాలేదు. స్టార్ హీరోయిన్ గా ఉన్న ఆమె ఇమేజ్ ని భగవంత్ కేసరి మూవీ మరికొంత క్రిందికి దించింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఇండియన్ 2 మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే సత్యభామ అనే ఫిమేల్ సెంట్రిక్ మూవీ ఒకటి చేస్తోంది. ఈ సినిమాలు ఆమెని ఎంత వరకు నిలబెడతాయో చూడాలి.

Tags:    
  • Kajalaggarwal 
  • Balakrishna 
  • Bhagavantjkesari 
  • Anilravipudi 
  • Indian2 
  • Satyabama 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS