Tupaki Exclusive : 'సత్యభామ' ఇంటర్వ్యూ.. ఆ రిస్క్ చేయక తప్పలేదు..!

సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 15, 16 ఏళ్లుగా సక్సెస్ ఉల్ కెరీర్ కొనసాగిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా ఆమె వరుస సినిమాల్లో నటిస్తున్నారు

Update: 2024-05-23 10:49 GMT

సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 15, 16 ఏళ్లుగా సక్సెస్ ఉల్ కెరీర్ కొనసాగిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా ఆమె వరుస సినిమాల్లో నటిస్తున్నారు. కాజల్ ఫస్ట్ టైం యాక్షన్ అటెంప్ట్ గా చేసిన సినిమా సత్యభామ. శశికిరణ్ తిక్క కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాను సుమన్ చిక్కాల డైరెక్ట్ చేశారు. మే 31న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎక్స్ క్లూజివ్ గా తుపాకి.కామ్ తో స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

యాంకర్ : ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసి ఉంటారు కదా.. ఇన్నేళ్లు మిమ్మల్ని నడిపించింది ఏంటి..? ఆ ఎక్స్ పీరియన్స్ చెప్పండి..?

కాజల్ : డిటర్మినేషన్.. చేసిన సినిమాల నుంచి కో స్టార్స్ నుంచి నేర్చుకోవడం.. సినిమా సినిమాకు కెరీర్ సెట్ చేసుకోవడం. వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెల్లడం.

యాంకర్ : అసలు ఈ సత్య భామ ఎలా మొదలైంది..?

కాజల్ : శశి, సుమన్ వచ్చి నరేట్ చేశారు.. 3 గంటల కథ చెప్పారు. కథ వినగానే బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశా.

Read more!

యాంకర్ : సత్య భామ కథ విన్నప్పుడు ఫస్ట్ రియాక్షన్..?

కాజల్ : చాలా స్టోరీస్ విన్నా.. కథ విన్నాక బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పా. కథలో సత్యభామ ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ ట్రావెల్ అవుతుంది. అందుకే కథ కనెక్ట్ అయ్యింది. నాకు కొత్తగా ఉంటుందని చేశాను. సినిమాలో మదర్ ఫీలింగ్ ఉంటుంది అందుకే ఈ కాంబినేషన్ వల్ల సినిమా ఓకే చేశా. సినిమా కోసం చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను.

యాంకర్ : గూఢచారి తర్వాత సత్యభామ ఎలా సాధ్యమైంది.?

శశికిరణ్ : గూఢచారి కన్నా ముందు అనుకున్న కథ. మంచి బడ్జెట్ లో చేద్దామని అనుకున్నా.. మేజర్ తర్వాత ఈ కథ చేయాలని అనిపించిది చేశాం.

యాంకర్ : కథ అనుకున్నప్పుడు కాజల్ ని అనుకున్నారా..?

శశికిరణ్ : సత్య భామ కథే మొదటి హీరో. ఆ కథకు ఎవరు కావాలో ఆ కథ ఎంచుకుంది. మేము ఈ కథ లో లీడ్ కోసం వెతుకుతున్నాం.. అదే టైం లో కాజల్ గారు మంచి కథ కోసం చూస్తున్నారు. అలా ఈ ప్రాజెక్ట్ లోకి కాజల్ వచ్చారు.

యాంకర్ : కాజల్ సత్యభామగా మారేందుకు ఎలా ప్రిపేర్ అయ్యారు..?

కాజల్ : కథలో ఉన్న ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్ అందులో బాగా చేసేలా ప్రోత్సహించింది. సత్యభామ టీం అంతా నాకు సపోర్ట్ గా నిలిచారు. సినిమా కోసం వర్క్ షాప్ చేశాం.. యాక్షన్ సీన్స్ కోసం బాగా కష్టపడ్డాం. సినిమాలో ప్రతి సీన్ కి దానికి ఒక పర్టిక్యులర్ ఎమోషన్ ఉంటుంది.

4

యాంకర్ : సత్యభామ కోసం ఇదివరకు సినిమాల ఎక్స్ పీరియన్స్..!

కాజల్ : ఇంతకుముందు నేను ఇంత భారీ యాక్షన్ సినిమాలు చేయలేదు. కానీ తన కో స్టార్స్ చేసిన దాని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. అంతేకాదు ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అన్ని నా బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా ఉంటాయి. ఈ సినిమా కోసం 6 తర్వాత కూడా పనిచేశాను.

యాంకర్ : ఈ సినిమాకు డైరెక్షన్ ఎందుకు చేయలేదు..?

శశికిరణ్ : కథ, స్క్రీన్ ప్లే అందించాను.. సునీల్ నాతో రైటింగ్ టీం లో ఉన్నాడు. అందుకే అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాం. అందరం కలిసి సినిమా చేశాం.

యాంకర్ : ఇదే మీ మొదటి యాక్షన్ సినిమా ఇది.. ఏ నమ్మకంతో కొత్త దర్శకుడితో ఇలాంటి ప్రయత్నం చేశారు..?

కాజల్ : డైరెక్టర్ సునీల్ కి సినిమా మీద ఫుల్ ఫోకస్ ఉంది. ఇది ఒక మంచి డ్రామా.. ఎమోషనల్ రైడ్.. కంప్లీట్ మూవీ.

యాంకర్ : డైరెక్టర్ రిఫరెన్స్ ఇచ్చారా..?

కాజల్ : సత్యభామ క్యారెక్టర్ మీటర్ గురించి చెప్పారు. ఆ విషయంలో దర్శకుడు సునీల్, శశి సలహా ఇచ్చారు.

యాంకర్ : సత్యభామ చూడటానికి ప్రేక్షకులను థియేటర్ కి తీసుకొచ్చే యాస్పెక్ట్ ఏంటి..?

కాజల్ : ఎంటర్టైన్మెంట్, గ్రిప్పింగ్ పాస్ట్ ఫేస్డ్ స్టోరీ, ఎమోషన్స్.

యాంకర్ : సత్యభామ కాజల్ కాకుండా ఇందులో యూనిక్ థింగ్ ఏంటి..?

శశి కిరణ్ : ఎమోషనల్.. యాక్షన్ థ్రిల్లర్ లో చాలా రకాలు ఉంటాయి. కానీ ఇందులో ఒక ఎమోషన్ కూడా ఉంటుంది.

యాంకర్ : యాక్షన్ సీన్స్ చూసి నేర్చుకున్న విషయాలు..?

కాజల్ : శ్రీదేవి, విజయ శాంతి, రమ్యకృష్ణ సినిమాలు చూశా. వారు యాక్షన్ లో కూడా అదరగొట్టారు. వారి స్పూర్తితోనే ఈ సినిమా చేశాను.

యాంకర్ : ఫిమేల్ సెంట్రిక్ మూవీ చేయడానికి స్పూర్తి ఏంటి..?

కాజల్ : గ్రీడ్.. ఇంకా ఎక్కువ చేయాలి. కొత్తగా చేయాలనే కోరికతో చేశా.

యాంకర్ : పెళ్లై బాబు పుట్టాక కాజల్ లో ఎలాంటి మార్పు వచ్చింది..?

కాజల్ : సత్యభామలో కొత్త కాజల్ ని చూస్తారు. ఇప్పటివరకు నాకు కూడా తెలియని కొత్తగా నన్ను చూస్తారు. ఇంకా ఇంపాక్ట్ గా ఉంది.. పాత్ర స్ట్రాంగ్ గా ఉన్న కథలే చేయాలని ఉంది.

యాంకర్ : ఓటీటీ లో సమంత, తమన్నా చేస్తున్నారు.. మీరెప్పుడు చేస్తారు..?

కాజల్ : మంచి కథ వస్తే తప్పకుండా చేస్తా.

యాంకర్ : సుమంత్ తో మీ పరిచయం.. రిలేషన్..?

శశి కిరణ్ : సుమంత్ తో 20 ఏళ్లుగా స్నేహం.. కథలన్నీ తెలుసు.. సత్యభామ కథ నాదే అయినా ఇండెప్త్ మొత్తం అతనికి తెలుసు. నెక్స్ట్ స్క్రిప్ట్ కి తనని అడ్వైసర్ గా చేసుకుంటా.

యాంకర్ : కొత్త టాలెంట్ తో పనిచేయడం..?

కాజల్ : ఈ టీం లో బంచ్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్స్ ఉన్నారు. ఒక్కొక్కరు వాళ్లని వాళ్లు ప్రూవ్ చేసుకోవడానికి ఆకలితో ఉన్నారు. సినిమా డిఓపి, మ్యూజిక్ అన్ని బాగా కుదిరాయి.

ఫైనల్ గా కాజల్ నటించిన సత్యభామ ప్రేక్షకుల మనసులు గెలిచి.. మంచి సక్సెస్ అందుకోవాలని ఇంటర్వ్యూ ముగించారు.

Full View
Tags:    

Similar News