పింక్ అవుట్ ఫిట్ లో బుగ్గలు ఎరుపెక్కిన వేళ.. ఈ వయ్యారికి యువత దాసోహం అవదా!

ఈ ఫోటో షూట్‌లో కాజల్ వేసుకున్న అవుట్‌ఫిట్ చాలా స్పెషల్‌గా ఉంది. స్క్వేర్ నెక్ లైన్, షార్ట్ క్యాప్ స్లీవ్స్‌తో ఉన్న ఈ ఫామ్-ఫిట్టింగ్ మినీ డ్రెస్ ఆమె అందాన్ని మరింత ఎలివేట్ చేసింది.

Update: 2026-05-26 18:19 GMT

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ పింక్ డ్రెస్ పిక్స్ ఇప్పుడు నెట్టింట మంటలు రేపుతున్నాయి. ఇప్పుడు అల్ బ్లుష్ ,నో బ్లఫ్ అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పెళ్లయ్యాక సినిమాల స్పీడ్ తగ్గించినా, గ్లామర్ డోస్ మాత్రం అస్సలు తగ్గించలేదు ఈ బ్యూటీ. బ్లష్ పింక్ కలర్ మినీ డ్రెస్‌లో కాజల్ మెరిసిపోతున్న తీరు చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆ విశేషాలు చూద్దాం.

 

చందమామ కొత్త లుక్:

 

కాజల్ అగర్వాల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. పెళ్లి, బాబు పుట్టిన తర్వాత కూడా ఆమె తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ సరికొత్త లుక్స్‌తో సర్‌ప్రైజ్ చేస్తోంది. ఇక ఈ సారి బేబీ పింక్ కలర్ స్టైలిష్ డ్రెస్‌లో దివి నుండి వచ్చిన దేవకన్య లా మెరిసిపోయింది. ఈ డ్రెస్ డిజైన్, ఆమె స్టైలింగ్ చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే.

 

డ్రెస్ స్పెషాలిటీ ఇదే:

 

ఈ ఫోటో షూట్‌లో కాజల్ వేసుకున్న అవుట్‌ఫిట్ చాలా స్పెషల్‌గా ఉంది. స్క్వేర్ నెక్ లైన్, షార్ట్ క్యాప్ స్లీవ్స్‌తో ఉన్న ఈ ఫామ్-ఫిట్టింగ్ మినీ డ్రెస్ ఆమె అందాన్ని మరింత ఎలివేట్ చేసింది. ఇక ముఖ్యంగా డ్రెస్‌కు సైడ్స్‌లో ఉన్న రూచెడ్ డ్రా-స్ట్రింగ్స్ ఈ డ్రెస్‌కు ఒక మోడ్రన్, స్టైలిష్ లుక్‌ని తీసుకొచ్చాయి.

మేకప్ అండ్ యాక్సెసరీస్:

ఈ సాఫ్ట్-గ్లామ్ లుక్ కోసం కాజల్ మేకప్ అండ్ జ్యువెలరీని చాలా సింపుల్‌గా ఉంచుకుంది. కేవలం చిన్న స్టడ్ ఇయర్ రింగ్స్, చేతికి సింపుల్ బ్రాస్‌లెట్ మాత్రమే పెట్టుకుంది.ఇక డ్రెస్‌ కలర్‌కు మ్యాచింగ్‌గా బుగ్గలు ఎరుపెక్కేలా లైట్ పింక్ బ్లష్, న్యూడ్ లిప్‌స్టిక్‌తో క్యూట్ అండ్ హాట్ లుక్‌లో మాయ చేసింది.

మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు:

మీరు కూడా కాజల్ లాంటి రొమాంటిక్, మోడ్రన్ లుక్ ట్రై చేయాలనుకుంటే.. ఇలాంటి స్క్వేర్ నెక్ మినీ డ్రెస్స్‌లను ఎంచుకోవచ్చు. దీనికోసం 'జారా ఇండియా మినీ డ్రెస్' లేదా 'ఎస్‌ఆర్ స్టోర్ అరాయా స్క్వేర్ నెక్ డ్రెస్' లాంటి ఆప్షన్స్ పరిశీలించవచ్చు. ఇక జ్యువెలరీని ఎంత సింపుల్‌గా ఉంచితే లుక్ అంత క్లాసీగా కనిపిస్తుంది.

ఇక వెండితెరపై మెరిసే తారల గ్లామర్ వెనుక ఎన్నో కష్టాలు దాగుంటాయి, ముఖ్యంగా మాతృత్వం తర్వాత తమ పాత రూపానికి తిరిగి రావడం అనేది ఏ నటికైనా పెద్ద సవాలే. కానీ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రసవం తర్వాత ఎటువంటి సర్జరీల జోలికి వెళ్లకుండా, కేవలం పట్టుదల, క్రమశిక్షణతో తన పాత ఫిట్‌నెస్‌ను తిరిగి సాధించి ఎంతో మంది కొత్త తల్లులకు స్ఫూర్తిగా నిలిచింది.

భగవంత్ కేసరి సినిమా తర్వాత కాజల్ తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా, ఇలాంటి ఫోటో షూట్లతో ఫ్యాన్స్‌కు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది. పింక్ డ్రెస్‌లో బుగ్గలు ఎరుపెక్కిన ఈ వయ్యారి చందమామను చూసి యువత దాసోహం అవ్వకుండా ఎలా ఉండగలరు చెప్పండి.

Tags:    

Similar News