10 రోజుల్లో 4 షూట్స్.. కాజల్ అగర్వాల్ గ్లామర్ కు ఫాన్స్ ఫిదా!
గత వారం పది రోజుల్లోనే బ్యాక్ టు బ్యాక్ నాలుగు గ్లామరస్ ఫోటోషూట్స్ షేర్ చేసి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
చందమామ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా స్పీడ్ పెంచేసింది. గత వారం పది రోజుల్లోనే బ్యాక్ టు బ్యాక్ నాలుగు గ్లామరస్ ఫోటోషూట్స్ షేర్ చేసి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. తన నడుము వంపులతో, హాట్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తూ తనకున్న 26 మిలియన్ల ఫాలోవర్స్‌కు ఫుల్ విజువల్ ట్రీట్ ఇస్తోంది. కాజల్‌లో ఈ రేంజ్ గ్లామర్ డోస్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఫిదా అయిపోతున్నారు. జూన్‌లో 41వ వసంతంలోకి అడుగుపెడుతున్నా, ఈమె అందం ఏమాత్రం తగ్గలేదంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఆఫర్ల కోసమే ఈ రేంజ్ గ్లామర్ షోనా?:
కాజల్ అగర్వాల్ ఈ మధ్యకాలంలో వరుసగా ఫోటోషూట్లు వదలడం వెనుక ఒక స్ట్రాటజీ ఉందనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఇక తాను గ్లామర్ రోల్స్ చేయడానికి ఇప్పటికీ రెడీగానే ఉన్నాననే హింట్ ఆమె మేకర్స్‌కు ఇస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక సీనియర్ స్టార్ హీరోల సరసన నటించడానికి తను పర్ఫెక్ట్ ఛాయిస్ అని నిరూపించుకోవడానికే చందమామ ఈ రేంజ్ స్పైసీ లుక్స్‌తో రెచ్చిపోతోందని ఫిలింనగర్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది.
కెరీర్‌ను మలుపు తిప్పిన సీనియర్ హీరోలు:
నిజానికి 2016లోనే కాజల్ కెరీర్ టాలీవుడ్‌లో కాస్త నెమ్మదించింది. ఆ సమయంలో 'జనతా గ్యారేజ్'లో ఐటమ్ సాంగ్, 'బ్రహ్మోత్సవం'లో చిన్న రోల్స్ చేసింది. కానీ, పవన్ కల్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' ఆమెకు బ్రేక్ ఇవ్వగా.. ఆ తర్వాత చిరంజీవి రీఎంట్రీ మూవీ 'ఖైదీ నెంబర్ 150'లో హీరోయిన్ కొరత వల్ల కాజల్‌కు మంచి ఛాన్స్ దక్కింది. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ, స్టార్ హీరోల ప్రాజెక్టులు మాత్రం ఆమెకు పెద్దగా దక్కలేదు. ప్రస్తుతం షాప్ ఓపెనింగ్స్, బ్రాండ్ ప్రమోషన్స్‌తోనే ఆమె ఎక్కువగా బిజీగా ఉంటోంది.
ఓటీటీ రేసులో వెనుకబడిన చందమామ:
సమంత, తమన్నా వంటి సమకాలీన హీరోయిన్లు ఒకవైపు సినిమాలతో పాటు ఓటీటీ వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ ఫుల్ బిజీగా దూసుకుపోతున్నారు. కానీ కాజల్‌కు మాత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నుండి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా NBK111 మాత్రమే ఉంది. ఈ సినిమాతో పాటు మరిన్ని కొత్త ప్రాజెక్టులను అందుకోవాలనే కసి కాజల్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే అని కాజల్ అగర్వాల్ తన లేటెస్ట్ ఫోటోషూట్స్‌తో మరోసారి ప్రూవ్ చేసింది. ఈ రేంజ్ సోషల్ మీడియా ప్రమోషన్స్ మరియు గ్లామర్ ట్రీట్ చూశాకైనా టాలీవుడ్ దర్శకులు, సీనియర్ హీరోలు ఈ చందమామ వైపు చూస్తారేమో వేచి చూడాలి. ఇక ఏదేమైనా NBK111 మూవీతో పాటు మరికొన్ని క్రేజీ ఆఫర్లు కాజల్ ఖాతాలో పడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.