• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  4600 కోట్ల సంప‌ద‌తో...

4600 కోట్ల సంప‌ద‌తో దేశంలోనే రిచ్ హీరోయిన్

| మ‌హిళా న‌టీమ‌ణుల్లో జూహీ చావ్లానే నంబ‌ర్ 1 ఆస్తిప‌రురాలిగా రికార్డుకెక్కింది.

By - Tupaki Desk
Update: 2024-10-22 02:58 GMT

భార‌త‌దేశంలో నంబ‌ర్ వ‌న్ సంపాద‌కుడు ఎవరు? అంటే అదానీ, అంబానీ పేర్లు వినిపిస్తాయి. భార‌త‌దేశంలో అత్యంత సంప‌న్న న‌టి ఎవ‌రు? అంటే వెంట‌నే స‌మాధానం చెప్ప‌లేం. నేటిత‌రంలో క్రేజ్ ఉన్న‌ ట్రెండీ క‌థానాయిక‌లు ఎవ‌రైనా అయి ఉండొచ్చ‌ని భావిస్తాం. భారతదేశపు అత్యంత ధనిక నటి నిక‌ర ఆస్తుల విలువ రూ. 4600 కోట్లు. గ‌త‌ 15 ఏళ్లలో ఒక్క‌ హిట్ సినిమాలో కూడా న‌టించ‌లేదు. కానీ ఆమె ధ‌నికురాలైన న‌టి. అత్యంత గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్థానంలో ఉన్న న‌టి ఆమె. వివ‌రాల్లోకి వెళితే... ఈ సంప‌న్న క‌థానాయిక మ‌రెవ‌రో కాదు..నాటి మేటి క‌థానాయిక‌ జూహీ చావ్లా. ఈ వెట‌ర‌న్ న‌టి మాధురి ధీక్షిత్, క‌రిష్మా క‌పూర్ ల కంటే సీనియ‌ర్. అగ్ర క‌థానాయిక‌గా సినీప‌రిశ్ర‌మ‌ను ఏలారు. హిందీ చిత్ర‌సీమ‌తో పాటు తెలుగు, త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల్లోను జూహీ సుప‌రిచితురాలు. తెలుగు చిత్ర‌సీమ‌లో జూహీ చావ్లా 'విక్కీ దాదా' చిత్రంలో నాగార్జున స‌ర‌స‌న న‌టించారు.

హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ఎడిషన్ జూహీ చావ్లా పేరును రికార్డుల‌కెక్కింది. దేశంలో అత్యంత ధ‌నిక న‌టుడిగా షారూఖ్ నిలిస్తే.. మ‌హిళా న‌టీమ‌ణుల్లో జూహీ చావ్లానే నంబ‌ర్ 1 ఆస్తిప‌రురాలిగా రికార్డుకెక్కింది. షారూఖ్ 7300 కోట్ల ఆస్తుల‌తో నంబ‌ర్-1 స్థానంలో నిల‌వ‌గా, జూహీ చావ్లా 4600 కోట్ల నిక‌ర ఆస్తి విలువ‌తో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.

90ల‌లో హిందీ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నటీమణుల్లో జూహీ చావ్లా ఒకరు. ఖయామత్ సే ఖయామత్ తక్‌తో తెరంగేట్రం చేసిన తర్వాత 90లలో బోల్ రాధా బోల్, డర్, లోఫర్, ఇష్క్ వంటి హిట్ చిత్రాలతో బాక్సాఫీస్‌ను శాసించింది. కానీ 2000 తర్వాత పూర్తిగా నిర్మాత‌గా కొన‌సాగారు. కొన్నిసార్లు సహాయ పాత్ర‌ల్లో క‌నిపించారు. జూహీ చిత్ర నిర్మాణంలో షారుఖ్ భాగస్వామి. మొదట డ్రీమ్స్ అన్‌లిమిటెడ్ .. ఇప్పుడు రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో జూహీ భాగ‌స్వామిగా ఉన్నారు. 2009 నుండి (లక్ బై ఛాన్స్ విడుదలైనప్పుడు) జూహీకి బాక్సాఫీస్ హిట్ లేకపోయినా, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో పెట్టుబడి పెట్టడం .. నైట్ రైడర్స్ క్రికెట్ ఫ్రాంచైజీ సహ-యజమాని కావడం వల్ల జూహీ ఆదాయం ఎన్నో రెట్లు పెరిగింది. ఐశ్వర్య రాయ్ (రూ. 900 కోట్లు), ప్రియాంక చోప్రా (రూ. 850 కోట్లు), అలియా భట్ (రూ. 550 కోట్లు), దీపికా పదుకొనే (రూ. 400 కోట్లు), కత్రినా కైఫ్ (రూ. 240 కోట్లు) వంటి అగ్ర‌శ్రేణి క‌థానాయిక‌ల ఆదాయాల‌న్నిటినీ క‌లిపినా అంత‌కుమించి అని జూహీ నిరూపించింది.

జూహీ చావ్లా ఆదాయ మార్గాలు ప‌రిశీలిస్తే..

రెడ్ చిల్లీస్ గ్రూప్

జూహీ తన సన్నిహిత మిత్రుడు షారూఖ్ ఖాన్‌తో కలిసి రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీకి సహ-వ్యవస్థాపకురాలు. బాలీవుడ్ ప్రధాన నిర్మాణ సంస్థలలో ఇది ఒకటి. కొన్ని విజయవంతమైన చిత్రాలను నిర్మించింది. విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ సేవలు మొదలైన వాటిపై పరిశోధన, అభివృద్ధిలో కూడా కంపెనీ పాల్గొంటుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్

జూహీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌ను న‌డిపిస్తోంది. అందులో కూడా షారూఖ్ తో క‌లిసి ఆమె వాటాదారు. ఫ్రాంచైజ్ అత్యంత విజయవంతమైంది. జనాదరణ పొందింది..నిజానికి చాలా లాభదాయకంగా ఉంది. ఖాన్ తో పాటు జూహీ నికర ఆదాయ‌ విలువ పెర‌గ‌డానికి కేకేఆర్ టీమ్ ప్రధానంగా స‌హాయ‌ప‌డింది.

రియల్ ఎస్టేట్ పెట్టుబడి

సినిమాలు - క్రీడలు కాకుండా జూహీ రియల్ ఎస్టేట్‌లోను భారీ పెట్టుబ‌డులు పెట్టారు. భారతదేశం అంతటా కొన్ని అత్యంత విలువైన ఆస్తులను జూహీ చావ్లా సొంతం చేసుకుంది. ఇది త‌న‌ ఆర్థిక స్థితిని మరింత అభివృద్ధి చేస్తుంది.

మహిళా నటుల మధ్య సంపద పోలిక

జూహీ చావ్లా నికర ఆస్తి విలువ భారతదేశంలోని చాలా మంది ప్రముఖ నటీమణుల సంపదను అధిగమించింది.

జుహీ చావ్లా -రూ.4,600 కోట్లు- $580 మిలియన్

ఐశ్వర్య రాయ్ బచ్చన్ -రూ.850 కోట్లు- $100 మిలియన్

ప్రియాంక చోప్రా- రూ.650 కోట్లు

Tags:    
  • India 
  • Bollywood 
  • Richestheroine 
  • Juhichawla 
  • Actor 
  • Shahrukhkhan 
  • Aishwaryarai 
  • Deepikapadukone 
  • Aliabhatt 
  • Katrinakaif 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS