ఒక సర్జరీ.. డ్రాగన్ రిలీజ్ లెక్కలన్నీ మారిపోయాయా?

జూనియర్ ఎన్టీఆర్‌కు స‌ర్జ‌రీ జరిగిన నేపథ్యంలో డ్రాగన్ షూటింగ్ పూర్తిగా నిలిచిపోయిందనే ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.

Update: 2026-08-13 08:39 GMT

జూనియర్ ఎన్టీఆర్‌కు స‌ర్జ‌రీ జరిగిన నేపథ్యంలో డ్రాగన్ షూటింగ్ పూర్తిగా నిలిచిపోయిందనే ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోలేదని, షూటింగ్ ప్లానింగ్‌లో మాత్రమే మార్పులు జరిగాయని తెలుస్తోంది. హీరో అందుబాటులో లేని టైమ్ లో షూట్ చేయ‌గ‌ల సీన్స్, చైల్డ్ ఎపిసోడ్స్, ఇతర టాకీ భాగాలపై యూనిట్ దృష్టి సారించినట్లు సమాచారం.

భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల్లో ఇలాంటి పరిస్థితులకు ప్రత్యామ్నాయ ప్రణాళికల‌ను రెడీగా ఉంచుకోవ‌డం కొత్త విషయమేమీ కాదు. హీరో టెంప‌రరీగా షూటింగ్‌కు దూరమైనా, అందుబాటులో ఉన్న ఇతర షెడ్యూల్స్‌ను వాడుకుని ప్రొడక్షన్‌ను కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో షూటింగ్ పూర్తిగా నిలిచిపోవడం, లేదా యూనిట్ పూర్తిగా రెస్ట్ తీసుకోవడం వంటి పరిస్థితులు ప్రతి సందర్భంలోనూ ఉండవు. డ్రాగన్ విషయంలో కూడా అదే విధమైన షెడ్యూల్ రీడిజైన్ అమల్లోకి వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే ఈ పరిణామం రిలీజ్ డేట్ పై ఎఫెక్ట్ చూపే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారీ యాక్షన్ ఎపిసోడ్స్, కీలక టాకీ భాగాలు ఇంకా షూట్ చేయాల్సి ఉంటే, హీరో రికవరీ టైమ్‌ను బట్టి తదుపరి షెడ్యూల్స్ ఆధారపడే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిలో పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్స్ కూడా తిరిగి ప్లాన్ చేయాల్సి రావచ్చు.

దీంతో డ్రాగన్ రిలీజ్ షెడ్యూల్‌లో మార్పులొస్తే, బాక్సాఫీస్ క్యాలెండర్‌పై కూడా దాని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫెస్టివల్ రిలీజ్ విండోల కోసం పోటీ పడుతున్న ఇతర పెద్ద సినిమాల‌కు అదనపు అవకాశాలు దక్కవచ్చు. థియేటర్ స్క్రీన్ కేటాయింపులు, ఓవర్సీస్ రిలీజ్ ప్లాన్స్, డిస్ట్రిబ్యూషన్ ప్లానింగ్ వంటి అంశాలు కూడా కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారే అవకాశం ఉంది. అయితే రిలీజ్ డేట్‌పై ఫైన‌ల్ క్లారిటీ రావాలంటే మ‌రికొంత కాలం ఆగ‌క మాన‌దు. సెప్టెంబ‌ర్ 3 నుంచి డ్రాగ‌న్ షూటింగ్ తిరిగి మొద‌ల‌వ‌నుండ‌గా, మూడో వారం నుంచి ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో పాల్గొన‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News